ప్రేమలో ఉన్నారా? లేక పెళ్లయిందా? మీకు 2025 రాశి ఫలాలు ఎం చెబుతున్నాయి? 12 రాశుల వారూ తెలుసుకోండి
20 December 2024, 13:07 IST
- 2025 సంవత్సరంలో మీ ప్రేమ జీవితం ఎలా ఉండబోతోంది? కుటుంబ జీవితం బాగుంటుందా? సంబంధిత అంశాలపై సవివరంగా 12 రాశుల వారికి పంచాంగకర్త, బ్రహ్మ శ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించిన రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. ఎవరి ప్రేమ ఫలిస్తుంది? ఎవరి కుటుంబ జీవితం బాగుంటుందో ఇక్కడ తెలుసుకోండి.
2025లో మీ ప్రేమ జీవితం, కుటుంబ జీవితం ఎలా ఉండబోతోంది?
2025వ సంవత్సరం 12 రాశుల వారికి ప్రేమ, కుటుంబ వ్యవహారాల పరంగా ఎలా ఉండబోతుందో పంచాంగకర్త, జ్యోతిష శాస్త్ర నిపుణులు బ్రహ్మ శ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వివరించారు. చిలకమర్తి పంచాంగ రీత్యా, ధృక్ సిద్దాంత ఆధారంగా 12 రాశుల వారికి గోచార ఫలం ఆధారంగా ప్రేమ, కుటుంబ వ్యవహారాలకు సంబంధించిన ఫలితాలను వివరించారు.
లేటెస్ట్ ఫోటోలు
2025లో బృహస్పతి (గురు గ్రహం) మే వరకూ వృషభ రాశిలో, తర్వాత జూన్ నుంచి డిసెంబరు వరకూ మిథున రాశిలో సంచరించనున్నారు. శని మార్చి వరకు కుంభరాశిలో, ఏప్రిల్ నుంచి మీనరాశిలో సంచరించనున్నారు. రాహు కేతువులు కుంభ, సింహ రాశుల్లో పరివర్తనం చెందనున్నారు. ఈ కారణం చేత 2025వ సంవత్సరం ద్వాదశ రాశుల వారికి ప్రేమ, కుటుంబ వ్యవహారాల్లో ఉండే మార్పులను ఇక్కడ తెలుసుకోవచ్చు.
మేష రాశి (Aries) 2025 ప్రేమ, కుటుంబ జీవితం
2025వ మేష రాశి వారికి ప్రేమ, కుటుంబ వ్యవహారాల పరంగా మొదటి మూడు నెలలు అనుకూల ఫలితములు కలుగును. తర్వాత ఏలినాటి శని ప్రభావం, నీచ గురుని ప్రభావం చేత ఆర్థికపరంగా, కుటుంబ వ్యవహారాల పరంగా ప్రతికూల ఫలితాలు అధికంగా ఉంటాయి. కొన్నిసార్లు మౌనం, సంయమనం అన్నింటికీ పరిష్కారంగా మారుతుంది. వివాహం చేయాలనుకునే వారికి మంచి అవకాశాలు వస్తాయి. ఉన్న సంబంధాలు మరింత బలపడతాయి. అనవసరమైన అపోహలు దూరం చేసుకోండి. కుటుంబంలో శాంతి నెలకొంటుంది. పెద్దల సూచనలు పాటించడం శ్రేయస్కరం. సోదరులతో సన్నిహిత సంబంధాలు కొనసాగుతాయి.
వృషభ రాశి (Taurus) 2025 ప్రేమ, కుటుంబ జీవితం
వృషభ రాశి వారికి కొత్త సంవత్సరంలో బృహస్పతి జన్మరాశి యందు, వాక్ స్థానం నందు సంచరించడం చేత ప్రథమార్థంలో అనగా జనవరి 2025 నుంచి జూన్ 2025 వరకు ప్రేమ, కుటుంబ విషయాల్లో చికాకులు, మనస్ఫర్థలు, భేదాభిప్రాయాలు కొంత ఇబ్బంది పెట్టు సూచనలు కలుగుచున్నవి. ద్వితీయార్థంలో బృహస్పతి అనుకూలత వలన ప్రేమ, కుటుంబ విషయాలు అనుకూల, సత్ఫలితాలను కలిగించును. 2025 ప్రేమ విషయంలో వృషభ రాశి వారు కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబ వ్యవహారాలు ద్వితీయార్థంలో ఆనందాన్ని, పురోగతిని కలుగుజేస్తాయి.
