తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Ugadi 2023 Simha Rasi Phalalu: శ్రీ శోభకృత్ నామ సంవత్సర సింహ రాశి ఫలాలు

Ugadi 2023 Simha Rasi Phalalu: శ్రీ శోభకృత్ నామ సంవత్సర సింహ రాశి ఫలాలు

HT Telugu Desk HT Telugu

22 March 2023, 9:13 IST

google News
    • Ugadi 2023 Simha Rasi Phalalu: శ్రీ శోభకృత్ నామ సంవత్సరం సింహ రాశి ఫలాలు ఇక్కడ చూడొచ్చు. పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వీటిని అందించారు.
శ్రీ శోభకృత్ నామ సంవత్సర సింహ రాశి ఫలాలు
శ్రీ శోభకృత్ నామ సంవత్సర సింహ రాశి ఫలాలు

శ్రీ శోభకృత్ నామ సంవత్సర సింహ రాశి ఫలాలు

Ugadi 2023 Simha Rasi Phalalu: శ్రీ శోభకృత్ నామ సంవత్సరం సింహ రాశి ఫలాలు

సింహరాశి వారి ఆదాయం-14, వ్యయం - 2, రాజపూజ్యం - 1 అవమానం - 7

శ్రీ శోభకృత్ నామ సంవత్సర సింహ రాశి వారికి అనుకూల ఫలితాలు ఉన్నాయని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం నందు సింహరాశి వారికి చిలకమర్తి పంచాంగ గణనం ఆధారంగా ఈ సంవత్సరం బృహస్పతి భాగ్య స్థానము నందు సంచరిస్తున్నాడు. శని సప్తమ స్థానము నందు సంచరిస్తున్నాడు. రాహువు భాగ్యస్థానము యందు సంచరిస్తున్నాడు. కేతువు 3వ స్థానమునందు సంచరిస్తున్నాడు. ఈ గ్రహ స్థితి కారణంగా సింహరాశి వారికి ఈ సంవత్సరంలో అనుకూలమైనటువంటి ఫలితములు ఉన్నవి.

భాగ్య స్థానమునందు శని, రాహువులు సంచారం వలన సింహరాశి వారికి ధనపరంగా వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా అనుకూలించును. తృతీయ స్థానము నందు కేతువు ప్రభావంచేత వ్యాపారస్తులకు, ఉద్యో గస్తులకు శుభ ఫలితాలు ఏర్పడుచున్నవి. కళత్ర స్థానమునందు శని ప్రభావంచేత రాజకీయ ఒత్తిడులు, కుటుంబమునందు సమస్యలు మరియు భేదాభిప్రాయములు కలుగును. మొత్తం మీద శోభకృత్ నామ సంవత్సరంలో సింహరాశి వారికి గత కొంతకాలముతో పోల్చుకున్న ట్లయితే ఈ సంవత్సరం అనుకూలమైన సంవత్సరము. శుభఫలితాలు కలిగించేటటువంటి సంవత్సరం.

ఉద్యోగులైన సింహ రాశి వారికి రాశి ఫలాలు

సింహరాశివారికి శ్రీ శోభకృత్ నామ సంవత్సరమునందు ఉద్యోగస్తులకు ఉద్యో గము నందు రాజకీయ ఒత్తిడులు పెరుగును. అయినప్పటికి బృహస్పతి అనుకూల ప్రభావం చేత మీయొక్క శ్రమతో తెలివితేటలతో ఉద్యోగము నందు సమస్యలను అధిగమించి శుభ ఫలితాలు పొందెదరు. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి ఉంది.

సింహరాశి వ్యాపారస్తులకు శ్రీ శోభకృత్ నామ సంవత్సరం లాభదాయకముగా ఉన్నది. చిన్న చిన్న చికాకులు ఏర్పడినప్పటికి ఈ సంవత్సరం వ్యాపారస్తులకు మంచి వ్యాపారం జరిగి లాభాలు చేకూర్చును. సింహరాశి విద్యార్థులకు ఈ సంవత్సరం అనుకూలమైన ఫలితాలు ఏర్పడును.

సింహరాశి స్త్రీలు రాజకీయాలకు దూరంగా ఉండాలని సూచన. ఈ సంవత్సరం గత కొంతకాలంతో పోల్చుకున్నట్లయితే అనుకూలమైనటువంటి సంవత్సరం. కుటుంబ సౌఖ్యం మరియు ఆరోగ్యం కలుగును. సింహరాశి రైతులకు మధ్యస్త ఫలితాలు ఉన్నాయి. సింహరాశి సినీరంగం వారికి మధ్యస్త ఫలితాలు ఉన్నాయి. మొత్తం మీద ఈ సంవత్సరం సింహరాశి వారికి కలిసొచ్చేటటువంటి సంవత్సరం.

