తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Ugadi 2023 Mithuna Rasi Phalalu: శ్రీ శోభకృత్ నామ సంవత్సర మిథున రాశి ఫలాలు

Ugadi 2023 Mithuna Rasi Phalalu: శ్రీ శోభకృత్ నామ సంవత్సర మిథున రాశి ఫలాలు

HT Telugu Desk HT Telugu

15 March 2023, 9:48 IST

    • Ugadi 2023 Mithuna Rasi Phalalu: శ్రీ శోభకృత్ నామ సంవత్సర మిథున రాశి ఫలాలు 2023 నుంచి 2024 ఉగాది వరకు ఇక్కడ చూడొచ్చు. పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ  వీటిని అందించారు.
మిథున రాశి ఫలాలు ఉగాది 2023
మిథున రాశి ఫలాలు ఉగాది 2023

మిథున రాశి ఫలాలు ఉగాది 2023

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉగాది 2023 మిథున రాశి ఫలితములు

లేటెస్ట్ ఫోటోలు

అదృష్టం అంతా ఈ రాశుల వారిదే.. భారీ ధన లాభం, ఉద్యోగంలో ప్రమోషన్​!

May 04, 2024, 01:28 PM

Lord Mars : కుజుడి కారణంగా ఈ రాశులవారు అన్ని విషయాల్లో జాగ్రత్త

May 04, 2024, 08:26 AM

ఈ రాశుల వారికి కష్ట కాలం.. డబ్బు నష్టం- ఎంత కష్టపడినా దక్కని ఫలితం!

May 04, 2024, 05:51 AM

మే 4, రేపటి రాశి ఫలాలు.. రేపు మేష రాశి నుంచి మీన రాశి వారికి ఎలా గడుస్తుందంటే

May 03, 2024, 08:34 PM

ఈ రాశుల వారికి అహంకారం ఎక్కువ, వీరిటో మాట్లాడడం కష్టం

May 03, 2024, 04:29 PM

Ego Rasis: ఈ రాశుల వారికి కాస్త ఇగో ఎక్కువే.. ఎవరి మాట వినరండోయ్

May 03, 2024, 03:37 PM

ఈ ఏడాది మిథున రాశి వారి ఆదాయ వ్యయాలు: ఆదాయం - 2, వ్యయం - 11, రాజపూజ్యం - 2, అవమానం 4

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం 2023 నుంచి 2024 వరకు మిథున రాశి వారికి అనుకూల ఫలితాలు ఉన్నాయని ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. శ్రీ శోభకృత్ నామ సంవత్సరం నందు మిథునరాశి వారికి చిలకమర్తి పంచాంగ గణనం ఆధారంగా ఈ సంవత్సరం బృహస్పతి లాభ స్థానము నందు సంచరింస్తున్నాడు. శని భాగ్య స్థానము నందు సంచరించుటచేత, రాహువు లాభ స్థానము యందు సంచరిస్తున్నాడు. కేతువు 5వ స్థానమునందు సంచరిస్తున్నాడు. అందువల్ల మిధునరాశి వారికి ఈ సంవత్సరం అనుకూల ఫలితములు ఉన్నవి.

మిథునరాశి వారికి లాభస్థానము గురు, రాహువులు సంచరించుట వలన గత కొంత కాలముగా ఉన్న అనేక సమస్యలు ఒక కొలిక్కి వచ్చేటటువంటి స్థితి ఏర్పడును. ఈ సంవత్సరంలో మిథునరాశి వారికి ధనపరంగా, వ్యాపారపరంగా కలసివచ్చును. శని రాజ్య స్థానమునందు సంచరించుట వలన గత కొంత కాలంగా ఏర్పడిన అనేక సమస్యల నుండి ఈ సంవత్సరం విముక్తి కలుగును. శని అనుకూల ప్రభావం చేత ఉద్యోగస్తులకు శుభఫలితాలు కలుగును. రాహువు కేతువుల యొక్క అనుకూల స్థితి వలన శ్రీ శోభకృత్ నామ సంవత్సరం మిథునరాశి వారికి ప్రతీ పనియందు విజయం కలుగును.

ఉద్యోగస్తులైన మిథున రాశి వారికి రాశి ఫలాలు

మిథున రాశి ఉద్యోగస్తులకు శ్రీ శోభకృత్ నామ సంవత్సరం అద్భుతమైనటువంటి సంవత్సరం. ఈ సంవత్సరం ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, ధనలాభము కలుగును. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి. మిథున రాశి వ్యాపారస్తులకు శ్రీ శోభకృత్ నామ సంవత్సరం నందు లాభదాయకముగా ఉండును. వ్యాపారపరంగా అనుకూల ఫలితాలు పొందెదరు.

మిథున రాశి విద్యార్థులకు ఈ సంవత్సరం శుభఫలితాలు కలుగుతాయి. విదేశీ విద్య కోసం చేయు ప్రయత్నాలు సఫలీకృతమగును. మిథున రాశి రాశి స్త్రీలకు ఈ సంవత్సరం అనుకూలమైన సంవత్సరం. కుటుంబమునందు సౌఖ్యము, ఆనందము కలుగును. మిథున రాశి రైతులకు అనుకూలమైన ఫలితాలున్నాయి.

