తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Meena Rasi 2025 Telugu: మీనరాశి సంవత్సర రాశి ఫలాలు.. పరిహారాలు తప్పక పాటించాలి

Meena Rasi 2025 Telugu: మీనరాశి సంవత్సర రాశి ఫలాలు.. పరిహారాలు తప్పక పాటించాలి

HT Telugu Desk HT Telugu

18 December 2024, 11:23 IST

google News
    • Meena Rasi 2025 Telugu: మీనరాశి సంవత్సర రాశి ఫలాలను పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. ప్రేమ సంబంధాలు, కుటుంబ జీవితం, ఆర్థికం, ఆరోగ్యం, కెరీర్ వంటి రంగాల్లో కొత్త సంవత్సరం ఎలా ఉండబోతుందో ఇక్కడ తెలుసుకోవచ్చు.
మీన రాశి 2025 సంవత్సర రాశి ఫలాలు
మీన రాశి 2025 సంవత్సర రాశి ఫలాలు (Pixabay)

మీన రాశి 2025 సంవత్సర రాశి ఫలాలు

2025 సంవత్సరం మీనరాశి రాశి ఫలాలను చిలకమర్తి పంచాంగ గణనం ఆధారంగా ఇక్కడ తెలుసుకోవచ్చు. బృహస్పతి మే నుండి నాలుగో స్థానంలో, శని (ఏలినాటి శని) ఒకటో స్థానంలో అంటే జన్మరాశిలో సంచరించనున్నారు. రాహువు మే నుండి పన్నెండవ స్థానంలో, కేతువు మే నుండి ఆరో స్థానంలో సంచరించనున్నారు. ఈ గ్రహాల సంచారం కారణంగా మీనరాశి వారు 2025 సంవత్సరంలో మధ్యస్థ ఫలితాలను పొందుతారు.

లేటెస్ట్ ఫోటోలు

Ketu Gochar: కేతువు సంచారంతో ఈ రాశుల వారికి రాజయోగం.. ప్రమోషన్లు, ఆర్థిక లాభాలు

Dec 18, 2024, 10:34 AM

2025లో సూర్యుడి మెుదటి సంచారం.. ఈ రాశుల వారికి జాక్‌పాట్, పెండింగ్ పనులు పూర్తి!

Dec 18, 2024, 08:09 AM

2025 నుంచి ఈ మూడు రాశులకు జీవితంలో అద్భుతాలు, పెట్టుబడుల నుంచి లాభాలు!

Dec 17, 2024, 04:42 PM

Zodiac Signs and Money: ఈ రాశుల్లో పుట్టిన వారికి డబ్బు అంటే ఇష్టం ఉండదట..! ఎందుకో తెలిస్తే ఆశ్చర్చపోతారు!

Dec 17, 2024, 03:35 PM

కొత్త సంవత్సరానికి ముందు ఈ రాశులవారికి అదృష్టం.. అన్నివైపుల నుంచి మంచి!

Dec 17, 2024, 11:31 AM

12 ఏళ తర్వాత ఈ రాశిలో లక్ష్మీనారాయణ రాజయోగం.. 2025లో వీరికి లక్ష్మీదేవి ఆశీస్సులతో ధన వర్షం!

Dec 16, 2024, 07:37 PM

మీన రాశి జాతకులకు జన్మ శని ఏలినాటి శని ప్రభావం వలన పనుల యందు ఒత్తిళ్ళు, చికాకులు అధికముగా ఉండును. ఆరోగ్య విషయాలయందు కుటుంబ వ్యవహారాల యందు జాగ్రత్తలు వహించాలి. ప్రతీ పనియందు సమస్యలు ఇబ్బంది పెట్టును. వ్యయ స్థానమునందు రాహు ప్రభావం చేత అనుకోని ఖర్చులు, ఆకస్మిక ధన వ్యయము జరుగును.

ఎవరెవరికి ఎలా ఉండబోతోంది?