సింహ రాశివారు ఈ సంవత్సరం మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే ఆదివారం ఆదిత్య హృదయం పారాయణ చేయాలి. అలాగే గురువారం రోజు దత్తాత్రేయుని పూజించటం శుభకరం.

సింహ రాశి నెలవారీ రాశి ఫలాలు

ఏప్రిల్ :- ఈమాసం మీకు మధ్యస్తముగా ఉంది. ఆర్థికపరంగా ఇబ్బందులు. ఖర్చులు నియంత్రించుకోవాలి. వృత్తి ఉద్యోగాలు అనుకూలించును. నిందలు పడతారు. మాసం ద్వితీయార్థం అనుకూలం అభివృద్ధి మరియు లాభాలను అనుభవించే శుభకాలం.

మే:- ఈ మాసం మీకు అనుకూలంగా ఉంది. సామాజికపరంగా ప్రశంసలు పొందుతారు. ఆరోగ్య విషయాలు అనుకూలించును. ప్రమోషన్తో కూడిన కొత్త అవకాశాలు పొందుతారు. కుటుంబసభ్యులు మరియు స్నేహితులు గౌరవిస్తారు.

జూన్:- ఈ మాసం మీకు అనుకూలంగా ఉంది. జీవితంలో ఊహించని లాభాలను తెస్తుంది. అందరి ప్రశంసలు పొందుతారు. వ్యాపారం లాభదాయకము. పదోన్నతి లేదా వేతనాలు పెరిగే అవకాశము.

జూలై :- ఈ మాసం మీకు అనుకూలంగా ఉంది. పెట్టుబడులు లాభదాయకంగా ఉన్నాయి. ఆర్ధిక పరిస్థితి అనుకూలించును. ఆరోగ్యం అనుకూలించును. ప్రయాణాలు లాభించును. అధిక ఖర్చులు చేస్తారు.

ఆగస్టు :- ఈ మాసం మీకు అంత అనుకూలంగా లేదు. మానసిక ఒత్తిళ్ళు శారీరక శ్రమ కలుగును. చెడు సావాసాలను వదులుకొనుట మంచిది. దూర ప్రయాణాలు అనుకూలించవు.

సెప్టెంబర్ :- ఈ మాసం మీకు మధ్యస్తముగా ఉన్నది. గ్రహస్థితి సామాన్యం. బుధుని సంచారం వలన అనుకూలించును. విద్యార్థులకు అనుకూలమైనటువంటి సమయం. మీ మాట తీరుతో అన్నింటా గెలుస్తారు. నూతన వ్యక్తులకు పరిచయాలు లాభిస్తాయి.

అక్టోబర్ :- ఈ మాసం మీకు అనుకూలంగా ఉంది. విద్యార్థులకు విజయం. వ్యాపారం అనుకూలించును. కొత్త వ్యక్తులను కలవడానికి మంచి కాలం. వివాహ అవకాశాలు. వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.

నవంబర్ :- ఈ మాసం మీకు అనుకూలంగా ఉంది. కుటుంబముతో విందు వినోదాలో పాల్గొంటారు. వ్యాపార వృద్ధి. శత్రు వర్గంపై విజయం. అదృష్టం కలసి వస్తుంది. శుభ వార్తలు వింటారు. స్నేహితుల నుండి లాభాలు.

డిసెంబర్ :- ఈ మాసం మీకు అనుకూలంగా ఉంది. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆభరణాలు కొనుగోలుకు ధనమును అధికముగా ఖర్చు చేస్తారు. ప్రయాణ సమయంలో ప్రేమ వ్యవహారాలు అనుకూలించును. ఆర్ధిక వృద్ధి.

జనవరి : – ఈ మాసం మీకు అనుకూలంగా ఉంది. కీర్తి లభించును. కుటుంబంలో ఆనందం. జీవిత భాగస్వామి మరియు పిల్లలతో ఆనందంగా సమయాన్ని గడుపుతారు. కొత్త స్నేహితులు పరిచయమవుతారు.

ఫిబ్రవరి :- ఈ మాసం మీకు అనుకూలంగా ఉంది. పిల్లల విషయంలో సంతోషం. ఆనందకరమైన జీవితాన్ని గడుపుతారు. పరీక్షలలో విజయం సాధిస్తారు.

మార్చి :- ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. అనారోగ్య సూచన. ప్రయాణాలు వాయిదా వేయుట, ఆర్ధిక పరమైన పెట్టుబడులు ఒప్పందాలు చేసే సమయంలో జాగ్రత్త అవసరం.

- పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

 బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ,
తదుపరి వ్యాసం