Double raja yogam: 100ఏళ్ల తర్వాత డబుల్ రాజయోగం.. ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే
31 March 2024, 10:00 IST
- Double raja yogam: సుమారు వందేళ్ల తర్వాత డబుల్ రాజయోగం ఏర్పడుతుంది. దీని వల్ల కొన్ని రాశుల వారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఏ పని తలపెట్టిన అందులో విజయం సాధిస్తారు. ఈ సమయంలో ఈ రాశుల వారికి దశ తిరిగినట్టే.
100 ఏళ్ల తర్వాత డబుల్ రాజయోగం
Double raja yogam: మరి కొద్ది రోజుల్లో గ్రహాల రాకుమారుడు బుధుడు బృహస్పతికి చెందిన రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. బుధుడు మీన రాశిలోకి ప్రవేశించి తిరోగమన దశలో సంచరిస్తాడు. ఈ సమయంలో మీన రాశిలో బుధుడు, సూర్యుడు, శుక్ర కలయిక ఏర్పడుతుంది. గ్రహాల రాజు సూర్యుడు, బుధుడు కలిసి బుధాదిత్య రాజయోగాన్ని ఏర్పరుస్తారు. జ్యోతిష్య శాస్త్రంలో ఇది చాలా శుభకరమైన యోగం.
లేటెస్ట్ ఫోటోలు
అదే సమయంలో శుక్రుడు, బుధుడు కలవడం వల్ల లక్ష్మీనారాయణ యోగం ఏర్పడుతుంది. ఈ యోగం జాతకంలో ఉంటే లక్ష్మీదేవి ఆశీస్సులు పుష్కలంగా మీ మీద ఉంటాయి. మీనరాశిలో ఒకేసారి రెండు రాజయోగాలు ఏర్పడనున్నాయి.100 ఏళ్ల తర్వాత ఒకే రాశిలో డబుల్ రాజయోగాలు ఏర్పడుతున్నాయి. దీనివల్ల కొన్ని రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలగబోతున్నాయి. బుధుడు, సూర్యుడు, శుక్రుల కలయికతో ఏర్పడే డబుల్ రాజ యోగం ఏ రాశుల వారికి మేలు చేస్తుందో తెలుసుకుందాం.
వృషభ రాశి
వృషభ రాశి పదకొండో ఇంట్లో ఈ డబుల్ రాజ యోగం ఏర్పడుతుంది. ఈ రాజయోగాల ఫలితంగా వృషభ రాశి వారికి లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగాలు చేసే వారికి ప్రశంసలు లభిస్తాయి. వ్యాపారాలకు నూతన ఆదాయం మార్గాలు తెరుచుకుంటాయి. చిన్న సమస్యలు ఉన్నప్పటికీ భాగస్వామి మద్దతుతో వాటిని సులభంగా పరిష్కరించుకుంటారు. వైవాహిక జీవితంలో ఏర్పడిన చికాకు వాతావరణం తొలగిపోతుంది. కుటుంబ సభ్యులు, సన్నిహితులతో కలిసి ఆహ్లాదకరమైన ప్రదేశాన్ని సందర్శిస్తారు.
సింహ రాశి
బుధాదిత్య రాజయోగం, లక్ష్మీనారాయణ యోగం సింహ రాశి వారికి శుభప్రదమైన ఫలితాలు ఇస్తుంది. బుధుడు శుభప్రభావంతో ఆగిపోయిన పనులన్నీ నిర్విఘ్నంగా పూర్తి చేయగలుగుతారు. ఏదైనా కొత్త పని ప్రారంభించాలనుకుంటే ఈ సమయంలో కుదిరి లక్ష్మీదేవి అనుగ్రహం మీకు నిండుగా ఉంటుంది. ఆనందం, సంపద పొందుతారు. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. వాహనం లేదా ఆస్తిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. లక్ష్మీదేవి కటాక్షంతో ఆదాయం రెట్టింపు అవుతుంది. విలాసవంతమైన జీవితాన్ని పొందుతారు.
మీన రాశి
మీన రాశిలోనే బుధుడు, సూర్యుడు, శుక్ర కలయిక జరుగుతుంది. ఫలితంగా ఈ రాశి వారికి రెండు రాజయోగాల ప్రభావంతో రెట్టింపు ఫలితాలు రాబోతున్నాయి. కార్యాలయంలో మీ స్నేహితులు, ఉన్నతాధికారుల పూర్తి మద్దతు మీకు లభిస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్ పొందేందుకు సులువైన మార్గాలు మీకు తారసపడతాయి. ఆర్థిక ఇబ్బందుల నుంచి, కష్టాల నుంచి గట్టెకుతారు. కొత్తపెట్టుబడుల ఎంపిక గురించి ఆలోచిస్తారు. విదేశాలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో మీన రాశి వారికి పట్టిందల్లా బంగారమే అన్నట్లు అవుతుంది. వ్యాపారస్తులకు ఊహించని రీతిలో ఆర్థిక లాభాలు ఉంటాయి. అనుకోని విధంగా పెట్టుబడులు వస్తాయి. సంతోషంతో మీ మనసు నిండిపోతుంది.
ఈ మూడు గ్రహాల ప్రభావంతో తెలివిగా వ్యాపార లావాదేవీలు చేయడంతో సంపద పెరుగుతుంది. ధైర్య సాహసాలు ప్రదర్శిస్తారు. సమాజంలో గౌరవ, ప్రతిష్టలు రెట్టింపు అవుతాయి. పనిలో విజయావకాశాలు మెరుగవుతాయి. కుటుంబం నుంచి ఆకస్మిక శుభవార్తలు అందుకుంటారు. లావాదేవీలు జరిపేందుకు ఇది అనుకూలమైన సమయంగా ఉంటుంది. డబ్బుకు సంబంధించిన విషయాలలో విజయం సాధిస్తారు. పెట్టుబడులు పెడితే లాభదాయకంగా ఉంటాయి. ధన ప్రవాహానికి కొత్త అవకాశాలు లభిస్తాయి.