మీనరాశి ఉద్యోగస్తులకు మధ్యస్థ సమయం. ఉద్యోగంలో సమస్యలు అధికమగును. మీనరాశి విద్యార్థులకు ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు ఉండబోతున్నాయి. జాగ్రత్త వహించడం మంచిది. మీనరాశి స్త్రీలకు ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు వేధించును. మనస్సు ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి.

రైతాంగం వంటి రంగాలలో ఉన్న వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉన్నది. వ్యాపారస్తులకు అప్పుల సమస్యలు కొంత వేధించును. మీనరాశి వారు ఖర్చులు నియంత్రించుకోవాలని సూచన. మీనరాశి వారికి కోర్టు వ్యవహారములు వంటివన్నీ కొంత ప్రతికూల ఫలితాలు ఇచ్చును. గొడవలకు దూరంగా ఉండండి. మీనరాశి సినీరంగం, మీడియారంగాల వారికి అంత అనుకూల సమయం కాదు.

ఆరో స్థానమునందు కేతువు ప్రభావం వలన, చతుర్ధ స్థానము నందు బృహస్పతి ప్రభావం వలన అనుకున్న పనులు ఆలస్యమైనప్పటికి మీ యొక్క తెలివి తేటలతో పూర్తి చేసేటటువంటి ప్రయత్నం చేసెదరు. మీ శత్రువులతో జాగ్రత్తలు వహించాలని సూచన.

చేయాల్సిన పరిహారాలు

2025 సంవత్సరంలో మీనరాశి వారు మరింత శుభఫలితాలు పొందడం కోసం నిత్యం గురు దక్షిణామూర్తిని పూజించండి. గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. శనివారం రోజు శనికి తైలాభిషేకం చేసుకోండి. మందపల్లి క్షేత్రాన్ని దర్శించండి. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించండి.

జనవరి 2025:

ఈ మాసం అనుకూలంగా ఉన్నది. నూతన పనులు ప్రారంభించుట. వాహన సౌఖ్యము. మానసికానందము. సోదరులతో విరోధములు ఉంటాయి. గృహోపకరణముల మీద ఆసక్తి చూపుతారు. నూతన ఉద్యోగకాశములు వచ్చును. ధనపరంగా ఇబ్బందులు పడతారు. శారీరక అలసట.

ఫిబ్రవరి 2025:

ఈ మాసం మీన రాశి జాతకులకు మధ్యస్థంగా ఉన్నది. ప్రయాణములు చేయుదురు. పట్టుదల ప్రతి విషయంలోను ఉండును. అదనపు రాబడి. వృత్తి వ్యాపారపరంగా లాభదాయకం. బంధుమిత్రులను కలుసుకుంటారు. వాహన సౌఖ్యం లేకపోవుట. ఆర్థిక ఇబ్బందులు వచ్చును. భూ సంబంధిత మార్పులు కలసివచ్చును. కొంతమంది మిమ్ములను దూషించెదరు.

మార్చి 2025:

ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. బంధుమిత్రులతో విరోధాలేర్పడు సూచనలున్నాయి. మీ వ్యాపారంలో కొంత జాగ్రత్త అవసరం. ఆలయ దర్శనం. మీరు సహాయం చేసినవారు వెనుతిరుగుతారు. ఆడంబరాలకు ధన వ్యయం చేస్తారు. మీరు అనుకున్న పనులు పూర్తి చేస్తారు.

ఏప్రిల్ 2025:

ఈ మాసం మీన రాశి జాతకులకు అనుకూలంగా లేదు. ధన నష్టములు, శారీరక అనారోగ్యములు. ప్రతి విషయములో బద్ధకము. వ్యవసాయ, చేతి వృత్తుల వారికి అనుకూలం. ఆస్తి గొడవలుంటాయి. ఊహించని వారితో పరిచయాలుంటాయి. గృహ కలహములు. ప్రయాణ సమయంలో ఆటంకాలు.

