Emotional zodiac signs: ఈ రాశుల జాతకుల అమ్మాయిలకు భావోద్వేగాలు ఎక్కువ..-building emotional intelligence understanding zodiac signs ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Emotional Zodiac Signs: ఈ రాశుల జాతకుల అమ్మాయిలకు భావోద్వేగాలు ఎక్కువ..

Emotional zodiac signs: ఈ రాశుల జాతకుల అమ్మాయిలకు భావోద్వేగాలు ఎక్కువ..

Gunti Soundarya HT Telugu
Feb 20, 2024 12:16 PM IST

Emotional zodiac signs: కొన్ని రాశుల జాతకులు ఆనందం కలిగినా బాధ కలిగినా భావోద్వేగాలను ఆపుకోలేరు. వీరిని అర్థం చేసుకోవడం కష్టం. ఇంతకీ ఆ రాశులు ఏవో తెలుసా?

భావోద్వేగంగా ఉండే రాశులు ఇవే
భావోద్వేగంగా ఉండే రాశులు ఇవే (pexels)

Emotional zodiac signs: దంపతుల మధ్య ప్రేమ, ఎఫెక్షన్, భావోద్వేగాలు తప్పనిసరిగా ఉండాలి. అప్పుడే ఆ జంట జీవితం చాలా సాఫీగా ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా సాగిపోతుంది. అయితే కొన్ని రాశుల జాతకులకు భావోద్వేగాలు ఎక్కువ. వారిని అర్థం చేసుకోవడం వల్ల భాగస్వామ్యాలు నిలబడతాయి.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి వృత్తి, ప్రేమ జీవితం, ఆరోగ్యం, ఆర్థిక స్థితితో సహ జీవితానికి సంబంధించిన అనేక అంశాలు అంచనా వేస్తారు. జాతకం ప్రకారం మన జీవితం ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు. కొన్ని రాశుల జాతకులు చాలా భావోద్వేగానికి లోనవుతారు. బాధ, సంతోషం ఏదైనా కన్నీటి ద్వారా వ్యక్తపరుస్తారు.

జీవిత భాగస్వామి చేసే చిన్న చిన్న తప్పులకు కూడా కోపగించుకుంటారు కానీ భాగస్వామి పట్ల చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. పక్కవారి బాధని తమ బాధగా ఫీలవుతారు. వారితో త్వరగా కనెక్ట్ అవుతారు. అలాంటి వారిని అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఇలాంటి వాళ్ళు ఇతరుల కంటే కొద్దిగా భిన్నంగా ఉంటారు. చిన్న సమస్య వచ్చినా కూడ ఎమోషనల్ అయిపోతారు. ఇంతకీ ఆ రాశులు ఏవో తెలుసుకుందామా?

మిథునం

మిథున రాశి వారి కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా బాగుంటాయి. పరిస్థితులకు తమని తాము అనుగుణంగా మార్చుకోవడానికి ఇష్టపడతారు. భాగస్వామికి సంబంధించి ప్రతి క్షణం చిరస్మరణీయంగా ఉంచుకునేందుకు ప్రయత్నిస్తారు. అయితే వారి కోపం కారణంగా అప్పుడప్పుడు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వీరి ప్రేమ జీవితంలో రొమాన్స్ కి కొదవ లేదు కానీ తొందర పాటు నిర్ణయాల వల్ల కొన్ని సార్లు సమస్యలు వస్తాయి. అందుకే ఈ రాశి వారు ఆవేశంగా కాకుండా ఆలోచించి అడుగులు వేయాలి.

సింహం

సింహ రాశి అమ్మాయిలు రిలేషన్ షిప్ లో తమ భావాలని నిర్మొహమాటంగా వ్యక్తపరుస్తారు. వారి భావోద్వేగాలను భాగస్వామితో పంచుకోవడానికి వెనుకాడరు. రిలేషన్ షిప్స్ లో ప్రేమ, రొమాన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. లవ్ లైఫ్ లో కొత్త విషయాలు అన్వేషించడానికి ఇష్టపడతారు. అయితే వీరిలో ఉండే మూడ్ స్వింగ్స్ అర్థం చేసుకోవడం కష్టమే. సంతోషంగా ఉన్నప్పటికీ భాగస్వామితో తరచుగా విభేదాలు వస్తాయి. వాటిని పరిష్కరించుకుంటే వీరి లైఫ్ అద్భుతంగా ఉంటుంది.

తులా రాశి

తులా రాశి వారి ప్రేమ జీవితం చాలా బాగుంటుంది. కానీ బంధంలో భావోద్వేగాలు ఉన్నట్టుండి మారిపోతాయి. ఈ ప్రవర్తన వల్ల కొన్ని సార్లు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాన్ని సమతుల్యం చేసుకునేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తారు. తమ భాగస్వామితో నాణ్యమైన సమయం గడిపేందుకు ఇష్టపడతారు. కానీ ఏదో ఒక విషయం గురించి లేవనెత్తి ఎప్పుడూ ఎమోషనల్ అవుతారు. రిలేషన్ షిప్ లో అలజడి రాకుండా ఉండాలంటే సంతోషకరమైన క్షణాలు మాత్రమే గుర్తు పెట్టుకోవాలి.

ఒకరినొకరు అర్థం చేసుకుంటూ నమ్మకంగా, బాధ్యతగా ఉంటే ఆ జీవితం సాఫీగా కలతలు లేకుండా సాగిపోతుంది. భాగస్వాముల భావోద్వేగాలను అర్థం చేసుకుంటే ఏ సమస్యలూ ఉండవు.