తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Peacock Feathers: ఇంట్లో నెమలి ఈకలను ఉంచడం మంచిదేనా? వీటి వల్ల ఇంటికి ఎలాంటి మేలు జరుగుతుంది?

Peacock feathers: ఇంట్లో నెమలి ఈకలను ఉంచడం మంచిదేనా? వీటి వల్ల ఇంటికి ఎలాంటి మేలు జరుగుతుంది?

Haritha Chappa HT Telugu

23 October 2024, 9:00 IST

google News
    • Peacock feathers: ఎంతోమందికి ఇంట్లో నెమలి ఈకలు పెట్టుకోవచ్చా లేదా అనే సందేహం ఉంటుంది. కొందరు వద్దని చెబితే, మరికొందరు నెమలి ఈకలు పెట్టుకోవచ్చని అంటారు. మరి వాస్తు శాస్త్రం ఏం చెబుతోందో తెలుసుకోండి. వాస్తు నియమాల ప్రకారం నెమలి ఈకలను ఇంట్లో ఉంచడం ఇంటి నిర్మాణ లోపాలు తొలగిపోతాయని అంటారు.
నెమలి ఈకలు ఇంట్లో పెట్టుకోవచ్చా?
నెమలి ఈకలు ఇంట్లో పెట్టుకోవచ్చా?

నెమలి ఈకలు ఇంట్లో పెట్టుకోవచ్చా?

హిందూ మతంలో, దేవతలకు నెమలి ఈకలు అత్యంత ప్రియమైనవిగా చెప్పుకుంటారు. లక్ష్మీదేవి, వినాయకుడు, కార్తికేయుడు, ఇంద్రుడు, లక్ష్మీదేవి అందరికీ నెమలి ఈకలు ఎంతో ఇష్టమని అంటారు. నెమలి ఈకలు ఇంటి అందాన్ని పెంచుతాయి. అయితే ఎక్కువ మందిలో ఉన్న సందేహం నెమలి ఈకలు ఇంట్లో ఉంచుకోవచ్చా? లేదా అనేది. కొందరు నెమలి ఈకలు ఇంట్లో పెట్టుకుంటే మంచిదని చెప్పుకుంటారు, కానీ కొందరు మాత్రం వాటిని ఇంట్లో ఉంచితే కొన్ని సమస్యలు కలిగే అవకాశం ఉందని అంటారు. మరి నెమలి ఈకలు ఇంట్లో ఉంచే విషయంలో వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో నెమలి ఈకలు ఉంచడం మంచిదా? కాదా?

లేటెస్ట్ ఫోటోలు

ఇంకొన్ని రోజులు ఓపిక పడితే ఈ రాశుల వారికి ఆర్థిక కష్టాలు దూరం- భారీ ధన లాభం, జీవితంలో సక్సెస్​!

Dec 20, 2024, 06:01 AM

Brain health: ఈ ఆహారాలతో మీ పిల్లల మెదడును మరింత చురుకుగా చేయండి

Dec 19, 2024, 10:08 PM

New year resolutions: న్యూ ఇయర్ సందర్భంగా 7 బెస్ట్ రెజొల్యూషన్స్

Dec 19, 2024, 09:35 PM

Kia Syros: కియా సైరోస్.. ప్రీమియం ఫీచర్స్ తో బాక్సీ లుక్ కాంపాక్ట్ ఎస్ యూవీ

Dec 19, 2024, 09:09 PM

Telangana Tourism : ప్రకృతి అందాలు.. చారిత్రక కట్టడాలు.. ఓరుగల్లు నగరం పర్యాటకులకు స్వర్గధామం

Dec 19, 2024, 06:26 PM

Top Horror Thriller Movies 2024: ఈ ఏడాది హాలీవుడ్ టాప్ 10 హారర్ థ్రిల్లర్ మూవీస్ ఇవే.. ఐఎండీబీ రేటింగ్స్ ప్రకారం..

Dec 19, 2024, 05:41 PM

నెమలి ఈకలు ఇంట్లో పెడితే ఏమవుతుంది?

వాస్తు శాస్త్రం ప్రకారం నెమలి ఈకలు ఇంటికి ఎంతో మంచి చేస్తాయి. వాటిని ఇంట్లో ఉంచడం వల్ల నెగెటివ్ ఎనర్జీని దూరం చేస్తాయి. ఇంట్లో సుఖసంతోషాల కోసం వాస్తు నియమాల ప్రకారం నెమలి ఈకలను ఉంచడం శుభప్రదమేనని చెప్పాలి. అయితే నెమలి ఈకల కోసం నెమళ్లను వేధించి, బాధపెట్టి వాటిని సేకరించకూడదు. నెమలి డ్యాన్స్ చేసినప్పుడు లేదా ఎగిరి ఎక్కడైనా కూర్చున్నప్పుడు రెక్కలు ఒక్కోసారి విరిగి కింద పడతాయి. అలాంటి నెమలి ఈకలను తీసుకొని ఇంట్లో పెట్టుకోవచ్చు. ఇంటిలోని నెగిటివిటీని తొలగించడానికి నెమలి ఈకలను ఎక్కడ ఉంచాలో తెలుసుకోండి.

నెమలి ఈకలను ఇంట్లో ఎక్కడ పెట్టాలి?

వాస్తు ప్రకారం నెమలి ఈకలను ఇంట్లోని కొన్ని చోట్ల ఉంచడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. ఇంట్లోని నెమలి ఈకలను ఎక్కడ ఉంచితే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకోండి.

వాస్తు ప్రకారం, ఇంట్లోని వాస్తు లోపాలను వదిలించుకోవడానికి నెమలి ఈకలను ఆగ్నేయ ప్రాంతంలో ఉంచడం శుభప్రదంగా భావిస్తారు.

రాహువు కోపాన్ని నివారించడానికి, నెమలి ఈకలను ఇంట్లోని తూర్పు లేదా ఈశాన్య గోడపై ఉంచవచ్చు. ఈ దిశలో నెమలి ఈకలను ఉంచడం ద్వారా సంపద పెరుగుతుందని నమ్ముతారు.

వాస్తు ప్రకారం, ఇంటికి దక్షిణ దిశలో ఉన్న గోడపై నెమలి ఈకలను ఉంచడం వల్ల ఆర్థిక సమస్యలు దూరం అవుతాయి. డబ్బుకు కొరత ఉండదు.

వైవాహిక జీవితంలోని సమస్యలను అధిగమించడానికి పడకగదిలో నెమలి ఈకలను పెట్టుకోవచ్చు. ఇది ప్రేమ సంబంధాలకు మాధుర్యాన్ని తెస్తుందని నమ్ముతారు. పడకగదికి నైరుతి దిశలో నెమలి ఈకలను ఉంచాలి.

మీరు చదుకునే పుస్తకాల మధ్యలో నెమలి ఈకలను ఉంచడం వల్ల సరస్వతీ దేవి అనుగ్రహం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.

వాస్తు నియమాల ప్రకారం నెమలి ఈకలను విరిగిన సామానుతో ఉంచకూడదు. ఇది నెమలి ఈకలోని పాజిటివ్ ఎనర్జీని తొలగిస్తుంది.

(గమనిక: ఈ వ్యాసంలో ఇచ్చిన సమాచారం పూర్తిగా ఖచ్చితమైనదని మేము నిర్ధారించడం లేదు. వీటిని ఫాలో అయ్యే ముందు ఆ రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి. మేము సమాచారాన్ని మాత్రమే మీకు అందిస్తున్నాము.)

తదుపరి వ్యాసం