తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  ఈ రాశుల వాళ్ళకు జెలస్ చాలా ఎక్కువ - ఎదుటివారితో కాస్త క్లోజ్ గా ఉన్న తట్టుకోలేరు

ఈ రాశుల వాళ్ళకు జెలస్ చాలా ఎక్కువ - ఎదుటివారితో కాస్త క్లోజ్ గా ఉన్న తట్టుకోలేరు

Gunti Soundarya HT Telugu

10 October 2024, 12:54 IST

google News
    • జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి జాతకం వాళ్ళు పుట్టిన రాశి మీద కూడ ఆధారపడి ఉంటుంది. అలా ఈ రాశి వాళ్ళకు జెలసీ చాలా ఎక్కువ. ఎదుటి వారితో ఫ్రెండ్లీగా మాట్లాడిన తట్టుకోలేరు. నిర్లక్ష్యం వహిస్తే భరించలేరు. అవి ఏ రాశులో తెలుసా?
ఈ రాశుల వాళ్ళకు జెలస్ ఎక్కువే
ఈ రాశుల వాళ్ళకు జెలస్ ఎక్కువే (pixabay)

ఈ రాశుల వాళ్ళకు జెలస్ ఎక్కువే

ప్రేమ, వైవాహిక, కుటుంబ బంధాల్లో మావాళ్లు అనే భావన ఉంటుంది. వాళ్ళు తమకే సొంతం అనే ఫీలింగ్ ఉంటుంది. ప్రేమ, కోపం ఏదైనా సరే తమ మీద చూపించాలని కోరుకుంటారు. కానీ కొన్ని రాశుల వాళ్ళు ఇందులో కాస్త భిన్నంగా ఉంటారు. వీరి అతి ప్రేమ తట్టుకోలేరు.

లేటెస్ట్ ఫోటోలు

కొత్త సంవత్సరం తొలి వారం నుంచి ఈ రాశుల వారికి బంపర్ లక్.. ధనయోగం, ఇతరుల నుంచి మద్దతు!

Dec 21, 2024, 05:03 PM

ఇతరులు ఈర్ష పడేలా ఈ 3 రాశుల భవిష్యత్తు- ఇల్లు కొంటారు, డబ్బుకు లోటు ఉండదు!

Dec 21, 2024, 05:40 AM

బుధాదిత్య రాజయోగం: ఈ మూడు రాశుల వారికి మారనున్న అదృష్టం.. లాభాలు, సంతోషం దక్కనున్నాయి!

Dec 20, 2024, 02:27 PM

ఇంకొన్ని రోజులు ఓపిక పడితే ఈ రాశుల వారికి ఆర్థిక కష్టాలు దూరం- భారీ ధన లాభం, జీవితంలో సక్సెస్​!

Dec 20, 2024, 06:01 AM

కొత్త సంవత్సరానికి ముందు బుధుడి నక్షత్ర సంచారంతో ఈ రాశులకు అదృష్టం

Dec 19, 2024, 01:51 PM

ఈ తేదీల్లో పుట్టిన వారికి 2025లో లక్కే లక్కు.. ప్రేమలో గెలుపు, ఆర్థిక లాభాలు ఇలా ఎన్నో ఊహించని మార్పులు

Dec 19, 2024, 09:49 AM

తమతో కాకుండా వేరే వాళ్ళతో కాస్త ప్రేమగా మాట్లాడినా సరే అసలు తట్టుకోలేరు. జెలసీగా ఫీలవుతారు. కొంత పరిధి వరకు ఇది బాగానే ఉంటుంది. కానీ పరిమితి దాటితే మాత్రం భరించడం కష్టంగా ఉంటుంది. అలా అతి ప్రేమ చూపిస్తూ ఎదుటి వారిని కాస్త ఇబ్బంది పెట్టె రాశులు ఏవో చూద్దాం.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వాళ్ళు తీవ్రమైన భావోద్వేగాలు కలిగి ఉంటారు. తమ భాగస్వామితో లోతైన అనుబంధం కలిగి ఉంటారు. ప్రియమైన వాళ్ళు ప్రత్యేకంగా వారికే చెందాలని కోరుకుంటారు. ఇది కొన్ని సార్లు అసూయకు దారి తీస్తుంది. తమ భాగస్వామి ఇతరుల మీద ప్రేమ చూస్తే తట్టుకోలేరు. అలిగి బుంగ మూతి పెట్టేసుకుంటారు.

వృషభ రాశి

వృషభ రాశి వాళ్ళు ధృడంగా ఉంటారు. సంబంధాలలో స్థిరత్వానికి విలువ ఇస్తారు. తమ భాగస్వామి వారి మీద కాకుండా పక్కకి దృష్టి మళ్లిందంటే చాలు అసలు తట్టుకోలేరు. కుళ్ళు, అసూయతో రగిలిపోతారు. వీరి మితిమీరిన ప్రేమ ఒక్కోసారి ఇబ్బంది కలిగిస్తుంది. జెలసీగా ఫీల్అవడంలో వీరి తర్వాతే ఎవరైనా.

సింహ రాశి

సింహ రాశి వాళ్ళు ఆత్మవిశ్వాసంతో ఉంటారు. ఉదారంగా, ఆప్యాయంగా ఉంటారు. ఎదుటి వారిని ఎక్కువగా డిమాండ్ చేసే పద్ధతిగా ఉంటారు. తమ భాగస్వామి తమ పట్ల అంకిత భావంతో ఉండాలని కోరుకుంటారు. వారిని ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తారు. వీళ్ళను కాకుండా ఎదుటి వాళ్ళను కాస్త మెచ్చుకున్నా సరే ఉడుక్కుంటారు. అసూయ ప్రదర్శిస్తారు. తమకి కాకుండా వేరే వాళ్ళకు ఇంపార్టెన్స్ ఇచ్చారో ఇక వారి అవుట్.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వాళ్ళు చాలా భావోద్వేగంగా ఉంటారు. తమ ప్రియమైన వారి నుంచి ఎప్పుడు రక్షణను కోరుకుంటారు. తమనే చూసుకోవాలి, అన్నీ తమకే పెట్టాలని కోరుకుంటారు. బంధానికి బీటలు వారుతున్నాయని అనిపిస్తే అసలు తట్టుకోలేరు. ఎదుటి వారితో కాస్త క్లోజ్ గా ఉన్నా భయపడిపోతారు. ఎక్కడ వాళ్ళు దూరమైపోతారో, తమని మర్చిపోతారో అని ఆందోళన చెందుతారు. ఇది అసూయకు దారి తీస్తుంది. కొన్ని సార్లు వీరి అసూయ, అతి ప్రేమ వాళ్ళు కోరుకున్న ప్రేమను కూడా దూరం చేసే ప్రమాదం ఉంది.

మేష రాశి

మేష రాశి వాళ్ళు ఉద్వేగభరితంగాను, ధృడంగాను ఉంటారు. పోటీతత్వ స్వభావం ఎక్కువగా ఉంటుంది. ప్రియమైన వాళ్ళు నిర్లక్ష్యం చేసినా, అసురక్షితంగా అనిపించినా అసలు తట్టుకోలేరు. జెలసీగా ఫీలవుతారు. భాగస్వామి జీవితంలో తాము తప్ప మరెవరూ ఉండకూడదు అనే ధోరణి వీళ్ళది.

గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.

తదుపరి వ్యాసం