Telugu News  /  Rasi Phalalu  /  Guru Margi 2022 Jupiter Retrograde Transit May Benefit For These Zodiac Signs From November 24, 2022
Guru Margi 2022
Guru Margi 2022

Guru Margi 2022 । నవంబర్ 24 నుంచి ఈ రాశుల వారికి మహా అదృష్టం.. బృహస్పతి సంచారంలో మార్పు!

09 November 2022, 19:40 ISTHT Telugu Desk
09 November 2022, 19:40 IST

Guru Margi 2022: బృహస్పతి సంచారంలో మార్పు, కొన్నిరాశులకు వరంగా మారనున్న గురువు కదలిక. ఆ అదృష్ట రాశులలో మీ రాశి ఉందేమో చూసుకోండి.

జ్యోతిష్య శాస్త్రంలో దేవతల గురువైన బృహస్పతికి ప్రత్యేక స్థానం ఉంది. గురు గ్రహం శుభప్రదంగా పరిగణిస్తారు. జ్యోతిష్య శాస్త్రంలో, బృహస్పతి ఐశ్వర్యం, వైభవం, సంపద, గౌరవం మొదలైన వాటికి కారకుడిగా పేర్కొనడమైనది. బృహస్పతి రాశి మార్పు మొత్తం 12 రాశులను ప్రభావితం చేస్తుంది.

ట్రెండింగ్ వార్తలు

దేవగురు బృహస్పతి ఈ నవంబర్ 24, 2022 తేదీన, తెల్లవారుజామున 4 గంటలకు 36 నిమిషాల నుంచి తన బాటలో సంచరించనున్నాడు. బృహస్పతి తన రాశి మీన రాశిలో తిరోగమనంలో సంచరిస్తాడు. దీనిని జ్యోతిష్య శాస్త్రంలో మార్గం లేదా మార్గి అని పేర్కొంటారు. ఇలా ప్రతి 13 నెలలకు ఒకసారి దాదాపు 4 నెలల పాటు తిరోగమనం వైపు మారుతుంది.

Guru Margi 2022 - Lucky Zodiac Signs

జ్యోతిష్య శాస్త్ర విశ్వాసాల ప్రకారం, మార్గీగా మారడానికి ముందు గురువు కొన్ని రాశులపై ప్రత్యేక అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. కొన్ని రాశుల వారికి గురువు మార్గంలో లాభదాయకంగా ఉండవచ్చు. ఈసారి మీనరాశిలో బృహస్పతి సంచరించడం వల్ల ఏ రాశికి లాభం చేకూరుతుందో తెలుసుకోండి...

మేష రాశి

  • కార్యాలయంలో, వ్యాపారంలో వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది.
  • సహోద్యోగుల సహకారంతో కష్టమైన పనులు కూడా పూర్తి చేయగలుగుతారు.
  • వ్యాపారంలో ఆకస్మిక లాభాలు, కొత్త అవకాశాలు ఉంటాయి.
  • మనసులో ఆనందం ఉంటుంది.
  • వ్యాపార పర్యటనకు వెళ్లే ప్రణాళిక ఉండవచ్చు.
  • వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది.

మిథున రాశి

  • పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి.
  • ఆర్థికంగా లాభపడే అవకాశాలు ఉంటాయి.
  • కార్యాలయంలో, వ్యాపారంలో వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది.
  • వ్యాపారంలో ఆకస్మిక లాభ అవకాశాలు ఉంటాయి.
  • వ్యాపార పర్యటనకు వెళ్లే ప్రణాళిక ఉండవచ్చు.
  • కుటుంబం మద్దతు లభిస్తుంది.
  • ఇంటికి అతిథి రావచ్చు.

వృశ్చిక రాశి

  • కార్యాలయంలో, వ్యాపారంలో వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది.
  • మీరు సహోద్యోగుల మద్దతు పొందుతారు.
  • అధికారుల మద్దతు లభిస్తుంది.
  • మీరు కొత్త ప్రణాళికలపై పని ప్రారంభించవచ్చు.
  • పురోగతికి అవకాశాలు లభిస్తాయి.
  • వ్యాపారంలో లాభానికి అవకాశం ఉంటుంది.
  • కొత్త పెట్టుబడి అవకాశాలు వస్తాయి.

మీన రాశి

  • మీరు సానుకూల శక్తితో నిండి ఉంటారు.
  • కొత్త ఆలోచనలు వస్తాయి.
  • కష్టమైన పనులను కూడా సులభంగా పూర్తి చేయగలుగుతారు.
  • అనుభవం ఉన్న వ్యక్తిని సంప్రదించిన తర్వాత మాత్రమే పెట్టుబడి పెట్టండి.
  • కార్యాలయంలో కొత్త శక్తితో పని చేస్తారు.
  • కుటుంబం మద్దతు లభిస్తుంది.
  • దాంపత్య జీవితంలో మాధుర్యం ఉంటుంది.

పునర్వసు, విశాఖ, పూర్వ భాద్రపద 27 రాశులకు అధిపతి బృహస్పతి.

టాపిక్