తెలుగు న్యూస్  /  Rasi Phalalu  /  Here's Some Vastu Tips To Indoor Plants For Peace And Prosperity In Your Homes

Vastu Tips : ఇంట్లో మెుక్కలు ఎక్కడ పెట్టొద్దు? లేదంటే ఇన్ని సమస్యలా?

HT Telugu Desk HT Telugu

07 February 2023, 12:37 IST

    • Indoor Plants Vastu Tips : మనిషికి ప్రకృతికి విడదీయరాని సంబంధం. ఈ ఆధునిక కాలంలో ఇంట్లోనూ మెుక్కలు పెంచుకునేవాళ్లు ఎక్కువైపోయారు. వివిధ రకాల మొక్కలు సానుకూల, ప్రతికూల శక్తులను విడుదల చేస్తాయి. ప్రజలు తమ ఇళ్లలో ఉంచగల కొన్ని మొక్కలను వాస్తు శాస్త్రం వివరించింది.
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ప్రశాంతమైన ఇల్లు ప్రతి ఒక్కరి కల. కానీ కొద్దిమంది మాత్రమే దానిని అనుభవించగలుగుతారు. కొంతమంది పెద్దగా పట్టించుకోరు. ప్రశాంతత ఉండేందుకు ఇంటి ఆవరణలో మెుక్కలు(Plants) ఉండటం కూడా చాలా ముఖ్యం. శాంతి ఉండేందుకు మరొక సులభమైన మార్గం. అయితే అవి కూడా వాస్తు(Vastu) ప్రకారం ఉండాలని చెబుతున్నారు. కొంతమంది ఇంటి ఆవరణలో మెుక్కలు పెంచితే.. మరికొంతమంది ఇంట్లో కూడా వాటికి స్థానం కల్పిస్తారు. కొన్నింటి ద్వారా మంచి ఉంటే.. మరికొన్ని చెడు ఫలితాలు కూడా ఉంటాయట.

లేటెస్ట్ ఫోటోలు

ఏప్రిల్ 28, రేపటి రాశి ఫలాలు.. ఐటీ రంగంలో పని చేసే వాళ్ళు రేపు జాగ్రత్తగా ఉండాలి

Apr 27, 2024, 08:38 PM

Lord Venus : శుక్రుడి సంచారంతో ఈ రాశులవారికి ఇబ్బందులు

Apr 27, 2024, 03:03 PM

Lord Surya : సూర్యభగవానుడి సంచారంతో సమస్యల్లో పడే రాశులు వీరే

Apr 27, 2024, 11:23 AM

Jupiter Venus conjunction: గురు శుక్ర సంయోగం.. గజలక్ష్మీ రాజయోగంతో వీళ్ళు విజయ శిఖరాలు చేరుకుంటారు

Apr 26, 2024, 03:28 PM

ఈ రాశుల వారు పట్టిందల్లా బంగారమే! భారీ ధన లాభం- ఉద్యోగంలో ప్రమోషన్​..

Apr 26, 2024, 05:56 AM

Ruchak Raja Yogam: రుచక్ రాజ యోగం.. 3 రాశుల వారిని అదృష్టం వరించనుంది

Apr 25, 2024, 02:21 PM

వెదురు ఎక్కువ ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తుంది. వాస్తు ప్రకారం మీరు ఈ మొక్కను ఆగ్నేయంలో ఉంచాలి. ఎందుకంటే ఇది సంపద దిశ. అయితే , మీరు మీ ఆరోగ్యాన్ని(Health) మెరుగుపరుచుకోవాలని చూస్తున్నట్లయితే దానిని తూర్పున తప్పక ఉంచాలి. పది కాండాలతో కూడిన వెదురు మొక్క ఇంట్లో ఆనందం, అదృష్టాన్ని కలిగిస్తుందని, మానసిక ఒత్తిడిని అలాగే చెడు శక్తులను దూరం చేస్తుందని నమ్ముతారు.

మనీ ప్లాంట్(Money Plant).. సంపద, అదృష్టానికి చిహ్నంగా పరిగణిస్తారు. ఇది చాలా మంది ఇళ్లలో ఫేవరెట్. మీ ఇంటి ఆగ్నేయ దిశలో బాల్కనీలు, కారిడార్లు, బెడ్‌రూమ్‌లలో కూడా నాటుతారు. పడకగదిలో ఈ మొక్కను బెడ్‌రెస్ట్ లేదా ఫుట్‌రెస్ట్ దగ్గర ఉంచకుండా ఉండటం మంచిది.

ఇంట్లో తులసి మెుక్క ఉంటేనే అందం. తులసి అత్యంత పవిత్రమైనది. ఇది గాలిని శుద్ధి చేస్తుంది. ఆధ్యాత్మిక శక్తిని మన ఇళ్లలోకి తీసుకువస్తుంది. మీరు తూర్పు లేదా ఈశాన్యంలో తులసిని నాటాలి. ఎందుకంటే ఈ దిశలలో సూర్యరశ్మి పుష్కలంగా ఉంటుంది. తులసి చాయ్ తాగడం వల్ల మీ శరీరంలోని అన్ని టాక్సిన్స్ బయటకు వెళ్లిపోతాయి.

ఒక చిన్న నిమ్మ చెట్టును నాటండి. మీ ఇంటి చుట్టూ మంచి అనుభూతిని కలిగిస్తుంది. ఇది కాకుండా, నిమ్మ మొక్క వాస్తు దోషాన్ని నయం చేయడంలో సహాయపడుతుంది. మీ టెర్రస్ గార్డెన్(Terras Garden) లేదా పెరడు దక్షిణ లేదా పశ్చిమ దిశలో దీనిని నాటండి.

గులాబీలు మీ కుటుంబంలోని ప్రతి ఒక్కరికీ అందాన్ని, ఆహ్లాదకరమైన సువాసనను అందజేస్తాయి. వాటిని ఇంటి దక్షిణ దిశలో ఉంచవచ్చు. మల్లె పూల వాసన ఎంతో సూపర్ గా ఉంటుంది. శాంతి, సామరస్యం, ప్రేమను ప్రోత్సహిస్తుంది. ఇది ఇంట్లో ఉంచడానికి ఒక అద్భుతమైన మొక్క. మీ ఇంటి కిటికీకి దక్షిణం వైపు ఈ మొక్కను ఉంచండి.

కలబందకు కార్బన్ డయాక్సైడ్‌ను గ్రహించి రాత్రిపూట ఆక్సిజన్‌ను విడుదల చేసే అరుదైన సామర్థ్యం ఉంది. ఈ మొక్క చర్మం, జుట్టు, శరీరానికి అవసరమైన అనేక ప్రయోజనాలతో నిండి ఉంటుంది. వాస్తు శాస్త్రం ప్రకారం మీరు మీ ఇంటికి ఉత్తర లేదా ఈశాన్య దిశలో కలబందను ఉంచవచ్చు.

మొక్కలను ఎల్లప్పుడూ ఉత్తమ స్థితిలోనే ఉంచాలి. క్షీణించిన ఆకులు, పొడి పువ్వులు ప్రతికూల శక్తిని ఆకర్షిస్తాయి. గులాబీలు తప్ప, ఇతర ముళ్ల మొక్కలను ఇంటి లోపల ఉంచకుండా ఉండటం మంచిది. ఇవి కుటుంబ సంబంధాలపై ఒత్తిడిని కలిగిస్తాయి.

మీ ఇంటిలో తీగ మెుక్కలను నాటడం మానుకోండి. ఎందుకంటే అవి సమీపంలోని గోడలకు త్వరగా అతుక్కుని వాటిని దెబ్బతీస్తాయి.

ఇంటి లోపల రావిచెట్టు, ఇప్ప వంటి మొక్కలను పెంచడం మానుకోండి. ఎందుకంటే ఇవి అశుభం, మీ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలను కలిగిస్తాయి.

బోన్సాయ్‌ మెుక్కలనను ఉంచడం ఈ రోజుల్లో ట్రెండీగా మారినప్పటికీ, వీటిని ఇంటి లోపల ఉంచకుండా వాస్తు ప్రకారం పెట్టుకోవాలి. తోట లేదా వరండా వంటి బహిరంగ ప్రదేశాల్లో పెట్టాలి.

చెడు ఆలోచనలు, ప్రతికూల శక్తులు, దురదృష్టాలను నివారించడానికి పత్తి, చింతపండు వంటి మొక్కలను ఇంట్లో ఉంచకుడదు.

టాపిక్