పూజ చేసేటప్పుడు మీరు ఈ ఐదు పనులు తప్పకుండా చేయండి- ఒత్తిడి, ఆందోళన తొలగిపోతాయి-do these five things on puja time to cleanse your home to remove negative energy ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  పూజ చేసేటప్పుడు మీరు ఈ ఐదు పనులు తప్పకుండా చేయండి- ఒత్తిడి, ఆందోళన తొలగిపోతాయి

పూజ చేసేటప్పుడు మీరు ఈ ఐదు పనులు తప్పకుండా చేయండి- ఒత్తిడి, ఆందోళన తొలగిపోతాయి

Gunti Soundarya HT Telugu
Sep 11, 2024 10:00 AM IST

ఇంట్లో సానుకూల వాతావరణం ఏర్పడేందుకు, ఒత్తిడి, ఆందోళన తొలగించుకునేందుకు ప్రతిరోజు పూజ సమయంలో ఈ ఐదు పనులు చేయడం ఉత్తమం. వీటి వల్ల ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. సమస్యలు తొలగిపోయి ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది.

పూజ చేసేటప్పుడు ఇవి చేయండి
పూజ చేసేటప్పుడు ఇవి చేయండి

ప్రతి ఇంటికి దాని సొంత శక్తి ఉంటుంది. అవి ఇంట్లో ఉండే సభ్యుల మీద ప్రభావం చూపిస్తాయి. ప్రతికూల శక్తులు ఉంటే కుటుంబం మీద చెడు దృష్టి ఉంటుంది. ఏ పని తలపెట్టినా అందులో అవాంతరాలు, ఆటంకాలు, నష్టాలు సంభవిస్తాయి. అదే సానుకూల శక్తి ఉంటే కుటుంబంలో ఆనందకర వాతావారణం ఏర్పడుతుంది.

మన కంటికి కనిపించకుండా ఉండే ప్రతికూల శక్తులను ఇంటి నుంచి తరిమెసెందుకు కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటించవచ్చు. ఇవి ఖర్చుతో కూడుకున్న పనులు కావు. సింపుల్ గా చేసే పరిహారాలు. ప్రతి ఒక్కరూ ఇంట్లో చేసే పూజ ద్వారానే ఇంట్లోని నెగటివ్ ఎనర్జీని బయటకు తరిమేయవచ్చు.

దీపం వెలిగించడం

సానుకూలత, కాంతితో మాత్రమే చీకటిని జయించగలుగుతారు. అందువల్ల రోజువారీ పూజ సమయంలో మీరు ఒక దీపం నెయ్యితో వెలిగించండి. స్వచ్చత, సానుకూలతకు ఇది చిహ్నం. చిన్న దీపం ఇంట్లోని చీకటిని జాయిస్తుంది. ప్రతికూల శక్తులను పారద్రోలుతుంది. ఇంటికి లక్ష్మీదేవిని ఆహ్వానిస్తుంది.

ధూపం వేయడం

ఇంట్లో ధూపం వేయడం వల్ల ప్రతికూల, స్తబ్దత శక్తులు తొలగించుకునేందుకు అద్భుతమైన మార్గం. ధూపం కర్రలు కొన్ని పూలు, రీఫ్రెష్ సువాసనలతో నిండి ఉంటాయి. దీని నుంచి వెలువడే పొగను ఇంటి మొత్తం నింపుకోవచ్చు. ఈ సువాసన ప్రతి గదిని కప్పేస్తుంది. ఇంట్లో శక్తిని రీఫ్రెష్ చేస్తుంది. ప్రతికూల ఆలోచనలు, భావోద్వేగాలను తొలగించడంలో సహాయపడుతుంది.

గంట మోగించడం

ఇంట్లో పూజ చేసుకున్నప్పుడు తప్పనిసరిగా గంట మోగిస్తారు. మంత్రోచ్చారణ సమయంలో గంటను మోగించడం మన సంప్రదాయంలో ఒక భాగం. ఇది ఇంటిని శుభ్రపరిచేందుకు ఉపయోగపడుతుంది. దీని ద్వారా వచ్చే ధ్వని కంపనాలు ప్రతికూల శక్తులను తొలగిస్తాయి, స్థలాన్ని శుద్ధి చేస్తాయి. గంటను మోగించడం వల్ల ఇల్లు సానుకూల శక్తులతో నింపుతుంది.

శంఖం ఊదడం

పూజ సమయంలో కొందరు శంఖం ఊదడం చేస్తారు. దీని నుంచి వెలువడే ధ్వని శుభప్రదమైనది, స్వచ్చమైనది. పూజ ప్రారంభానికి గుర్తుగా ఉపయోగిస్తారు. శంఖం ఊదడం ద్వారా వచ్చే శక్తివంతమైన ధ్వని పర్యావరాణాన్ని శుభ్రపరుస్తుంది. సానుకూల శక్తిని ఆకర్షించి ఇంటికి దైవిక గుణాన్ని ఇస్తుందని నమ్ముతారు. ఒత్తిడిని తొలగిస్తుంది. మానసిక ప్రశాంతతను ఇస్తుంది.

మంత్రాలు పఠించడం

రోజువారీ పూజ సమయంలో కొన్ని మంత్రాలు పఠించడం చేస్తూనే ఉంటారు. శ్లోకం లేదా మంత్రం ఏదైనా 108 సార్లు జపించవచ్చు. ఓం శబ్ధంతో ప్రారంభమయ్యే మంత్రాలు పఠించడం ఇటు ఇంటికి, అటు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. పరిసరాలను సానుకూల శక్తులతో నింపుతుంది. మంత్రాలను బిగ్గరగా జపించినా లేదా మనసులో ఏకాగ్రతతో జపించినా మంచిదే. మీకు వీలైతే ప్రతిరోజు గాయత్రీ మంత్రం, మహా మృత్యుంజయ మంత్రం, ఓం వంటివి 108 సార్లు జపించడానికి ప్రయత్నించండి. మీ మనసు కూడా తేలికపడుతుంది. ఆందోళనలు తొలగిపోతాయి.

గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.