తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  కొత్త వ్యక్తులను చూడగానే ఎక్కడో చూసినట్టుందే అనిపిస్తుందా? గత జన్మలో వారికీ మీకు సంబంధం ఉందేమో తెలుసుకోండి!

కొత్త వ్యక్తులను చూడగానే ఎక్కడో చూసినట్టుందే అనిపిస్తుందా? గత జన్మలో వారికీ మీకు సంబంధం ఉందేమో తెలుసుకోండి!

Ramya Sri Marka HT Telugu

Published Dec 04, 2024 02:35 PM IST

google News
    • Past Life Signs: అప్పటివరకూ పరిచయం లేని వ్యక్తుల్ని కలిసిన వెంటనే వాళ్లతో మనకు ఎప్పటి నుంచో అనుబంధం ఉందనే ఫీలింగ్ కలుగుతుందా.. మీరు గత జన్మలలో వారితో పరిచయం ఉన్న వారనే దానికి ఇది సంకేతమని వీటి ద్వారా తెలుసుకోండి.
గత జన్మ సంబంధాలను గుర్తించడం ఎలా?

గత జన్మ సంబంధాలను గుర్తించడం ఎలా?

హిందూ పురాణాలు, బౌద్ధ ధర్మంతో ఇతర ఆధ్మాత్మిక విషయాల్లో పునర్జన్మ గురించి స్పష్టంగా రాసి ఉంది. గత జన్మల కర్మల ఫలితంగా పునర్జన్మ ఆధారపడి ఉంటుందని పేర్కొని ఉంది. అలా జన్మించిన వారు గత జన్మ తాలూకు బంధాలను, బాకీలను తీర్చుకోవడానికి మరొకరితో కలుస్తారు. అలా కలిసినప్పుడు ఏం జరుగుతుంది? అది మనం ఎలా తెలుసుకోవాలనే ప్రశ్నలకు సమాధానం తెలుసుకుందాం రండి. అనుభూతి లేదా ప్రత్యేక అనుభవం, వేగంగా సంబంధం ఏర్పరచుకోవడం, పరిచయం లేకుండా ఫీలింగ్స్ ఒకేలా అనిపించడం, ఇద్దరికీ ఒకేలాంటి సంఘటనలు గుర్తుకు వస్తుండటం వంటివి గత జన్మ జ్ఞాపకాల్లో ఒకటి కావొచ్చు. ఈ కింది వాటిలో అటువంటి లక్షణాలేమైనా ఉన్నాయేమో చెక్ చేసుకోండి.


లేటెస్ట్ ఫోటోలు

జులై 10 రాశి ఫలాలు.. ఈ రాశి వారికి ప్రమోషన్లు, ప్రశంసలు

Jul 09, 2025, 08:35 PM

గజలక్ష్మీ రాజయోగం.. ఈ 4 రాశుల వారికి అన్నింటా అదృష్టం.. పదోన్నతులు, విదేశీ ప్రయాణాలు

Jul 08, 2025, 09:48 PM

ఈ రెండు రాశుల వారు ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి; 9 జూలై 2025 రాశి ఫలాలను ఇక్కడ చూడండి

Jul 08, 2025, 08:20 PM

జులై 8 రాశి ఫలాలు.. ఈ నాలుగు రాశుల వారికి అనుకూల ఫలితాలు..

Jul 07, 2025, 08:50 PM

రేపు జూలై 6 ఆదివారం దేవశయని ఏకాదశి.. ఆ రోజు మీ రాశిఫలాలను ఇక్కడ చూడండి..

Jul 05, 2025, 08:29 PM

ఈ 5 రాశుల వారికి కలిసి రానున్న కాలం.. ఇల్లు కొనుగోలు, ఆదాయం, ప్రమోషన్స్, విదేశీయానం, మానసిక ప్రశాంతత!

Jul 05, 2025, 11:36 AM

కళ్లతోనే భావాలు:

మనసుకు అద్దం మొఖం అయితే మన ఆత్మను ప్రతిబింబించేవి కళ్లే. గత జన్మలో ఎదుటి వ్యక్తితో మనకున్న అనుబంధాన్ని అవతలి వ్యక్తి కళ్లే తెలియజేస్తాయి.