మిథున రాశి సినీరంగంవారికి ఈ సంవత్సరం అన్ని విధాలుగా కలసి వచ్చును. రాజకీయ రంగం వారికి ఈ సంవత్సరం ఎదురు లేదు. మిథున రాశివారు ఈ సంవత్సరం మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే బుధవారం రోజు విష్ణు సహస్ర నామ పారాయణం చేయాలి. శనివారం రోజు దుర్గాదేవిని పూజించాలి అని పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

మిథున రాశి మాసవారి ఫలాలు

ఏప్రిల్ :- ఈ మాసం మీకు మధ్యస్తముగా ఉన్నది. సంతృప్తికరమైన ఆదాయముంటుంది. శరీరంలో రుగ్మతలు ఏర్పడుతాయి. మీ సంపదలు వృద్ధి చెందుతాయి. కీర్తి విస్తరిస్తుంది. స్నేహితుల నుండి మద్దతు లభిస్తుంది. మరియు అన్ని ప్రయత్నాలలో విజయం పొందుతారు.

మే :- ఈ మాసం మీకు అనుకూలంగా ఉంది. లాభస్థానంలో రవిబుధులు సమస్త ఐశ్వర్యములను కలుగచేస్తాయి. ఆహ్లాదకరమైన జీవనము గడుపుతారు. ఆధ్యాత్మికంగా మీ సంకల్పబలం స్థాయి పెరుగుతుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. ఉద్యోగులకు బదిలీలు పదోన్నతులు.

జూన్:- ఈ మాసం మీకు అనుకూలంగా ఉంది. గౌరవం, ప్రతిష్ట మరియు సమాజంలో మంచి స్థానం. సంతానం మద్దతు, ప్రేమ మీకు ఉంటుంది. మీ ప్రయత్నాలలో విజయం సాధిస్తారు. మరియు వ్యతిరేకతను తారుమారు చేస్తారు. జీవితం విలాసవంతంగా నడుస్తుంది.

జూలై :- ఈ మాసం మీకు అనుకూలంగా ఉంది. వస్తు, వస్త్రాభరణాలు వాహనం మరియు ఆస్తి వృద్ధి. ప్రేమ విషయాలు నెరవేరుతాయి. ఆదాయం కూడా పెరుగుతుంది. మరియు వ్యాపారంలో ఆశించిన లాభాలు గొప్ప సామాజిక ఖ్యాతిని పొందుతారు.

ఆగస్టు :- ఈ మాసం అనుకూలంగా లేదు. కోపాన్ని మరియు నాలుకను అదుపులో ఉంచుకోకుంటే కుటుంబంలోనూ మరియు స్నేహితులతో ఉ ద్రిక్తతలు సమస్యలు కలుగ చేయవచ్చు. రుణాలు ఇవ్వడానికి లేదా రుణం తీసుకోవడానికి ఇది సరైన సమయం కాదు.

సెప్టెంబర్ :- ఈ మాసం అనుకూలంగా ఉంది. ప్రమోషన్ లేదా వేతన పెంపు కల్గుతుంది. వృత్తి విషయాల్లో నైపుణ్యం పురోగతి. ఆనందం, మంచి ఆరోగ్యం మరియు సంపదలో వృద్ధి కలుగుతుంది. ధైర్య స్థానంలో సూర్యుడు శత్రువులను అధిగమించడానికి మీకు కొత్త శక్తిని ఇస్తాడు.

అక్టోబర్ : - ఈ మాసం మీకు అనుకూలంగా ఉంది. మీ ప్రయత్నాలు సానుకూల ఫలితాలను అందిస్తాయి. మీ బంధువులు, కుటుంబ సభ్యులు స్నేహితులు మీ విలువను గుర్తిస్తారు. మరియు మీకు గౌరవం ఇస్తారు. మీరు చాలా మానసిక ప్రశాంతత మరియు ఉపశమనాన్ని అనుభవిస్తారు.

నవంబర్:- ఈ మాసం మీకు అనుకూలంగా ఉంది. ప్రయాణాలు లాభదాయకం. ప్రియమైన వారితో సమయాన్ని గడపడానికి కూడా మీకు అవకాశం లభిస్తుంది. గృహనిర్మాణాలు కలసివస్తాయి. అందమైన ఆహ్లాద కరమైన నూతన గృహంలో నివాసయోగం కలుగుతుంది.

డిసెంబర్ :- ఈ మాసం మీకు అనుకూలంగా ఉంది. సంతోషం మరియు సంతృప్తి సంపద లాభం కల్గుతుంది. మీరు స్నేహితులు మరియు బంధువుల నుండి గౌరవం మరియు గుర్తింపు పొందుతారు. స్పెక్యులేషన్లు వరిస్తాయి. సంతానం వృద్ధి చెందుతుంది.

జనవరి : – ఈ మాసం మీకు మధ్యస్తముగా ఉంది. మీ భాగస్వామి ప్రవర్తన మీకు నచ్చనప్పుడు హాస్య యుక్తి మర్యాద ఉపయోగిస్తే మీకు మరియు తోటివారికి ఉపశమనము కల్గి ఉద్రిక్త తలకు దారితీయకుండా ఉంటుంది. జ్ఞానవృద్ధి, వ్యాపార ప్రయోజనాలను పొందుతారు.

ఫిబ్రవరి :- ఈ మాసం మీకు అంత అనుకూలంగా లేదు. అనారోగ్య సమస్యలు. వైద్య సలహాలు తీసుకోవాలి మీ సామాజిక స్థితి పెరుగుతుంది. విలాసవంతమైన జీవితం కలిగి తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. చట్టపరమైన ఇబ్బందులు కలుగును.

మార్చి: - ఈ మాసం మీకు అంత అనుకూలంగా లేదు. కుటుంబ సభ్యులతో వాదనలకు దిగవద్దు. వృత్తి ఉద్యోగాలలో కష్టపడాల్సినటువంటి కాలం. ఖర్చులను తగ్గించుకోవాలి. కొన్ని అనారోగ్య సమస్యలను అధిగమిస్తారు.

 బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ,