Friday Motivation: గతం గురించి దుఃఖించడం, భవిష్యత్తు గురించి బాధపడడం ఈ రెండూ వదిలేస్తేనే మీరు ఆనందంగా జీవించగలరు-you can live happily only if you stop worrying about the past and worrying about the future ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Friday Motivation: గతం గురించి దుఃఖించడం, భవిష్యత్తు గురించి బాధపడడం ఈ రెండూ వదిలేస్తేనే మీరు ఆనందంగా జీవించగలరు

Friday Motivation: గతం గురించి దుఃఖించడం, భవిష్యత్తు గురించి బాధపడడం ఈ రెండూ వదిలేస్తేనే మీరు ఆనందంగా జీవించగలరు

Haritha Chappa HT Telugu
Nov 22, 2024 05:30 AM IST

Friday Motivation: చాలామంది ఈ క్షణాన్ని ఆనందించడం మర్చిపోతారు. గతాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటారు. భవిష్యత్తు ఎలా ఉంటుందో అని భయపడుతూ ఉంటారు.

మోటివేషనల్ స్టోరీ
మోటివేషనల్ స్టోరీ (Pixabay)

మనసు, శరీరం... ఈ రెండూ అనారోగ్యం పాలు అవడానికి రెండే కారణాలు. అవి గతం గురించి దుఃఖించడం, భవిష్యత్తు గురించి చింతించడం. ఈ రెండే మిమ్మల్ని ఈ క్షణంలో ఆనందంగా జీవించకుండా అడ్డుకుంటాయి. కాస్త తెలివిగా ఆలోచిస్తే, జీవితం మీద శ్రద్ధ పెడితే మీరు ఈ క్షణంలో కూడా ఎంతో ఆనందంగా జీవించడం మొదలు పెడతారు.

మీరు గతానికి సంబంధించిన భావోద్వేగాలతో పాటు వస్తువులను కూడా ఇంట్లో లేకుండా చూసుకోండి. మీ గతంలో ఏదైనా కష్టమైనా పరిస్థితి నుండి బయటికి వచ్చిన వారైతే వాటి గురించి ఆలోచించకుండా ఉండండి. ఆ పరిస్థితులను గుర్తుకు తెచ్చే వస్తువులను కూడా ఇంట్లో ఉంచకండి. ప్రస్తుత క్షణంలో జీవిస్తేనే ఆనందాన్ని పొందగలరు. ప్రస్తుత క్షణంలో జీవించాలంటే మీరు గతాన్ని విడిచిపెట్టేయాలి. అలాగే భవిష్యత్తులో ఏం జరుగుతుందో అని ఇప్పటి నుంచి ఆలోచించి భయపడకూడదు. ప్రస్తుతం జరుగుతున్న వాటిని ఆస్వాదించడం నేర్చుకోవాలి. గతంలో లేదా భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ జీవించడం వల్ల ఈ క్షణాన్ని మీరు ఎంతో కోల్పోతారు. మీరు ఈ క్షణంలో ఎలా జీవించాలో కొన్ని చిట్కాలు తెలుసుకోండి.

మీకు ఇంట్లో అవసరం లేని వస్తువులను తీసి పడేయండి. గత జ్ఞాపకాలతో అనుసంధానమై ఉన్నా అంశాలను మర్చిపోవడంతోపాటు వస్తువులను కూడా ఇంటి నుంచి తీసేసి మీ గత జీవితాన్ని చెరిపేయండి. గతానికి శక్తి లేనప్పుడు ఖచ్చితంగా మీరు ఈ క్షణంలో జీవించడం ప్రారంభిస్తారు.

ప్రతిరోజూ చిరునవ్వుతో మీ జీవితాన్ని మొదలు పెట్టండి. అంతులేని అవకాశాలు ఉంటాయి. ప్రతి ఉదయం ఒక చిరునవ్వుతో రోజును ప్రారంభించండి. ఆ రోజంతా ఆనందంగా సాగుతుంది.

నేటి క్షణాలను పూర్తిగా ఆనందించడానికి ప్రయత్నించండి. మీ చుట్టూ ఉండే మనుషులు భావోద్వేగాలు, విజయాలు, దృశ్యాలు వినిపించే శబ్ధాలు అన్నిట్లోనూ ఏదో ఒక ఆనందాన్ని వెతుక్కోండి. మీ దైనందిన జీవితంలోనే ఆనందాన్ని వెతుక్కోండి. గతాన్ని పూర్తిగా మర్చిపోండి. భవిష్యత్తు గురించి బాధపడడం మానేయండి.

గతం ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అది బాధాకరంగానే ఉంటుంది. గత బాధలను, కోపాలను మనసులో పెట్టుకొని వెళ్ళిపోతే నేటి జీవితం కూడా నాశనం అయిపోతుంది. మిమ్మల్ని బాధ పెట్టిన వారిని క్షమించి ముందుకు సాగేందుకు ప్రయత్నించండి. మీకు హాని చేసిన వారి పట్ల మనసులో పగ పెంచుకుంటే మీ మానసిక స్థితి కూడా ఎంతో ప్రభావితం అవుతుంది. కాబట్టి గత జీవితంలోని పగలను, కష్టాలను వదిలేసి ముందుకు సాగండి.

మీరు చేస్తున్న పని ప్రేమించడం మొదలుపెట్టండి. మీకు అంతా మంచే జరుగుతుంది. మీ ఉద్యోగాన్ని ప్రేమించండి, మీ వ్యాపారాన్ని ప్రేమించండి. దాన్ని గుర్తు చేసేందుకు ప్రతిక్షణం కష్టపడండి. మీరు మీ జీవితంలో భవిష్యత్తును గురించి ఆలోచిస్తూ గతం గురించి బాధపడుతూ 70 శాతం జీవితాన్ని వేస్ట్ చేస్తారని అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి సంతోషంగా జీవించేందుకు ఆ రెండింటి గురించి పూర్తిగా మర్చిపోవడమే మంచిది.

మనసు ప్రశాంతంగా ఉంటేనే శరీరం కూడా ఆరోగ్యంగా ఉండగలదు. ఆలోచనలకు మూలం మనసే. మీ మనసును మీరు మార్చుకుంటే శారీరక ఆరోగ్యం కూడా మెరుగ్గా అవుతుంది. కాబట్టి ప్రతిరోజూ యోగా, ధ్యానం వంటివి చేయండి. ఎక్కువగా కామెడీ సినిమాలను చూస్తూ నవ్వేందుకు ప్రయత్నించండి.

Whats_app_banner