తెలుగు న్యూస్  /  National International  /  Whatsapp India Head Abhijit Bose Meta India Public Policy Chief Resign

WhatsApp: వాట్సాప్ ఇండియా హెడ్ రాజీనామా.. మెటా టాప్ ఎగ్జిక్యూటివ్ కూడా..

15 November 2022, 22:28 IST

    • WhatsApp India Head Resign: వాట్సాప్ ఇండియా హెడ్ అభిజిత్ బోస్ తన పదవికి రాజీనామా చేశారు. మెటా ఇండియా పబ్లిక్ పాలసీ చీఫ్ కూడా విధుల నుంచి తప్పుకున్నారు.
వాట్సాప్ ఇండియా హెడ్ రాజీనామా.. మెటా టాప్ ఎగ్జిక్యూటివ్ కూడా..
వాట్సాప్ ఇండియా హెడ్ రాజీనామా.. మెటా టాప్ ఎగ్జిక్యూటివ్ కూడా.. (REUTERS)

వాట్సాప్ ఇండియా హెడ్ రాజీనామా.. మెటా టాప్ ఎగ్జిక్యూటివ్ కూడా..

WhatsApp India Head Resign: వాట్సాప్, ఇన్‍స్టాగ్రామ్, ఫేస్‍బుక్ ప్లాట్‍ఫామ్‍ల పేరెంట్ కంపెనీ మెటా(Meta) లో అనిశ్చితి కొనసాగుతోంది. ఇటీవల ఏకంగా 11వేల మందికి పైగా ఉద్యోగులను ఆ దిగ్గజ సంస్థ తొలగించింది. ఇప్పుడు ఇండియాలోని వాట్సాప్, మెటా టాప్ ఎగ్జిక్యూటివ్స్ విధుల నుంచి తప్పుకున్నారు. వాట్సాప్ ఇండియా హెడ్ అభిజిత్ బోస్ (Abhijit Bose), మెటా ఇండియా పబ్లిక్ పాలసీ చీఫ్ రాజీవ్ అగర్వాల్ (Rajiv Aggarwal) రాజీనామా చేశారు. అయితే ఉద్యోగుల తొలగింపుతో ఈ పరిణామాలకు సంబంధం లేదని మెటా చెప్పింది. ఆ ఇద్దరు రాజీనామా చేసినట్టు అధికారికంగా ప్రకటించింది.

ట్రెండింగ్ వార్తలు

IMD predictions: మే 4 నుంచి తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు: ఐఎండీ హెచ్చరిక

Salman Khan: సల్మాన్ ఖాన్ ఇంట్లో కాల్పుల ఘటనలో నిందితుడు అనూజ్ థాపన్ అనుమానాస్పద మృతి

Crime news: బ్లాక్ మెయిల్ చేసి క్లాస్ మేట్ నుంచి రూ.35 లక్షలు లాక్కున్న టెంత్ క్లాస్ విద్యార్థులు

Bengaluru news: ‘‘1983 తర్వాత బెంగళూరుకు ఈ దుస్థితి రావడం ఈ సంవత్సరమే..’’; ఐఎండీ శాస్త్రవేత్త వెల్లడి

WhatsApp India Head Resign: బ్రేక్ తీసుకుంటున్నా: అభిజిత్

వాట్సాప్ ఇండియా హెడ్‍గా నాలుగేళ్ల పాటు పని చేశారు అభిజిత్ బోస్. పెద్ద ప్రాజెక్టులపై పని చేశారు. ఇంపాక్ట్ ఆఫ్ ఇండియా ప్రాజెక్ట్ దీంట్లో ముఖ్యమైనదిగా ఉంది. ప్రస్తుతం కొంతకాలం బ్రేక్ తీసుకోనున్నట్టు అభిజిత్ బోస్.. లింక్డ్ ఇన్ (LinkedIn) ద్వారా వెల్లడించారు. త్వరలోనే మళ్లీ పరిశ్రమలో అడుగుపెడతానని పేర్కొన్నారు.

“వాట్సాప్ తొలి హెడ్‍గా విశేష సేవలు అందించిన అభిజిత్ బోస్‍కు కృతజ్ఞతలు చెబుతున్నా. అతడి నేతృత్వంలో మా టీమ్.. కోట్లాది మంది ప్రజలు, వ్యాపారాలకు ఎంతో మేలు చేసింది. ఇండియా కోసం వాట్సాప్ ఇంకా చాలా చేస్తుంది. ఇండియా డిజిటల్ ట్రాన్స్ ఫార్మేషన్‍కు సాయం చేసేందుకు మేం ఉత్సాహంగా ఉన్నాం” అని వాట్సాప్ హెడ్ విత్ క్యాథ్‍కార్ట్ అన్నారు.

Meta India Public Policy Chief: రాజీవ్ అగర్వాల్ కూడా..

మెటా ఇండియాకు డైరెక్టర్ పబ్లిక్ పాలసీ హెడ్‍గా పని చేస్తున్న రాజీవ్ అగర్వాల్ కూడా విధుల నుంచి తప్పుకున్నారు. యూజర్ సేఫ్టీ, ప్రైవసీ, స్కేలింగ్ అప్ ప్రోగ్రామ్‍ల్లో అగర్వాల్ కీలకపాత్ర పోషించారు. మెటా ముఖ్యమైన పాలసీల్లో పాలుపంచుకున్నారు.

మెటా ఇండియా హెడ్ అజిత్ మోహన్ రెండు వారాల క్రితమే రాజీనామా చేయగా.. ఇప్పుడు పబ్లిక్ పాలసీ డైరెక్టర్ రాజీవ్ కూడా తప్పుకున్నారు. కాగా ఈ స్థానంలో శివనాథ్ తుక్రల్‍ను మెటా నియమించింది.

Meta layoff: 11,000 మంది తొలగింపు

ఫేస్‍బుక్, వాట్సాప్, ఇన్‍స్టాగ్రామ్ పేరెంట్ కంపెనీ మెటా ఇటీవల సుమారు 11,000 మంది ఉద్యోగులను తొలగించింది. చరిత్రలో ఈ దిగ్గజ సంస్థ ఇంతస్థాయిలో సిబ్బందిని తీసేయడం ఇదే తొలిసారి. ఈ నిర్ణయం పట్ల మెటా సీఈవో మార్క్ జుకర్‍బర్గ్ క్షమాపణలు చెప్పారు. దీనికి తానే బాధ్యత వహిస్తున్నానని అన్నారు.

టాపిక్