Pitru paksham: మీ పూర్వీకులు మరణించిన తేదీ ఎప్పుడో తెలియదా?వారి శ్రాద్ధం ఎప్పుడు చేయాలో తెలుసుకోండి-if you do not know the death date of your ancestors then when should you perform their shradh ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Pitru Paksham: మీ పూర్వీకులు మరణించిన తేదీ ఎప్పుడో తెలియదా?వారి శ్రాద్ధం ఎప్పుడు చేయాలో తెలుసుకోండి

Pitru paksham: మీ పూర్వీకులు మరణించిన తేదీ ఎప్పుడో తెలియదా?వారి శ్రాద్ధం ఎప్పుడు చేయాలో తెలుసుకోండి

Gunti Soundarya HT Telugu
Sep 18, 2024 07:00 PM IST

Pitru paksham: గ్రంధాల ప్రకారం ఎవరైనా అన్ని తేదీలలో శ్రాద్ధం చేయలేకపోతే అతను సర్వపితృ అమావాస్య నాడు శ్రాద్ధం చేయవచ్చు. అదేవిధంగా పూర్వీకుల మరణ తేదీ తెలియకపోతే అమావాస్య తిథి నాడు శ్రాద్ధం చేయవచ్చు. సర్వపితృ అమావాస్య ఎప్పుడు వచ్చిందో చూడండి.

పూర్వీకులకు శ్రాద్ధం ఎప్పుడు చేయాలి?
పూర్వీకులకు శ్రాద్ధం ఎప్పుడు చేయాలి?

Pitru paksham: పితృ పక్షం 18 సెప్టెంబర్ నుండి 2 అక్టోబర్ 2024 వరకు ఉంటుంది. మీ పూర్వీకులు మరణించిన తేదీ మీకు తెలియకపోతే లేదా మీ పూర్వీకులు మరణించిన తేదీని మీరు మరచిపోయినట్లయితే మీరు అమావాస్య తిథి నాడు శ్రాద్ధం చేయవచ్చు. అంటే పితృ పక్షంలో వచ్చే సర్వపితృ అమావాస్య రోజున ఈ పూర్వీకుల శ్రాద్ధం చేయవచ్చు. 

ఎవరైనా మొత్తం తిథిలలో శ్రాద్ధం చేయలేకపోతే అతను అమావాస్య తిథిలో మాత్రమే శ్రాద్ధం చేయవచ్చు. కుతుప్, రౌహిన్ మొదలైన శుభ ముహూర్తాలు శ్రాద్ధం  ఆచరించడానికి అనుకూలమైనవిగా భావిస్తారు. శ్రాద్ధం ముగింపులో తర్పణం చేస్తారు.

పితృ విసర్జన అమావాస్య

సర్వ పితృ అమావాస్యను పితృ విసర్జన అమావాస్య అని కూడా అంటారు. ఈ రోజున కుటుంబంలోని పూర్వీకులందరికీ శ్రాద్ధం చేయవచ్చు. హిందూ మతం విశ్వాసాల ప్రకారం సర్వ పితృ అమావాస్య రోజున శ్రాద్ధం చేయడం ద్వారా పూర్వీకులు మోక్షం పొందుతారు. వారు నేరుగా వైకుంఠానికి వెళతారు. మత గ్రంథాల ప్రకారం అమావాస్య తిథి నాడు శ్రాద్ధం చేయడం వల్ల పితృ దోషం నుండి ఉపశమనం లభిస్తుంది. సర్వ పితృ అమావాస్య నాడు మాత్రమే పూర్వీకులు తమ లోకానికి వెళ్తారని చెబుతారు.

సర్వ పితృ అమావాస్య శ్రాద్ధానికి అనుకూలమైన సమయం 

సర్వ పితృ అమావాస్య రోజున శ్రాద్ధం, తర్పణం, పిండ దానానికి కుతుప్ ముహూర్తం ఉదయం 11:46 నుండి మధ్యాహ్నం 12:33 వరకు ఉంటుంది. రౌహిన్ ముహూర్తం మధ్యాహ్నం 12:33 నుండి 01:20 వరకు ఉంటుంది. మళ్ళీ మధ్యాహ్నం 01:20 నుండి 03:42 వరకు ఉంటుంది.

అమావాస్య రోజున ఏమి చేయాలి

ఈ రోజున కుక్కలు, ఆవులు, కాకులు, చీమలకు ఆహారం ఇవ్వడం శుభప్రదంగా భావిస్తారు. సాయంత్రం మీ ఇంటికి దక్షిణం వైపు దీపం వెలిగించాలి. ఈ రోజు రావి చెట్టుకు నీరు సమర్పించాలి.

శ్రాద్ధాన్ని మూడు తరాల వాళ్ళు ఆచరించవచ్చు. ఈ పితృ పక్షం సమయంలో నీరు, ఆహారం, వస్త్రాలు దానం చేయడం మంచిది. పితృ పక్షంలో పితృ దేవతలను సంతృప్తి పరచడానికి శ్రాద్ధాలు చేస్తారు. పూజారులకు, ఆచార్యులకు, పండితులకు సేవ చేయడం, దానం చేయడం ద్వారా సంతోషం, శాంతి, కీర్తి, సంపన్న జీవితం లభిస్తుంది. శ్రాద్ధం ద్వారా పూర్వీకుల ఆత్మకు విముక్తి లభిస్తుంది. పితృ పక్షంలో పంచబలి దేవతలకు, ఆవు, కుక్కలు, కాకులు, చీమలు ఆహారం అందించడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.  

పితృ దేవతలను ఆరాధించడం వల్ల వాళ్ళు సంతోషించి సుఖ సంతోషాలతో కూడిన జీవితాన్ని ప్రసాదిస్తారు. మానవ జీవితంలో మూడు రుణాలు ఉన్నాయి. దేవ్ రుణం, రుషి రుణం, పితృ రుణం. భగవంతుడి రుణం తొలగిపోవడానికి యజ్ఞం మొదలైన పుణ్య కార్యాలు చేస్తారు. రుషి రుణం నుంచి విముక్తి పొందటం కోసం ఆచార్యుల వారికి పూజిస్తారు. పితృ రుణం నుంచి విముక్తి పొందటం కోసం శ్రాద్ధం, తర్పణం మొదలైన కార్యక్రమాలు చేయాలి.  

గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనది అని మేము క్లెయిమ్ చేయము. వీటిని అవలంబించే ముందు, ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి.

టాపిక్