తెలుగు న్యూస్  /  Rasi Phalalu  /  Ashtalakshmi Raj Yogam With Venus Transit These Zodiacs Have Good Luck

Ashtalakshmi Raj Yogam : అష్టలక్ష్మి రాజయోగం.. ఆ రాశుల వారికి అదృష్టం..

11 November 2022, 11:09 IST

    • Ashtalakshmi Raj Yogam : నేడు శుక్రగ్రహం తన రాశిని మార్చుకోబోతుంది. తులరాశి నుంచి వృశ్చికరాశిలోకి ప్రవేశించబోతుంది. దీనివల్ల అష్టలక్ష్మి రాజయోగం ఏర్పడబోతుంది. ఈ ప్రభావం అన్ని రాశులపై ఉంది. ముఖ్యంగా మూడు రాశులవారికి అదృష్టం కలిసి వస్తుంది అంటున్నారు జ్యోతిష్యులు. మరి ఏ రాశులవారికి కలిసి వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
అష్టలక్ష్మి రాజయోగం
అష్టలక్ష్మి రాజయోగం

అష్టలక్ష్మి రాజయోగం

Ashtalakshmi Raj Yogam : జ్యోతిష్యశాస్త్రంలో శుక్ర గ్రహ సంచారాన్ని చాలా ప్రయోజనకరంగా పరిగణిస్తారు. ఎందుకంటే శుక్రగ్రహ సంచారం వల్ల.. అనేక రాశులపై ఆ ప్రభావం ఉంటుంది. పైగా ఇది మంచి ప్రయోజనాలు అందిస్తుంది. అయితే ముఖ్యంగా శుక్రుని సంచారం వల్ల మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది అంటున్నారు జ్యోతిష్యులు.

లేటెస్ట్ ఫోటోలు

మే 3, రేపటి రాశి ఫలాలు.. రేపు భూమి, వాహనాలు కొనుగోలు చేసేందుకు అనువైన రోజు కాదు

May 02, 2024, 08:29 PM

Saturn retrograde: శని తిరోగమనం.. ఐదు నెలల వరకు ఈ 3 రాశుల వారికి కష్టాలు తప్పవు

May 02, 2024, 07:05 PM

మే 2, రేపటి రాశి ఫలాలు.. రేపు రాజకీయ నాయకులకు కష్టసమయం, శత్రువులను గుర్తించండి

May 01, 2024, 08:31 PM

Shukraditya yogam: శుక్రాదిత్య యోగం.. ఈ రాశులకు పట్టిందల్లా బంగారమే, కోరికలు నెరవేరతాయి

May 01, 2024, 02:35 PM

మే 1, రేపటి రాశి ఫలాలు.. పనిలో ఎదురయ్యే ఆటంకాలు తొలగుతాయి, ఎవరినీ చూసి మోసపోవద్దు

Apr 30, 2024, 09:06 PM

Gajakesari Raja Yoga : గజకేసరి రాజ యోగం.. వీరికి అన్ని విధాలుగా సూపర్

Apr 30, 2024, 02:10 PM

వేద జ్యోతిషశాస్త్రంలో.. శుక్రగ్రహాన్ని ఆనందం, సంపద, వైభవం, ఐశ్వర్యం మొదలైన వాటికి కారకంగా పరిగణిస్తారు. శుక్రుడు వృషభం, తులారాశి వారికి అధిపతిగా చెప్తారు. జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం.. జాతకంలో శుక్ర దేవుడి స్థానం ఎక్కువగా ఉంటే.. వారికి జీవితంలో ఏ లోటు ఉండదని చెప్తారు.

నవంబర్ 11వ తేదీన అనగా ఈరోజు రాత్రి 07:52లకు శుక్రుని సంచారం జరుగుతుంది. దీంతో అష్టలక్ష్మీ రాజయోగం ఏర్పడుతోంది. అష్టలక్ష్మి రాజయోగం ప్రభావం వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి రాబోతుంది. మరి ఏ రాశులవారికి లక్ కలిసి వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

మకర రాశి

మకర రాశి వారికి పదకొండవ స్థానంలో అష్టలక్ష్మి రాజయోగం ఏర్పడుతోంది. ఆ స్థానాన్ని అదృష్ట ప్రదేశంగా పరిగణిస్తారు. వృశ్చిక రాశిలో శుక్రుడు రాకతో వ్యాపారులకు లాభిస్తుంది. మీరు పెట్టుబడుల నుంచి లాభం పొందుతారు.

కుంభ రాశి

కుంభ రాశి వారికి దశమ స్థానంలో అష్టలక్ష్మి రాజయోగం ఏర్పడుతోంది. పదవ స్థానం వ్యాపారం, పని ప్రదేశంగా చెప్తారు. అందుకే ఈ అష్టలక్ష్మీ రాజయోగం కాలంలో మీరు ఆర్థిక లాభాలను పొందుతారు. ఆర్థిక రంగం బలంగా ఉంటుంది. ఆదాయ వనరులు పెరుగుతాయి. పిల్లల నుంచి శుభవార్తలు అందుకుంటారు.

మీన రాశి

మీన రాశి వారికి తొమ్మిదవ స్థానంలో అష్టలక్ష్మి రాజయోగం ఏర్పడుతోంది. ఆ స్థానాన్ని అదృష్ట ప్రదేశంగా పరిగణిస్తారు. ఈ సమయంలో మీరు అదృష్టాన్ని పొందుతారు. అవివాహితులకు వివాహమయ్యే అవకాశముంది. డబ్బు విషయంలో ఇది చాలా మంచి సమయం.

ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజమని చెప్పలేము. మీ జ్యోతిష్యుడిని సంప్రదించి.. మీరు తగిన సలహాలు తీసుకోండి.