మే 2025:

ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. మానసికానందం. బంధువుల రాక, ఇతరులతో అభిప్రాయబేధాలు ఏర్పడును. ఆరోగ్యంలో ఔషధ సేవలు. మీరు ఇతరులను దూషిస్తారు. సంతానపరంగా ఆలోచన చేస్తారు. యంత్ర పరిశ్రమలు అభివృద్ధి. మీ అభివృద్ధికి నరఘోష. స్నేహ బాంధవ్యములు పెరుగును. గట్టిగా మాట్లాడతారు.

జూన్ 2025:

ఈ మాసం అనుకూలంగా ఉన్నది. బంధుమిత్రులతో ఆనందముగా గడిపెదరు. ధనము లభించును. శుభకార్యాలలో పాల్గొంటారు. అనుకున్న పనులు వాయిదా పడతాయి. మానసికానందం. ఆరోగ్యం అనుకూలించును. అశుభ సమాచారం. పరిచయస్తులకు సాయం చేస్తారు.

జూలై 2025:

ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారం వ్యవహారముల కొద్దిపాటి ఇబ్బందులు. అప్పులు చేసిన ఇబ్బందులు లేకపోవటం. ప్రతి విషయంలో మొండిగా వ్యవహరిస్తారు. అనారోగ్యం. దేవాలయ దర్శనం, నూతన గృహ ఆలోచన చేస్తారు.

ఆగస్టు 2025:

ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. కుటుంబములో విందు, వినోదముల కొరకు ధనమును అధికముగా ఖర్చు చేయుదురు. అనుకున్న పనులు పూర్తి కావు. ఆగిన పనులు పూర్తి చేస్తారు. ప్రయాణముల ప్రమాద సూచనలున్నాయి. జాగ్రత్త అవసరం.

సెప్టెంబర్ 2025:

ఈ మాసం మీన రాశి జాతకుకలకు అనుకూలంగా ఉన్నది. విద్యార్థులకు అనుకూల సమయం. నూతన శుభకార్యములకు శ్రీకారం చుడతారు. ఆస్తుల సంక్రమణం. పెద్ద సమస్యలో వైఫల్యం. ప్రారంభములో మంచి లాభములు కలుగుతాయి. ఆరోగ్యం అనుకూలించును. మానసికానందం.

అక్టోబర్ 2025:

ఈ మాసం మీకు మధ్యస్థంగా ఉన్నది. అనుకున్న పనులు పూర్తి కావు. ధనమును అధికముగా ఖర్చు చేసెదరు. ప్రయాణములు చేయుట. బంధుమిత్రులను కలుసుకుంటారు. భూమి తగవులు ఉంటాయి. సేవాకార్యాలకు విరాళాలు ఇస్తారు. ప్రేమపరంగా అనుకూల సమయం.

నవంబర్ 2025:

ఈ మాసం మీకు మధ్యస్థముగా ఉన్నది. ధనం వృథాగా ఖర్చు చేసెదరు. స్వల్ప ధనలాభం ఉంటుంది. ఉద్యోగస్తులకు బదిలీలు, ప్రమోషన్లు ఉంటాయి. ఊహించని ఖర్చులు ఎదురవు తాయి. ఇరుగు పొరుగువారితో గొడవలు. అధికార భయములు. కోర్టు వ్యవహారములు అనుకూలం.

డిసెంబర్ 2025:

ఈ మాసం మీనరాశి జాతకులకు అనుకూలంగా ఉన్నది. వ్యాపారపరంగా లాభదాయకం. వ్యవసాయదారులకు అనుకూలం. బంధుమిత్రుల సహకారముంటుంది. నూతన పరిచయాలు ఏర్పడుతాయి. అనారోగ్య సమస్యలు ఉంటాయి. మీరు తలచిన పనులు పూర్తి చేస్తారు. వేడుకలు చేస్తారు.

- చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ, పంచాంగకర్త

పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
తదుపరి వ్యాసం