Meta Fires 11,000 employees: ఫేస్‍బుక్ ఓనర్ మెటా సంచలన నిర్ణయం.. 11వేల మంది ఉద్యోగుల తొలగింపు-facebook parent meta layoff more than 11000 employees mark zuckerberg says sorry ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Meta Fires 11,000 Employees: ఫేస్‍బుక్ ఓనర్ మెటా సంచలన నిర్ణయం.. 11వేల మంది ఉద్యోగుల తొలగింపు

Meta Fires 11,000 employees: ఫేస్‍బుక్ ఓనర్ మెటా సంచలన నిర్ణయం.. 11వేల మంది ఉద్యోగుల తొలగింపు

Chatakonda Krishna Prakash HT Telugu
Nov 09, 2022 06:58 PM IST

Meta Fires 11,000 employees: ఫేస్‍బుక్ పేరెంట్ కంపెనీ మెటా ఏకంగా 11వేల మందికిపైగా ఉద్యోగులను విధుల నుంచి తొలగించేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్ అధికారంగా వెల్లడించారు.

Meta Fires 11,000 employees: ఫేస్‍బుక్ ఓనర్ మెటా సంచలన నిర్ణయం.. 11వేల మంది ఉద్యోగుల తొలగింపు
Meta Fires 11,000 employees: ఫేస్‍బుక్ ఓనర్ మెటా సంచలన నిర్ణయం.. 11వేల మంది ఉద్యోగుల తొలగింపు (REUTERS)

Facebook Parent Meta Fires 11,000 Employees: ఫేస్‍బుక్, వాట్సాప్, ఇన్‍స్టాగ్రామ్ ప్లాట్‍ఫామ్‍ల మాతృసంస్థ మెటా సంచలన నిర్ణయం తీసుకుంది. ఏకంగా 11వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. అంటే ఏకంగా తమ ప్లాట్‍ఫామ్స్ లో పని చేస్తున్న 13 శాతం మంది ఎంప్లాయిస్‍ను ఒకేసారి తీసేయనుంది. ఈ విషయాన్ని మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్ (Meta CEO Mark Zuckerberg) అధికారికంగా వెల్లడించారు. ఖర్చులు తగ్గించుకోవడంలో భాగంగా వేలాది మంది ఉద్యోగులపై మెటా వేటు వేయనుంది. ఆదాయంలో భారీగా తగ్గుదల, ఖర్చుల పెరుగుదల, యాడ్స్ మార్కెట్ బలహీనంగా ఉండటంతో మెటా ఈ కఠిన నిర్ణయాన్ని తీసుకుంది. పూర్తి వివరాలు ఇవే.

Facebook Parent Meta Fires 11,000 Employees: ‘బాధ్యత నాదే.. సారీ’

ఉద్యోగుల తొలగింపుపై మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్ ప్రకటన చేశారు. దీనికి తానే బాధ్యత వహిస్తానని పేర్కొన్నారు. “మెటా చరిత్రలో అత్యంత కష్టమైన మార్పును నేడు ప్రకటిస్తున్నా. మన టీమ్ సైజ్‍ను 13శాతం వరకు తగ్గించాలని నిర్ణయించుకున్నాం. 11వేల మందికి పైగా ప్రతిభావంతులైన ఉద్యోగులను పంపిస్తున్నాం” అని Mark Zuckerberg ఓ బ్లాగ్ పోస్ట్ చేశారు. ఉద్యోగులకు ఆయన క్షమాపణ చెప్పారు. “ఈ నిర్ణయాలకు, మనం ప్రస్తుతం ఉన్న పరిస్థితికి నేనే బాధ్యత వహించాలని అనుకుంటున్నా. ఇది అందరికీ కఠినమైన విషయమే. దీని వల్ల ప్రభావితమైన వారికి ముఖ్యంగా క్షమాపణలు” అని మార్క్ జుకర్ బర్గ్ ఓ ప్రకటన విడుదల చేశారు.

Facebook Parent Meta layoff 11,000 Employees: చరిత్రలో ఇదే తొలిసారి

2004లో ఫేస్‍బుక్ స్థాపించిన తర్వాత ఉద్యోగులను తీసేయడం ఇదే తొలిసారి. అడ్వర్టయిజింగ్ ఆదాయం భారీగా తగ్గుతుండటంతో ఇంత భారీ స్థాయిలో ఉద్యోగులను Meta తొలగించింది. మరోవైపు మెటావర్స్ అనే వర్చువల్ రియాల్టీ విషయంలో జుకర్ బర్గ్ భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. ఆర్థిక సంక్షోభ భయాలు కూడా వెంటాడుతున్నాయి. దీంతో మెటా లాంటి దిగ్గజ సంస్థ కూడా భారీ స్థాయిలో ఉద్యోగులను తీసేసింది.

ఉద్యోగుల తొలగింపు అంశాన్ని మంగళవారమే ఎగ్జిక్యూటివ్‍లకు చెప్పారు Meta CEO Mark Zuckerberg. సిద్ధంగా ఉండాలని సూచించారు. కంపెనీ తప్పటడుగులకు తానే కారణమని కూడా మార్క్ చెప్పారన్న సమాచారం బయటికి వచ్చింది.

Facebook Parent Meta layoff 11,000 Employees: అగమ్యగోచరంగా ఉద్యోగుల పరిస్థితి

టాప్ మైక్రో బ్లాగింగ్ ప్లాట్‍ఫామ్ ట్విట్టర్ ఇటీవలే సుమారు 3700 మంది ఉద్యోగులను తొలగించింది. ఒకేసారి 50శాతం మంది సిబ్బందిని తీసేసింది. ముందస్తు సమాచారం లేకుండా కేవలం మెయిల్స్ పంపి అప్పటికప్పుడు ఉద్వాసన పలికింది. ఇప్పుడు ఫేస్‍బుక్ పేరెంట్ సంస్థ మెటా కూడా ఇదేబాట పట్టింది. ఒకేసారి ