Urvashi Rautela chops hair : ఇరాన్​ మహిళలకు మద్దతుగా జుట్టు కత్తిరించుకున్న ఊర్వశి రౌతేలా!-urvashi rautela chops hair in support of iranian women protesters ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Urvashi Rautela Chops Hair : ఇరాన్​ మహిళలకు మద్దతుగా జుట్టు కత్తిరించుకున్న ఊర్వశి రౌతేలా!

Urvashi Rautela chops hair : ఇరాన్​ మహిళలకు మద్దతుగా జుట్టు కత్తిరించుకున్న ఊర్వశి రౌతేలా!

Sharath Chitturi HT Telugu
Oct 17, 2022 03:13 PM IST

Urvashi Rautela supports Iran protests : ప్రముఖ బాలీవుడ్​ నటి ఊర్వశి రౌతేలా తన జుట్టును కత్తిరించుకున్నారు. ఇరాన్​ నిరసనలకు మద్దతుగా ఇలా చేశారు.

ఇరాన్​ మహిళలకు మద్దతుగా జుట్టు కత్తిరించుకున్న ఊర్వశి రౌతేలా!
ఇరాన్​ మహిళలకు మద్దతుగా జుట్టు కత్తిరించుకున్న ఊర్వశి రౌతేలా!

Urvashi Rautela supports Iran protests : ఇరాన్​లో మహిళలు చేపట్టిన నిరసనలకు రోజురోజుకు ప్రపంచవ్యాప్తంగా మద్దతు పెరుగుతోంది.​ తాజాగా.. ఈ జాబితాలోకి బాలీవుడ్​ ప్రముఖ నటి ఊర్వశి రౌతేలా కూడా చేరారు. ఇరాన్​ మహిళలకు మద్దతుగా తన జట్టును కత్తిరించుకున్నారు!

ఎందుకు నిరసనలు..?

ఇరాన్​లో గతనెలలో మహ్సా అమిని అనే మహిళల మరణించింది. ఇరాన్​ మోరల్​ పోలీసుల దృశ్చర్యకు ఆమె ప్రాణాలు కోల్పోయినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. హిజాబ్​ సరిగ్గా ధరించలేదన్న కారణంగా ఆమెను మోరల్​ పోలీసులు అరెస్ట్​ చేసిన తర్వాత ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి.

Iran protests on Mahsa Amini death : అప్పటి నుంచి ఇరాన్​లో నిరసనలు భగ్గుమన్నాయి. ముఖ్యంగా.. మహిళలు, యువత రోడ్డు మీదకు వచ్చి.. హిజాబ్​ను తగలబెడుతున్నారు. జుట్టును కత్తిరించుకుంటున్నారు. నచ్చిన దుస్తులు వేసుకునే హక్కు తమకు ఉందని చెబుతున్నారు. వీరిపై జరిగిన పోలీసు దాడుల్లో 100మందికిపైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.

ఈ నేపథ్యంలోనే.. ఇరాన్​ నిరసనలకు ఆన్​లైన్​లో విపరీతమైన మద్దతు లభిస్తోంది. ముఖ్యంగా ప్రమఖు నటీమణులు.. జట్టు కత్తిరించుకుని, ఆ వీడియోలను సోషల్​ మీడియాలో పోస్ట్​ చేస్తున్నారు.

'నేను కూడా బాధితురాలినే..'

ఇక తాజాగా.. ఇరాన్​ నిరసనలకు మద్దతుగా ఊర్వశి రౌతేలా తన జుట్టును కత్తిరించుకున్నారు. ఇందుకు సంబంధించిన పోస్టును సోమవారం అపలోడ్​ చేశారు.

Urvashi Rautela chops off hair : "జట్టును కత్తరించుకున్నాను. ఇరాన్​ నిరసనల్లో ప్రాణాలు కోల్పోయిన మహిళలు, అమ్మాయిలకు మద్దతుగా ఈ పని చేశాను. ఇరాన్​ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా మహిళలు ఏకమవుతున్నారు. జట్టు కత్తిరించుకుని నిరసన తెలుపుతున్నారు. మహిళలను గౌరవించండి. ఇదొక విప్లవం. జుట్టు అనేది.. మహిళల అందానికి చిహ్నం. పబ్లిక్​లో వాటిని కత్తిరించుకుని.. 'సమాజం ఇచ్చిన ప్రమాణాలు మాకు అవసరం లేదు' అని ధైర్యంగా చెబుతున్నారు. తాము ఎలాంటి దుస్తులు వేసుకోవాలో.. ఎవరు చెప్పాల్సిన అవసరం లేదని తేల్చేస్తున్నారు," అని పోస్టులో రాసుకొచ్చారు ఊర్వశి రౌతేలా.

ఏదో ఒక విషయంపై ఊర్వశి రౌతేలా పేరు నిత్యం వార్తల్లో, సోషల్​ మీడియాలో కనిపిస్తూనే ఉంటుంది. ఆమెపై ట్రోల్స్​ విపరీతంగా వస్తూ ఉంటాయి. తాజాగా.. తాను ఆస్ట్రేలియాలో ఉన్నట్టు ఆమె చెప్పడంతో.. ట్రోల్స్​ మరింత పెరిగాయి. ఇండియన్​ క్రికెటర్​ రిషభ్​ పంత్​ కూడా ఆస్ట్రేలియాలోనే ఉండటంతో.. ట్రోల్స్​ వస్తున్నాయి. పంత్​ని స్టాక్​ చేస్తున్నట్టు ఆమెపై నెటిజన్లు జోక్​లు వేసుకుంటున్నారు.

Urvashi Rautela latest news : వీటిపై ఊర్వశి రౌతేలా స్పందించారు. తనను వేధించడం మానుకోవాలని స్పష్టం చేశారు.

"నన్ను కూడా వేధిస్తున్నారు. నేను స్టాకింగ్​ చేస్తున్నాను అని అంటున్నారు. కానీ నా గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. నాకు ఎవరు మద్దతుగా నిలవడం లేదు. ఆన్​లైన్​ బుల్లీయింగ్​కి నేనూ బాధితురాలినే," అంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఊర్వశి.

అయినా కూడా.. ఈ బాలీవుడ్​ నటిపై ట్రోల్స్​ ఆగడం లేదు!

IPL_Entry_Point

సంబంధిత కథనం