Tuesday Rituals: మంగళవారం హనుమంతుడిని ప్రసన్నం చేసుకోవడం ఎలా అనుకుంటున్నారా..? ఈ స్టెప్స్ ఫాలో అయిపోండి
17 December 2024, 6:30 IST
- Tuesday Rituals: హిందూ మత నమ్మకాల ప్రకారం, మంగళవారం హనుమంతుడికి అంకితం చేయబడింది. ఈ రోజున భజరంగ్‌బలికి ప్రత్యేక పూజలు చేయడం వల్ల వ్యక్తిలో శక్తి, ధైర్యం పెరుగుతాయి. ఆంజనేయుడి అభయం, ఆశీర్వాదం లభిస్తాయని నమ్ముతారు. మంగళవారం రోజున ఆంజనేయస్వామిని ప్రసన్నం చేసుకోవడం కోసం ఏం చేయాలో తెలుసుకోండి.
మంగళవారం హనుమంతుడిని ప్రసన్నం చేసుకోవడం
మంగళవారం అనగానే హిందువులకు మొదట గుర్తొచ్చే దైవం హనుమంతుడు. ఆయన అనుగ్రహం పొందడానికి, ఆయనను ఆరాధించేందుకు, ప్రత్యేక పూజలు చేసేందుకు మంగళవారం, శనివారం చాలా అనువైన రోజులు అని హిందువులు నమ్ముతారు. తీవ్రమైన సంకటాల నుంచి, ఇబ్బందుల నుంచి రక్షించగల భజరంగబలిని అందరూ మహాశక్తివంతమైన దైవంగా భావిస్తారు. హనుమంతుని అనుగ్రహం పొందిన వ్యక్తి.. జీవితంలోని బాధల నుండి విముక్తి పొందుతాడని నమ్ముతారు. హనుమంతుడికి అంకితం చేసిన మంగళవారం రోజున హిందూ మత విశ్వాసాల ప్రకారం, కొన్ని పరిహారాలు చేయడం ద్వారా హనుమంతుని అనుగ్రహం పొంది జీవితంలో ఆర్థిక శ్రేయస్సును పొందుతారు.
లేటెస్ట్ ఫోటోలు
చేయాల్సిన పరిహారాలు:
1. మంగళవారం హనుమంతుడికి ప్రత్యేక పూజ చేయాలి. ఈ రోజున హనుమంతుడికి కుంకుమను సమర్పించడం ద్వారా భజరంగబలి సంతోషిస్తాడని నమ్ముతారు.
2. ఆర్థిక ఇబ్బందుల నుంచి విముక్తి పొందాలంటే మంగళవారం నాడు హనుమంతుడికి నైవేద్యాలు సమర్పించాలి. ఇలా చేయడం వల్ల జాతకంలో కుజ గ్రహం బలపడుతుందని నమ్ముతారు.
3. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం హనుమంతుడిని ప్రసన్నం చేసుకోవడానికి, ఆయన ఆశీస్సులు పొందడానికి మంగళవారం మోతీచూర్ లడ్డూలను ప్రసాదంగా సమర్పించాలి.
4. మంగళవారం నాడు ఎరుపు రంగు వస్తువులను దానం చేయడం వల్ల హనుమంతుడు సంతోషిస్తాడని నమ్ముతారు. ఈ రోజున బెల్లం, వేరుశెనగ, ఎరుపు రంగు దుస్తులు, పప్పు దినుసులు వంటి వస్తువులను దానం చేయవచ్చు. ఈ పదార్థాలు అహింస, శుభప్రవృత్తి, ధైర్యం, సత్తువతో కూడిన ప్రదర్శనను సూచిస్తాయి.
5. మంగళవారం సాయంత్రం హనుమంతుడికి చందనం, గులాబీ రంగును సమర్పించండి. ఈ రోజున పసుపు, నారింజ రంగు దుస్తులు ధరించడం శుభప్రదమని నమ్ముతారు. ఇలా చేయడం వల్ల హనుమంతుడు సంతోషిస్తాడని నమ్ముతారు.
6. హనుమంతుడిని ప్రసన్నం చేసుకోవాలంటే మంగళవారం ఆలయానికి వెళ్లి రామరక్షా స్తోత్రం పఠించాలి. ఇలా చేయడం వల్ల కోరిన కోర్కె నెరవేరుతుందని, ఋణాల బాధ తొలగిపోతుందని నమ్ముతారు.
7. మంగళవారం రోజున హనుమంతుడిని ప్రసన్నం చేసుకోవడానికి కచ్చితంగా హనుమాన్ చాలీసా పఠించాలి. ఇది పఠించడం చాలా శక్తివంతమైన పరిహారంగా భావిస్తారు. ఈ చాలీసాను సమయాన్ని, వీలుని బట్టి 11 లేదా 108 సార్లు పఠించడం అలాగే శ్రద్ధగా వినడం వల్ల హనుమంతుడు మనకు రక్షణ కల్పిస్తాడని, మనకు కష్టాలను తొలగిస్తాడని నమ్ముతారు.
హనుమంతుడి విగ్రహం ముందు కూర్చుని, రామనామాన్ని 108 సార్లు జపించాలి. ఇలా చేయడం వల్ల హనుమంతుని అనుగ్రహంతో వివాహానికి సంబంధించిన సమస్యలు తొలగిపోతాయని నమ్ముతారు. దీంతో పాటు హనుమంతునికి చెందిన "ఓం హనుమతే నమః", "ఓం రామ్ దూతాయ నమః", "జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగర్" మంత్రాలను 108 సార్లు జపించడం వల్ల ఉత్తమ ఫలితాలు పొందవచ్చునని ఆధ్మాత్మిక నిపుణులు చెబుతున్నారు.