తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Bay Leaves For Sleep: రాత్రి పూట నిద్రపట్టడం లేదా..? బిర్యానీ ఆకులతో ఇలా చేసి చూడండి హాయిగా, మత్తుగా పడుకుంటారు!

Bay leaves For sleep: రాత్రి పూట నిద్రపట్టడం లేదా..? బిర్యానీ ఆకులతో ఇలా చేసి చూడండి హాయిగా, మత్తుగా పడుకుంటారు!

Ramya Sri Marka HT Telugu

20 December 2024, 15:17 IST

google News
    • Bay leaves For sleep: ఆహారాన్ని మరింత సువాసనగా మార్చే బిర్యానీ ఆకులు నిద్రలేమి సమస్యను కూడా దూరం చేయగలవట. రాత్రి పూట నిద్ర పట్టక ఇబ్బంది పడుతున్న వారు ఈ ఆకులతో ఓ చిన్న పని చేశారంటే రాత్రంతా హాయిగా, మత్తుగా నిద్రపోతారట. ఆ చిన్న చిట్కా ఏంటో దాని వల్ల కలిగే ఇతర ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.  
రాత్రి పూట నిద్రపట్టడం లేదా..? బిర్యానీ ఆకులతో ఇలా చేసి చూడండి
రాత్రి పూట నిద్రపట్టడం లేదా..? బిర్యానీ ఆకులతో ఇలా చేసి చూడండి (Shutterstock)

రాత్రి పూట నిద్రపట్టడం లేదా..? బిర్యానీ ఆకులతో ఇలా చేసి చూడండి

భారతీయ వంటగదిలో మసాలా దినుసులకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. ఇవి ఆహారం రుచిని రెట్టింపు చేయడమే కాకుండా అనేక ఇతర ప్రయోజనాలను కూడా కలిగి ఉంటాయి. వీటిలో ఒకటి బే ఆకులు(బిర్యానీ ఆకులు). బిర్యానీ ఆకులు ఆహారానికి చక్కటి సువాసనను అందిస్తాయి, మరింత రుచికరంగా మారుస్తాయి. ఎన్నో ఔషధ గుణాలు కలిగిన బిర్యానీ ఆకుల టీని తాగడం వల్ల చాలా రకాల వ్యాధులను నయం చేసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. ఇవన్నీ తెలిసిన విషయాలే అయి ఉండచ్చు. అయితే ఇక్కడ చాలా మందికి తెలియని విషయం ఒకటి ఉంది. బిర్యానీ ఆకులు నిద్రలేమి సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తాయట. శారీరకంగా, మానసికంగా ప్రశాంతతను కలిగించి రాత్రంతా హాయిగా, మత్తుగా నిద్రపోయేలా చేస్తాయి. అదెలాగో తెలుసుకుందాం రండి..

బిర్యానీ ఆకులతో ఏం చేస్తే హాయిగా నిద్రపోవచ్చు..?

ప్రస్తుత ఉరుకుల పరుగుల ప్రపంచంలో ఒత్తిడికి గురికావడం చాలా సాధారణం. ఇది కొన్ని సార్లు వ్యక్తిని ఎంత ఇబ్బంది పెడుతుందంటే ఇంట్లో విశ్రాంతి తీసుకునేటప్పుడు కూడా మనసులో అవే ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి. దీని వల్ల చాలా మందికి రాత్రి పూట నిద్రపట్టదు. ఇలా ప్రతిరోజూ జరుగుతుంటుంది. ఎంత ప్రయత్నించినా నిద్రపట్టక రకరకాల ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. ఇలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్న వారు బిర్యానీ ఆకులు ఉపశమనం కలిగించవచ్చు. నిద్రలేమి సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు రాత్రిపూట రెండు లేదా మూడు బిర్యానీ ఆకులను తీసుకుని కాల్చాలి. ఈ ఆకుల నుంచి వచ్చే పొగను పీల్చుకోవాలి. ఈ బలమైన సువాసన మనస్సు విశ్రాంతి తీసుకోవడానికి, ఒత్తిడిని దూరం చేయడానికి సహాయపడుతుంది. ఫలితంగా హాయిగా, మత్తుగా నిద్రపోతారు.