మిథున రాశి (Gemini) 2025 ప్రేమ, కుటుంబ జీవితం
2025 సంవత్సరంలో మిథున రాశి వారికి ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రేమ విషయాల్లో ఈ సంవత్సరం చక్కటి అనుభవాలు కలుగుతాయి. సింగిల్స్ కొత్త సంబంధాలను ప్రారంభించేందుకు మంచి సమయం. ఉన్న సంబంధాల్లో విభేదాలు తొలగి మరింత సౌహార్దత పెరుగుతుంది. 2025లో కుటుంబంలో సమగ్ర సంతోషకరమైన పరిస్థితులు ఉంటాయి. సోదరులతో కొన్ని చిన్న చిన్న విభేదాలు రావచ్చును. కానీ అవి త్వరగా పరిష్కారమవుతాయి. కుటుంబ పెద్దల ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలి. కుటుంబంలో ఏ సమస్య వచ్చినా శాంతంగా వ్యవహరించి పరిష్కార మార్గాలు కనుగొనండి.
కర్కాటక రాశి (Cancer) 2025 ప్రేమ, కుటుంబ జీవితం
2025లో కర్కాటక రాశి వారికి ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉండే అవకాశం ఉంది. ఉన్నత ఆదాయానికి కారణమైన అవకాశాలు వస్తాయి. ఖర్చులు అదుపులో ఉంచితే మంచి ఆర్థిక స్థిరత్వం పొందవచ్చు. ప్రేమ సంబంధాల్లో మెరుగుదల ఉంటుంది. సింగిల్స్ కొత్త సంబంధాలకు సిద్ధం అవ్వవచ్చు. వివాహితులకు భాగస్వామితో సంబంధాలు మరింత బలపడతాయి. కొత్తగా పెళ్లయిన వారికి సంతోషకరమైన సమయం. కుటుంబంలో సాధారణంగా సంతోషకరమైన పరిస్థితులు ఉంటాయి. పెద్దల ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం అవసరం. శుభకార్యాల యోగం ఉంటుంది. కుటుంబ సభ్యుల అవసరాలను గుర్తించి వారికి మీ సమయాన్ని కేటాయించండి.
సింహ రాశి ఫలాలు (Leo) 2025 ప్రేమ, కుటుంబ జీవితం
2025లో సింహ రాశి వారికి ప్రేమ వ్యవహారాలు కలసివస్తాయి. సింగిల్స్ కొత్త సంబంధాలను ప్రారంభించవచ్చు. వివాహితులకు సంతోషకరమైన సందర్భాలు ఎదురవుతాయి. చిన్న చిన్న విభేదాలను శాంతంగా పరిష్కరించాలి. 2025లో కుటుంబ జీవితం ఆనందకరంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో సౌఖ్యంగా గడుపుతారు. వృద్ధుల ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం అవసరం. కొత్త శుభకార్యాల యోగం ఉంటుంది. బంధువుల నుంచి మద్దతు లభిస్తుంది. కుటుంబంలో సమగ్ర శ్రేయస్సు కోసం మీ సమయాన్ని కేటాయించండి.
కన్య రాశి (Virgo) 2025 ప్రేమ, కుటుంబ జీవితం
ఈ ఏడాది కన్య రాశి వారికి ప్రేమ వ్యవహారాల్లో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. సింగిల్స్ కొత్త సంబంధాలు ప్రారంభించవచ్చు. ఉన్న సంబంధాల్లో కొన్ని విభేదాలు వస్తాయి, అయితే అవి సులభంగా పరిష్కారమవుతాయి. వివాహితులకు కుటుంబ అనుబంధం బలపడుతుంది. కుటుంబ జీవితం ప్రశాంతంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి అనందంగా గడుపుతారు. కొన్ని సందర్భాల్లో చిన్న విభేదాలు రావచ్చును, కానీ అవి త్వరగానే పరిష్కారమవుతాయి. పెద్దల ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలి. కుటుంబంలో ఏ సమస్య వచ్చినా దూరపు చూపు ప్రదర్శించాలి. పెద్దల మద్దతు పొందడానికి ప్రయత్నించండి.
తుల రాశి (Libra) 2025 ప్రేమ, కుటుంబ జీవితం
2025లో తుల రాశి వారికి శని అనుకూలంగా వ్యవహరిస్తూ, బృహస్పతి మే 2025 వరకు అష్టమ స్థానంలో సంచరించుట చేత ప్రేమ, కుటుంబ వ్యవహారాలలో మే వరకు ఆచితూచి వ్యవహరించాలి. అనుకోని చికాకులు, మనస్ఫర్థలు తులారాశి వారిని వేధించును. మే 2025 వరకు కుటుంబ సభ్యుల మధ్య భేదాభిప్రాయాలు అధికంగా కలుగు సూచనలు కనబడుతున్నవి. జూన్ నుంచి డిసెంబరు వరకు భాగ్య స్థానంలో గురుడి అనుకూల ప్రభావం చేత ప్రేమ, కుటుంబ వ్యవహారాలు అన్ని విధాలుగా అనుకూల, సత్ఫలితాలను కలుగచేస్తాయి. ప్రేమలో ఉన్నవారికి నుకూలంగా ఉంటుంది. సింగిల్స్ కొత్త ప్రేమ సంబంధాలకు నాంది పలకవచ్చు. వివాహితులు తమ భాగస్వామితో మంచి అనుబంధాన్ని మెరుగుపరుచుకుంటారు. కొన్ని సందర్భాల్లో చిన్న విభేదాలు ఎదురైనా అవి త్వరగా పరిష్కారమవుతాయి. శుభకార్యాలు, వేడుకలు నిర్వహించడానికి ఇది మంచి సమయం. పెద్దల ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది. సమయానుసారం కుటుంబానికి మీ సమయాన్ని కేటాయించండి.
వృశ్చిక రాశి (Scorpio) 2025 ప్రేమ, కుటుంబ జీవితం
2025లో వృశ్చిక రాశి వారికి ప్రేమ విషయాల్లో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఒంటరిగా ఉన్న వారికి కొత్త సంబంధాలకు అవకాశాలు ఉండవచ్చు. ప్రేమలో కొన్ని అనుకోని విభేదాలు తలెత్తవచ్చు. అయితే అవి సమర్థవంతమైన సంభాషణ ద్వారా పరిష్కారమవుతాయి. వివాహితులకు భాగస్వామితో సాన్నిహిత్యం పెరుగుతుంది. కుటుంబ జీవితంలో ప్రశాంతత ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం బలపడుతుంది. మీ నిర్ణయాలు కుటుంబానికి మేలు చేస్తాయి. శుభకార్యాల సందర్భంగా కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది. పెద్దల ఆరోగ్యం విషయంలో కొంత శ్రద్ధ అవసరం.
ధనుస్సు రాశి (Sagittarius) 2025 ప్రేమ, కుటుంబ జీవితం
2025లో ధనుస్సు రాశి వారికి .ప్రేమ వ్యవహారాల్లో సానుకూల ఫలితాలు ఉంటాయి. సింగిల్స్ తమ జీవిత భాగస్వామిని కనుగొనే అవకాశం ఉంటుంది. వివాహితుల మధ్య పరస్పర నమ్మకం, ప్రేమ మరింత బలపడుతుంది. కొన్నిసార్లు చిన్న విభేదాలు తలెత్తినా అవి త్వరగానే పరిష్కారమవుతాయి.కుటుంబ జీవితం సంతోషకరంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మద్దతు పొందుతారు. పెద్దల ఆరోగ్యం విషయంలో కొంత శ్రద్ధ అవసరం. శుభకార్యాల నిర్వహణకు ఇది అనుకూల సమయం. సోదరులతో అనుబంధం మరింత బలపడుతుంది.
మకర రాశి (Capricorn) 2025 ప్రేమ, కుటుంబ జీవితం
ప్రేమలో ఉన్న మకర రాశి వారికి ఇది మిశ్రమ సంవత్సరంగా ఉంటుంది. సింగిల్స్ తమ జీవిత భాగస్వామిని పొందే అవకాశం ఉంటుంది. వివాహితుల మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది. మీ భాగస్వామిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయడం, నమ్మకాన్ని బలపరచడం అవసరం. కుటుంబ జీవితం సంతృప్తిగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మద్దతు పొందుతారు. శుభకార్యాలు, వేడుకలు నిర్వహించేందుకు ఇది అనుకూల సమయం. పెద్దల ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్త అవసరం.
కుంభ రాశి (Aquarius) 2025 ప్రేమ, కుటుంబ జీవితం
2025లో కుంభ రాశి వారికి ప్రేమ వ్యవహారాల్లో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. అవివాహితులకు ప్రేమ చిగురిస్తుంది. వివాహితులకు పరస్పర నమ్మకం, ప్రేమ బలపడుతుంది. కుటుంబ జీవితంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. శుభకార్యాల నిర్వహణకు ఇది మంచి సమయం. కానీ కుటుంబ పెద్దల ఆరోగ్యం మీద కొంత శ్రద్ధ పెట్టాలి. కుటుంబ అవసరాలను గుర్తించి వారికి సమయాన్ని కేటాయించండి. సమస్యలను ఓర్పుతో పరిష్కరించండి.
మీన రాశి ఫలాలు (Pisces) 2025 ప్రేమ, కుటుంబ జీవితం
ప్రేమ వ్యవహారాల్లో మీన రాశి వారికి 2025లో మంచి ఫలితాలు ఉంటాయి. సింగిల్స్ కొత్త ప్రేమ సంబంధాలకు అవకాశం పొందవచ్చు. వివాహితుల మధ్య అనుబంధం బలపడుతుంది. కొన్ని చిన్నచిన్న వివాదాలకు అవకాశం ఉంది, కానీ సద్దుమణుగుతాయి. ప్రేమలో సమయాన్ని కేటాయించడం ముఖ్యం. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. కుటుంబ సభ్యుల మద్దతు, అండదండలు లభిస్తాయి. పెద్దల ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి.
- చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ, పంచాంగకర్త