తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Tips To Manage Hair Fall : ఈ చర్యలతో మీ జుట్టు రాలడాన్ని తగ్గించుకోవచ్చు..

Tips to Manage Hair Fall : ఈ చర్యలతో మీ జుట్టు రాలడాన్ని తగ్గించుకోవచ్చు..

22 October 2022, 14:45 IST

Tips to Manage Hair Fall: జుట్టు సంరక్షణ అనేది చాలా ముఖ్యం. మన తినే ఆహారం, జీవనశైలి మన జుట్టుపై ప్రభావం చూపి.. జుట్టు రాలే సమస్యలు తెస్తుంది. మరి ఈ సమస్యను ఎలా తగ్గించుకోవాలి.. ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి వంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

  • Tips to Manage Hair Fall: జుట్టు సంరక్షణ అనేది చాలా ముఖ్యం. మన తినే ఆహారం, జీవనశైలి మన జుట్టుపై ప్రభావం చూపి.. జుట్టు రాలే సమస్యలు తెస్తుంది. మరి ఈ సమస్యను ఎలా తగ్గించుకోవాలి.. ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి వంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
జుట్టు సంరక్షణ అనేది మన రోజువారీ జీవితంలో ఒక ముఖ్యమైన భాగం. అందుకే జుట్టు రాలడమనేది మిమ్మల్ని  మానసికంగా ప్రభావితం చేస్తుంది. కాబట్టి జుట్టు సంరక్షణ చాలా ముఖ్యం. మనం తినేవి, మన జీవనశైలి మనల్ని ప్రభావితం చేస్తుంది. మరి జుట్టు రాలడాన్ని ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
(1 / 11)

జుట్టు రాలడమనేది అనేక కారణాల వల్ల వస్తుంది. ఇది PCOS అయినా లేదా పోషకాహార లోపాలు వల్ల, ఒత్తిడి వంటి వాటి వల్ల కూడా జుట్టు రాలిపోవచ్చు. మరి మీరు దేనిని తీసుకుంటే ఈ సమస్య తగ్గుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
(2 / 11)

మీరు హెయిర్ కేర్ తీసుకుంటున్నా.. జుట్టు రాలిపోతుందంటే.. మీరు వైద్యుడిని సంప్రదించాలి. సరైన రీజన్ తెలుసుకుంటే.. మీరు ఆ సమస్యను తగ్గించుకోవచ్చు.
(3 / 11)

బృంగరాజ్ జుట్టుకు చాలా మేలు చేస్తుందని అందరికీ తెలుసు. కాబట్టి ఆ నూనెను రాత్రి అప్లై చేసి నిద్రపోండి. మరుసటి రోజు కడిగేస్తే జుట్టు రాలడం సమస్య తగ్గుతుంది. ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
(4 / 11)

జుట్టు రాలడంలో ఒత్తిడి పెద్ద పాత్ర పోషిస్తుంది. బృంగరాజ్ ఆయిల్, బ్రాహ్మీ ఆయిల్ మిశ్రమాన్ని జుట్టుకు అప్లై చేయాలి. అలాగే ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. ఇది జుట్టు రాలే ప్రమాదాన్ని బాగా తగ్గిస్తుంది.
(5 / 11)

మీరు మీ జుట్టు కోసం ఉపయోగించే దువ్వెన చాలా ముఖ్యమైనది. పెద్ద పళ్లు ఉన్న దువ్వెనను ఉపయోగించండం చాలా మంచిది. ఇది జుట్టు రాలడాన్ని తగ్గించడంలో సహాయం చేస్తుంది. దువ్వెనను మార్చడం వల్ల జుట్టు రాలడం చాలా వరకు తగ్గుతుంది.
(6 / 11)

జుట్టును గట్టిగా టై చేయడం వల్ల తలపై టెన్షన్ పడి జుట్టు రాలిపోతుంది. కాబట్టి మీ జుట్టును కాస్త వదులుగా ఉండేలా చేసుకోండి. ఈ నియమాన్ని పాటిస్తే జుట్టు రాలడం చాలా వరకు తగ్గుతుంది.
(7 / 11)

జుట్టు రాలిపోవడానికి స్మోకింగ్ కూడా ఓ కారణం. జుట్టు రాలడాన్ని అరికట్టడానికి స్మోకింగ్ మానేయడం మంచిది. ఈ చెడు అలవాటును మానేస్తే జుట్టు రాలడం కచ్చితంగా తగ్గుతుంది.
(8 / 11)

రెగ్యులర్​గా నిద్రపోవడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. మంచి నిద్ర మెలటోనిన్ ఉత్పత్తి చేస్తుంది. ఇది జుట్టు స్ట్రాంగ్​గా ఉండేందుకు చాలా మంచిది. కాబట్టి మీరు మీ స్లీప్ ప్యాటర్న్‌ను సరిచేయగలిగితే.. జుట్టు రాలడం తగ్గుతుంది. ప్రతిరోజూ ఏడెనిమిది గంటల పాటు బాగా నిద్రపోండి.
(9 / 11)

మీ ఆహారంలో కాల్షియం, ఐరన్, ఫోలిక్ యాసిడ్, ప్రోటీన్లు అధికంగా ఉండేలా చూసుకోండి. ఇది జుట్టుకు పోషణనిస్తుంది. దీంతో జుట్టు రాలడం తగ్గుతుంది.
(10 / 11)

    ఆర్టికల్ షేర్ చేయండి