బిర్యానీ ఆకులను కాల్చడం వల్ల కలిగే మరిన్ని ప్రయోజనాలు..

రోగనిరోధక శక్తిని కాపాడటం:

బలమైన రోగనిరోధక వ్యవస్థ శరీరానికి చాలా అవసరం. మన రోగనిరోధక శక్తి ఎంత బలంగా ఉంటే, వ్యాధులతో పోరాడటానికి, రక్షించడానికి అంత సామర్థ్యం పెరుగుతుంది. మంచి ఆహారం, సరైన జీవనశైలితో పాటు మీరు మీ రోగనిరోధక శక్తిని పెంచడానికి బే ఆకులను కూడా ఉపయోగించవచ్చు. బిర్యానీ ఆకుల్లో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. వాటిని కాల్చి ఆ పొగను పీల్చడం వల్ల రోగనిరోధక శక్తిని బలోపేతం అవుతుంది.

గాలిని శుభ్రపరచడం:

పురాతన కాలంలో సంక్రమణను నివారించడానికి ప్రజలు తమ ఇళ్లలో బిర్యానీ ఆకులు, వేప ఆకులను ధూమపానంగా చేసేవారు. ఈ ఆకుల నుంచి వెలువడే పొగ చుట్టుపక్కల వాతావరణంలో ఉండే కలుషితాలను నాశనం చేయడానికి చక్కగా పనిచేస్తుందని నమ్ముతారు. ప్రతిరోజూ సాయంత్రం ఇంట్లో బిర్యానీ ఆకులను కాల్చడం వల్ల ఆ పొగ గాలిని శుభ్రంగా ఉంచడానికి, సంక్రమణ ప్రమాదాన్ని తగ్గించడానికి కూడా ఇది చాలా సహాయపడుతుంది.

క్రిమి కీటకాల నుంచి రక్షణ:

బిర్యానీ ఆకుల నుంచి వచ్చే వాసన ఇంటిరి సువాసన భరితంగా మార్చడమే కాకుండా ఈగలు, దోమలు, బొద్దింకలు వంటి హానికరమైన క్రిమిలు, కీటకాలను ఇంట్లో ఉండకుండా చేస్తుంది. మార్కెట్లో దొరికే కెమికల్ రూం ఫ్రెషనర్లు, కీటకాల మందుల అవసరం లేకుండా ఇది మీకు చక్కటి పరిష్కారంగా మారుతుంది. ఇంట్లోని వంటగదిలో, పడకడదిలో ఎక్కడ దుర్వాసన, క్రిమి కీటకాలు ఉంటాయో అక్కడి మూలల్లో ఈ ఆకులను కాల్చి చూడండి. ఫలితం మీకే కనిపిస్తుంది.

శోథ నిరోధకంగా:

బిర్యానీ ఆకుల్లొ యూజెనాల్ అనే రసాయనం ఉంటుంది. ఇది సహజ శోథ నిరోధకంగా పనిచేస్తుంది. వీటిని కాల్చి ఆ పొగను పీల్చుకోవడం వల్ల శరీరంలో మంట, నొప్పి వంటి రకరకాల సమస్యలు తగ్గుముఖం పడతాయి. ముఖ్యంగా ఇంట్లో ఎవరికైనా కీళ్ల నొప్పులు, వాపు, కీళ్లలో మంట వంటి సమస్యలు ఉంటే ఈ చిట్కా మీకు చాలా ప్రయోజకరంగా ఉంటుంది. వీటిని తగ్గించడంలో బిర్యానీ ఆకుల పొగ మీకు చాలా బాగా సహాయపడుతుంది.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల అభిప్రాలయను క్రోడీకరించి మాత్రమే మేము ఈ సూచనలు అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

తదుపరి వ్యాసం