చనిపోయిన వారి అస్తికలను నదుల్లో ఎందుకు కలుపుతారు? కలపకపోతే ఏం జరుగుతుంది?
చనిపోయిన వ్యక్తుల అస్తికలను గంగలో కలపడం హిందూ ఆచారాల్లో ముఖ్యమైన ఘట్టం. ఇలా చేయడం వల్ల వారి ఆత్మకు శాంతి చేకూరుతుందని నమ్ముతారు. అస్తికలు, బూడిదను గంగలో ఎందుకు కలుపుతారు తెలుసుకుందాం.
దహనం చేసిన తర్వాత చనిపోయిన వారి అస్తికలు బూడిద రూపంలో మిగిలిపోతాయి. హిందువులు ఈ బూడిదను అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. మరణించిన వ్యక్తి ఆత్మ పట్ల భక్తి, గౌరవమర్యాదలకు ఇది సంకేతం. పూర్వీకుల బూడిదను పువ్వులతో సమానంగా భావించవచ్చని శాస్త్రాలు చెబుతున్నాయి. హిందూ ఆచారాల ప్రకారం.. వ్యక్తి చనిపోయిన తర్వాత నాలుగో రోజున అస్తికలు, బూడిదను సేకరించాల్సి ఉంటుంది. ఆ తర్వాత వాటిని గంగ వంటి పవిత్ర నదుల్లో నిమజ్జనం చేస్తారు. బూడిద లేదా అస్తికలను నదులో వెంటనే కలపలేకపోయినా వీలైనంత త్వరగా వాటిని నిమజ్జనం చేయాలని చెబుతారు. అస్తికలను పవిత్ర నదుల్లో ఎందుకు కలుపుతారు తెలుసుకుందాం.
హిందువుల నమ్మకం ప్రకారం.. వ్యక్తి మరణించిన తర్వాత అస్తికలు బయట ఉన్నంత కాలం ఆ వ్యక్తి ఆత్మ తిరుగుతూనే ఉంటుంది. అస్తికలు కొన్ని వేల సంవత్సరాలు బయట ఉన్నా అప్పటివరకూ ఆత్మ ఈ లోకంలోని అన్నింటినీ అనుభవిస్తేనే ఉంటారని నమ్ముతారు. అస్తికలు నదిలో కలిపే వరకూ వారి ఆత్మ ఇంటి చుట్టూనే తిరుగుతుందని హిందువులు, పూర్వీకులు నమ్ముతారు.. చనిపోయిన వ్యక్తుల అస్తికలను పవిత్ర గంగలో కలపడం వల్ల వారికి స్వర్గ ప్రాప్తి దొరుకుతుంది. అలాగే స్వర్గ లోకంలో వారికి గౌరవ మర్యాదలు దక్కుతాయని నమ్ముతారు. ఇందుకు కేవలం గంగ వంటి పవిత్ర నదులను ఎంచుకోవాలి. ముఖ్యంగా హరిద్వార్, ప్రయాగ, గంగాసాగర్ వంటి గంగలు అస్తికలు కలిపేందుకు ప్రసిద్ధి చెందినవి.
ఆధ్మాత్మిక శాస్త్రం ప్రకారం.. అస్తికలను నీటి ప్రవాహంలో అంటే నదులో కలపడం వల్ల ఆ వ్యక్తి బతికుండగా చేసిన పాపాలన్నీ తొలగిపోతాయట. ఘోరపాపాలు చేసిన వారి ఆత్మకు కూడా ఈ ప్రక్రియ ద్వారా మోక్షం దక్కుతుందని హిందూ పురాణాలు చెబుతున్నాయి. అత్యంత హీనమైన, ఘోరమైన పాపాలు చేసిన వ్యక్తుల ఆత్మకు శాంతి చేకూర్చేందుకు ఇందుకు మించిన కార్యమేదీ లేదని కూడా హిందూ పురాణాలు చెబుతున్నాయి.
పవిత్ర నదుల్లో అస్తికలను కలపడం వెనకున్న మరొక నమ్మకం ఏంటంటే.. నదులు ప్రవహిస్తాయి. ఈ నదీ ప్రవాహం వేరు వేరు చోట్ల భూములకు వెళుతుంది. ఇది విస్తృత భూభాగాలకు సాగునీరు అందుతుంది. తద్వారా అస్తికల్లో ఉండే పోషకాలు వివిధ భూములకు అందుతాయి. అలాగే ఎముకలలో ఉండే ఫాస్ఫేట్ పొలాల్లో పారడం వల్ల నీటిలో ఫాస్ఫేట్ స్థాయిలు పెరుగుతాయి. ఇవి ధాన్యాలు సమృద్ధిగా పెరగడానికి అవసరమయే పదార్థాలు. అలాగే మరణం తర్వాత వ్యక్తి ప్రకృతికి కూడా ప్రయోజనం అందించేందుకే ఈ పద్ధతిని పాటిస్తున్నారు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
టాపిక్