Bug Bites Remedies : కీటకాలు కుడితే వెంటనే ఈ నూనెలు రాయండి.. ఉపయోగం ఉంటుంది-apply 5 essential oil to help bug bites home remedies for insects bite ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Apply 5 Essential Oil To Help Bug Bites Home Remedies For Insects Bite

Bug Bites Remedies : కీటకాలు కుడితే వెంటనే ఈ నూనెలు రాయండి.. ఉపయోగం ఉంటుంది

Anand Sai HT Telugu
Feb 28, 2024 09:30 AM IST

Bug Bites Home Remedies : ఇంట్లో అప్పుడప్పుడు కీటకాలు మనల్ని కరుస్తాయి. దీంతో తెగ కంగారు పడిపోతాం. అయితే వాటి కోసం కొన్ని రకాల నూనెలు రాసుకుంటే సరిపోతుంది.

కీటకాలు కుడితే రాసుకోవాల్సిన నూనె
కీటకాలు కుడితే రాసుకోవాల్సిన నూనె (Unsplash)

ఇంట్లో చిన్న చిన్న కీటకాలు కనిపిస్తూ ఉంటాయి. వాటిని చూస్తే భయపడిపోతాం. మనం చేసే తొందరలో అవి వచ్చి కుడతాయి. విషపు పురుగులు అయితే వెంటనే ఆసుపత్రికి వెళ్లాలి. కానీ సాధారణమైనవైతే.. ఇంట్లోనే కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. చర్మం కూడా పాడవకుండా ఉంటుంది. కీటకాల కాటుకు సాయపడే కొన్ని ముఖ్యమైన నూనెలు ఉన్నాయి.

సాధారణంగా మనందరి ఇళ్లలో చిన్న చిన్న కీటకాలు, దోమలు, సాలీడులు ఉంటాయి. కొన్నిసార్లు ఇళ్ళల్లోకి తేలు, పాములు కూడా వస్తుంటాయి. చిన్నచిన్న పురుగులు కరిచినా, విషపురుగులు కాటేసినా వెంటనే ఆస్పత్రికి పరుగులు తీస్తున్నాం. విషపురుగులు కరిస్తే ఆసుపత్రికి వెళ్లడం మంచిది. అయితే చిన్న పురుగులు ఎవైనా కరిస్తే.. అలా వెళ్లనవసరం లేదు. ఎందుకంటే మన ఇంట్లో ఉండే కొన్ని ముఖ్యమైన నూనెలు, మందులను ఉపయోగించడం వల్ల చర్మ సమస్యను సులభంగా పరిష్కరించుకోవచ్చు.

పువ్వులు, కొమ్మలు, వేర్లు, ఆకులు మొదలైన మొక్కల వివిధ భాగాల నుండి ముఖ్యమైన నూనెలు లభిస్తాయి. ఈ నూనెలు బాగా ఉపయోగపడతాయి. ఈ ముఖ్యమైన నూనెలను ఉపయోగించడం వల్ల అందం, గది సువాసనను పెంచడం వరకు అనేక ప్రయోజనాలు ఉన్నాయి. కీటకాల కాటుకు కూడా సహాయపడే కొన్ని ముఖ్యమైన నూనెలు ఉన్నాయి.

యూకలిప్టస్ ఆయిల్

యూకలిప్టస్ ఎసెన్షియల్ ఆయిల్ మంచి లక్షణాలకు ప్రసిద్ధి చెందింది. యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉన్నందున, మీ చర్మంపై కీటకాల కాటు వల్ల కలిగే మంటను తగ్గించడంలో, చర్మ సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి. ఇది యాంటిసెప్టిక్‌గా పనిచేసే మంచి అనుభూతిని కూడా అందిస్తుంది.

తులసి ఆయిల్

తులసి మెుక్కకు హిందూ మతంలో చాలా ప్రాధాన్యత ఉంది. దాని ఔషధ గుణాలకు కూడా చాలా ప్రాముఖ్యత కలిగిన మొక్క. తులసిలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు.. కీటకాలు కరిచిన చర్మాన్ని శాంతపరచడంలో సహాయపడతాయి. అలాగే ఈ నూనె సువాసన కీటకాలను తిప్పికొట్టడానికి సహాయపడుతుంది.

చమోమిలే ఆయిల్

చమోమిలే ఆయిల్ ప్రశాంతత, ఓదార్పు లక్షణాలకు ప్రసిద్ధి చెందింది. ఇది ఒత్తిడిని తగ్గించడానికి, విశ్రాంతి తీసుకోవడానికి సహాయపడుతుంది. కీటకాల కాటుకు చమోమిలే ఆయిల్ బాగా సహాయపడుతుంది. ఎందుకంటే ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇది ప్రభావిత ప్రాంతం వాపు, ఎరుపును నయం చేయడంలో సహాయపడుతుంది.

పిప్పరమింట్ ఆయిల్

మీ చర్మంపై పిప్పరమింట్ ఆయిల్ అప్లై చేయడం కీటకాలను తిప్పికొట్టడానికి ఉత్తమమైన మార్గాలలో ఒకటి. ఈ నూనెలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి. ఇది కీటకాల కాటు వల్ల కలిగే ఇన్ఫెక్షన్‌తో పోరాడటానికి సహాయపడుతుంది. అలాగే పిప్పరమెంటు నూనె బలమైన వాసన కీటకాలను రాకుండా సహాయపడుతుంది.

లావెండర్ ఆయిల్

లావెండర్ అనేది ఆహ్లాదకరమైన రంగు, సువాసన కలిగిన మొక్క. కీటకాల కాటుకు ఇది చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇది మీ ప్రభావిత చర్మ ప్రాంతాన్ని ఉపశమనం చేస్తుంది. లావెండర్ నూనెలో యాంటీ ఫంగల్, యాంటీమైక్రోబయల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి మీ చర్మంపై సంతానోత్పత్తి చేయగల సూక్ష్మక్రిములను చంపుతాయి.

WhatsApp channel