తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Messages From Spirits: చనిపోయిన మన పూర్వీకులు మనకు సహాయం చేస్తారా..? భవిష్యత్తు గురించి మార్గనిర్దేశాలు అందిస్తుంటరా?

Messages from Spirits: చనిపోయిన మన పూర్వీకులు మనకు సహాయం చేస్తారా..? భవిష్యత్తు గురించి మార్గనిర్దేశాలు అందిస్తుంటరా?

Ramya Sri Marka HT Telugu

15 December 2024, 14:00 IST

google News
    • Messages from Spirits: మరణించిన వ్యక్తులు మనకు మార్గనిర్దేశం చేయగలరా? అనేక మతాలు, సాంస్కృతిక విశ్వాసాలు, మానసిక పరిణామాలు, పారామార్నల్ సిద్ధాంతాలు చెప్తున్నదేంటి? అనుభవపూర్వకంగా రుజువైన ఘటనలు ఏమైనా ఉంటే తెలుసుకుందాం రండి.
చనిపోయిన మన పూర్వీకులు మనకు సహాయం చేస్తారా..?
చనిపోయిన మన పూర్వీకులు మనకు సహాయం చేస్తారా..?

చనిపోయిన మన పూర్వీకులు మనకు సహాయం చేస్తారా..?

మన పూర్వీకులు లేదా వంశీకులలో మరణించిన వారు తమ వారసులకు సహాయం చేస్తారని, కొన్ని విషయాల్లో మార్గ నిర్దేశాలు చేస్తాయనే మాటలు మనం వింటూ ఉంటాం. చనిపోయిన వారు మార్గనిర్దేశం చేయడం వల్లనే కొన్ని పనులు జరిగాయని కూడా కొందరు ప్రచారం చేస్తుంటారు. దీన్నినిజమని నమ్మేవారు కొందరుంటే, ఇది కేవలం అపోహ అని కొట్టిపారేసే మరికొందరు ఉన్నారు. అయితే మరణించిన మన పూర్వీకుల గురించి జరుగుతున్న ఈ ప్రచారాన్ని కేవలం ఆత్మీయ, మానసిక దృష్టికోణంలో మాత్రమే చూడాలా..? నిజంగానే చనిపోయిన వారు మనకు సహాయం చేయగలుగుతారా? మన పూర్వీకుల ఆత్మలతో సంభాషంచి మన సమస్యలను పరిష్కరించుకోవచ్చా..? తెలుసుకోవాలనే ఆసక్తి మీలోనూ ఉంటే ఇక్కడ తెలుసుకోవచ్చు.

లేటెస్ట్ ఫోటోలు

Khushi Kapoor: డైరెక్టర్ కూతురి పెళ్లి వేడుకల్లో 4 డ్రెస్సుల్లో ఖుషీ కపూర్- జాన్వీ కపూర్ చెల్లెలి దుస్తుల ధర ఎంతంటే?

Dec 15, 2024, 05:47 PM

ఈ రాశులవారికి జీవితంలో ఎన్నో లాభాలు, ఆర్థిక పురోగతి.. వీరిలో మీరు ఉన్నారా?

Dec 15, 2024, 05:10 PM

Telangana Tourism Packages : ఇయర్ ఎండ్ వేళ ట్రిప్ ప్లాన్ ఉందా..! ఈ టూర్ ప్యాకేజీలపై ఓ లుక్కేయండి..!

Dec 15, 2024, 03:25 PM

రూ. 223 లక్షల కోట్లు- 15వేల కోట్ల ట్రాన్సాక్షన్స్​.. యూపీఐ సరికొత్త రికార్డు..

Dec 15, 2024, 01:30 PM

overthinking zodiac signs: ఈ రాశుల్లో పుట్టిన వారు అతిగా ఆలోచిస్తారట! అది వారికి మంచే చేస్తుందట!

Dec 15, 2024, 11:40 AM

Bhagyashri Borse: ట్రెండీ లుక్‌లో భాగ్య‌శ్రీ బోర్సే - మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ బ్యూటీ కొత్త ఫొటోలు వైర‌ల్‌!

Dec 15, 2024, 10:58 AM

1. సాంస్కృతిక, మత సంబంధిత దృష్టికోణాలు

మరణించిన వ్యక్తులు మనకు సహాయం చేస్తారనే నమ్మకం అనేక సంస్కృతులు, మతాలలో బలంగా ఉంది. ఈ విశ్వాసాలు సాధారణంగా ఆత్మ మరణం తర్వాత జీవిస్తూ, మనల్ని ప్రభావితం చేయగలదని భావించడంలో ప్రాతినిధ్యం వహిస్తుంది.

