తెలుగు న్యూస్ / ఫోటో /
Love Marriage: ప్రేమ వివాహం చేసుకోవాలనుకుంటున్నారా.. అయితే ఈ గ్రహాల అనుగ్రహం మీపై ఉండాల్సిందే!
- Love Marriage: వ్యక్తి పుట్టిన సమయాన్ని బట్టి గ్రహాల గుర్తులు వారి జీవితంలో అన్ని విషయాలను ప్రభావితం చేస్తాయి. సంతోషం, శ్రేయస్సు, వివాహం వంటి ప్రతి అంశాన్ని శాసించగల శక్తి గ్రహాలకు ఉంది. గ్రహాల స్వభావాలను బట్టి ప్రేమ వివాహంలో విజయం పొందాలనుకునే వారికి కొన్ని గ్రహాల ఆశీర్వాదం తప్పనిసరిగా ఉండాలి.
- Love Marriage: వ్యక్తి పుట్టిన సమయాన్ని బట్టి గ్రహాల గుర్తులు వారి జీవితంలో అన్ని విషయాలను ప్రభావితం చేస్తాయి. సంతోషం, శ్రేయస్సు, వివాహం వంటి ప్రతి అంశాన్ని శాసించగల శక్తి గ్రహాలకు ఉంది. గ్రహాల స్వభావాలను బట్టి ప్రేమ వివాహంలో విజయం పొందాలనుకునే వారికి కొన్ని గ్రహాల ఆశీర్వాదం తప్పనిసరిగా ఉండాలి.
(1 / 6)
శుక్రుడు (Venus): జ్యోతిషశాస్త్రంలో శుక్రుడు కీలక పాత్ర పోషిస్తాడు. ప్రేమ, వివాహం, శృంగారం సంబంధించిన విషయాల్లో బలమైన ప్రభావం చూపిస్తాడు. మీ భాగస్వామితో ఆకర్షణ, ఇంద్రియ జ్ఞానం, లోతైన భావోద్వేగ లక్షణాలకు శుక్రుడు ప్రతీక. ప్రేమ వివాహంలో విజయం పొంది సంతోషంగా జీవించాలంటే శుక్రుడ అనుగ్రహం తప్పనిసరి. మీ శృంగార జీవితానికి ఆనందం, సామరస్యం మరియు అందాన్ని తెస్తుంది. (pixabay)
(2 / 6)
అంగారకుడు(Mars):అంగారకుడు వివాహానికి ఉత్సాహభరితమైన కోణాన్ని జోడిస్తాడు.జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అంగారకుడు ప్రేమ, అభిరుచి, సంతోషం, శక్తికి ప్రతీక. ఈ గ్రహం అనుకూలంగా లేకపోతే ప్రేమ బంధంలో దూకుడు స్వభావం పెరిగి విభేదాలు, ఉద్రేకాలను దారితీస్తుంది. శృంగార జీవితంలో కూడా అసమతుల్యత ఏర్పడుతుంది.
(3 / 6)
బుధుడు (Mercury): ఏ బంధం అయినా నిలబడాలంటే ఇద్దరి మధ్య సంభాషణ చాలా ముఖ్యం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధులు ఆలోచన, వ్యక్తీకరణ, సంభాషణలను ప్రభావితం చేస్తాడు. బుధుడి అనుగ్రహం లేకుంటే భాగస్వామితో స్పష్టంగా, నిజాయితీగా మాట్లాడలేరు. మీ భావాలను సులభంగా వ్యక్తపరచలేరు. బుధుడి ఆశీర్వాదం ఉండే ప్రేమ జీవితంలో బలమైన, శాశ్వతమైన బంధాన్ని ఏర్పరుచుకోవచ్చు. (pixabay)
(4 / 6)
చంద్రుడు (Moon): భావోద్వేగాలు, సహజమైన స్వభావాలకు ప్రతీక చంద్రుడు.శాశ్వత ప్రేమ వివాహానికి అవసరమైన సానుభూతి, అవగాహన, లక్షణాలను పెంపొందిస్తాడు. భావోద్వేగ హెచ్చు తగ్గులను నావిగేట్ చేయడంలో చంద్రుడు మీకు సహాయపడతాడు. చంద్రుడి అనుగ్రహం ఉంటే ప్రేమ వివాహంలో విజయం పొందడమే కాకుండా భాగస్వామితో లోతైన, శాశ్వతమైన సంబంధాన్ని పొందగలుగుతారు.
(5 / 6)
బృహస్పతి (Jupiter): సహనం, అవగాహన,జ్ఞానం, ప్రేమను, భావోద్వేగ పరిపక్వత, పెంపొందించ గలిగే గ్రహం బృహస్పతి. ఈ గ్రహం అనుకూలంగా ఉంటే వృద్ధి, విస్తరణ,సంబంధాలపై అవగాహన కలిగి ఉండి ప్రేమ వివాహంలో సంతోషంగా జీవించగలుగుతారు. (pixabay)
(6 / 6)
రాహు, కేతువు (Rahu,Ketu): జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాహు, కేతువులను కర్మ ప్రభావశీలులుగా పరిగణిస్తారు. వీరి స్థానాలు కర్మ సంబంధాలను వెల్లడిస్తాయి. బంధం పట్ల నిజాయితీగా, విధిగా ఉండే గుణాలను రాహు కేతువులు కలిగిస్తారు. ఈ గ్రహాల అనూకలంగా లేకపోతే మీ ప్రేమ, శృంగార జీవితాల్లో ఊహించని సంఘటనలు, ఆశ్చర్యకరమైన మలుపులను రావచ్చు. వారి ప్రభావాన్ని అర్థం చేసుకోవడం ద్వారా భాగస్వామితో బలమైన, శాశ్వత సంబంధాన్ని ఏర్పరచుకోవచ్చు. (pixabay)
ఇతర గ్యాలరీలు