ప్రశాంతత:

ఆ వ్యక్తులను కలిసిన వెంటనే మీకొక ప్రశాంతత, ఒత్తిడి నుంచి ఉపశమనం లాంటివి కనిపిస్తుంటాయి. అదేదో మీరు చాలా సంవత్సరాల నుంచి స్నేహితులు అనే భావన కల్గుతుంటుంది.

చెప్పకుండానే భావాలు తెలుసుకోగలగడం:

ఆ వ్యక్తి చెప్పకుండానే అతని మాటల్లో భావం అర్థమైపోతుంటుంది. వారి మాటలు పూర్తి కాకుండానే మనకు వారి భావం తెలిసిపోతుంది. ఆత్మానుబంధం చేత ప్రతి ఒక్క ఆలోచనను ఫీల్ అవగలం.

ఒకే రకమైన స్మృతులు:

ఆలోచనలను పంచుకుంటున్నప్పుడు మీరిద్దరూ కలిసి ఇంతకుముందెప్పుడూ ప్రయాణించకపోయినా, ఒకేలాంటి గత స్మృతులు ఉంటాయి. ఇద్దరూ కలిసి ఆ ప్రదేశానికి వెళ్లకపోయినా సరే మీ మనస్సులో అక్కడ జరిగిన జ్ఞాపకాలు నిండి ఉంటాయి.

ఏదో ఒక రూపంలో ఎమోషన్స్:

గత జన్మలో ఇద్దరి మధ్యనున్న ఎమోషన్స్ ఏదో ఒక రూపంలో బయటకు వస్తుంటాయి. ఆ వ్యక్తిని చూడగానే ప్రేమ, కోపం, విచారం లాంటివి స్పష్టంగా కనిపిస్తాయి. ఒక్కోసారి వారు మన చుట్టూ ఉన్నప్పుడు కూడా ఇలా అనిపిస్తుంటుందట.

స్ట్రాంగ్ లైఫ్ టైం కనెక్షన్:

ఒకరినొకరు అర్థం చేసుకోగలగడం, చెప్పకుండానే ఒకరి ఆలోచనలను మరొకరికి స్పష్టంగా తెలియజేయకుండానే వారిద్దరి మధ్య స్ట్రాంగ్ లైఫ్ టైం కనెక్షన్ అనేది ఏర్పడి ఉంటుంది.

పరస్పరం ఎదుగుదల:

పాత పద్ధతులను అనుసరించి పనిచేయడం, పాత సమస్యలను పరిష్కరించుకున్న విధానం ఒకే రకంగా అనిపిస్తాయి. అటువంటి వారు కలిసి ఏదైనా పని తలపెడితే పరస్పరం ఎదగడంతో పాటు సమస్యలు లేకుండా గడపగలరు.

విషయ ప్రస్తావన:

ఆ కొత్త వ్యక్తిని చూడగానే గతంలో మాట్లాడుకున్న విషయాన్ని ప్రస్తావించాలని అనిపిస్తుంది. అప్పుడే కలిసినప్పటికీ కూడా దాని ఫలితం గురించి ఆరా తీయాలని అనిపిస్తుంది.

ఈ గుర్తులన్నీ ఎదుటి వ్యక్తి మనకు గతంలో తారసపడ్డాడా లేదా తారసపడిందా అనే విషయాలు తెలియజేస్తున్నాయి. అలా అని గతం తాలూకు చేదు విషయాలు గుర్తుంచుకుని ప్రస్తుత సమయాన్ని వృథా చేసుకోకండి. కొత్తగా పరిచయమైన వ్యక్తి గురించి గతంలో రిలేషన్ బాగుంటే అలానే ఉండేందుకు ట్రై చేయండి. లేదా కొత్త వ్యక్తులుగానే చూసి పరిచయం పెంచుకునేందుకు ప్రయత్నించండి.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.