పూర్వీకుల ఆత్మీయ మార్గనిర్దేశం: ఆఫ్రికన్, ఆసియన్, అమెరికన్ సంస్కృతులలో, పూర్వీకులు తమ వారసులతో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉంటారట. వారు తమ రక్షకులు, సలహాదారులు లేదా జ్ఞానాన్ని పంచేవారిగా భావిస్తుంటారు. ఉదాహరణకి, ఆఫ్రికన్ సంప్రదాయ మతాల్లో పూర్వీకులు తమ కుటుంబ సభ్యులను మార్గనిర్దేశం చేయడం లేదా వారందరికీ హెచ్చరికలు ఇవ్వడం కోసం తమ ప్రభావాన్ని చూపిస్తారనే నమ్మకం కూడా ఉంది. క్రైస్తవ మతంలో కొన్ని విశ్వాసాలు నమ్మేవారు పరిశుద్ధుల ఆత్మీయ మార్గనిర్దేశాన్ని లేదా "పవిత్రుల" మద్దతు ఉంటుందని నమ్ముతారు.

2. ఆత్మల మార్గనిర్దేశం

పారానార్మల్ యాక్టివిటీలలో పాల్గొన్న వారిలో చాలా మంది మరణించిన వారి నుంచి సలహా, రక్షణ లేదా హెచ్చరికలు పొందినట్లుగా అనుభవాలు పంచుకుంటారు. మరణించిన వారిని కలలో చూశామని, వారితో సంభాషించామనే అర్థంలో చెప్తుంటారు. సంకేతాలు, సూచనల ద్వారా కూడా సందేశాలు అందాయని మరికొందరు భావిస్తారు. కలలో ఒక వస్తువు కనిపించడం, లేదా మరణించిన వ్యక్తి నచ్చిన పాటలు వింటుండడం వంటి సంకేతాలకు అర్థాలు వెతుకుతుంటారు. అంతేకాకుండా కొన్ని సందర్భాలలలో చనిపోయిన వారు భౌతిక రూపంలో కనిపించారని చెబుతుంటారు. ఇంకా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు లేదా ఆందోళనలో ఉన్నప్పుడు వారి స్వరం వినిపించి హెచ్చరికలు అందాయని కూడా వింటూనే ఉంటాం.

3. మానసిక దృష్టికోణాలు

వాస్తవానికి, మరణించిన వ్యక్తులు మనకు మార్గనిర్దేశం చేయగలిగారనే భావన కొన్ని సందర్భాల్లో సైకలాజికల్ కారణాలపై ఆధారపడి ఉంటుంది. మనకు బాగా ఇష్టమైన వ్యక్తులు మరణించినప్పుడు విషాదం చాలా తీవ్రంగా ఉంటుంది. అందుకే మరణించిన వారితో సంభాషించే కలలు లేదా సంకేతాలను అందుకున్నట్లు భావించడం బాధను తగ్గించడానికి సహాయపడే ఒక విధానం అయి ఉండవచ్చు. మరణించిన వ్యక్తుల గురించి మనం పదేపదే ఆలోచిస్తుండటం వల్ల వారి ఆలోచనలను మనకు ఆపాదించుకుని వాళ్లలగే వ్యవహరించే అవకాశం లేకపోలేదు. తద్వారా మరణించిన వారి ఆలోచనలతో లేదా గుణాలతో మనం ముందుకు పోవచ్చు.

4. సాంత్వన, శాంతి

మరణించిన వ్యక్తులు తమకు మార్గనిర్దేశం చేస్తున్నారని భావిస్తూ వారిని పిలిస్తే తాము రక్షణతో ఉంటామని భావిస్తారు. మన పూర్వీకులు మనకిచ్చిన విలువలు, నైతికత మన నిర్ణయాలను ప్రభావితం చేయగలవు. వారు జీవితం ఎలా జీవించాలో, ధర్మం ఎలా పాటించాలో నిర్దేశించి ఉంటారు.

5. సైంటిఫికల్ దృష్టికోణాలు

సైంటిఫిక్ లేదా స్కెప్టికల్ దృష్టికోణంలో, మరణించిన వ్యక్తులు నేరుగా మార్గనిర్దేశం చేయగలుగుతారు అనడానికి ఎటువంటి సాక్ష్యం లేదు. భూతాలు లేదా ఆత్మల దృష్ట్యా అనుభవాలు చాలామంది, మానసిక కార్యకలాపాలుగా, శోకాన్నిచ్చే అనుభవాలుగా, లేదా భ్రమలుగా మాత్రమే పరిగణిస్తారు. మనకు జరిగే సంఘటనలు లేదా సంకేతాలు అనేక రకాలుగా ఉండొచ్చు. కానీ వాటిని మరణించిన వ్యక్తుల సందేశాలుగానే భావించి, మానసికంగా వారు లేని లోటు భర్తీ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. విషాదంలో ఉన్నప్పుడు మనస్సు అనేది శోకంతో వ్యవహరించేలా మారుతుంది. దీని కారణంగా మరణించిన వ్యక్తి తమ జీవితాలలో ఉన్నారని భావించడాన్ని మేధస్సు సహజంగా తీసుకుంటుంది. మరణించిన వ్యక్తులు మనకు మార్గనిర్దేశం చేస్తారా అనే ప్రశ్నకు వ్యక్తిగత, మత విశ్వాసాల ఆధారంగా మాత్రమే సమాధానాలు ఉంటాయి.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

తదుపరి వ్యాసం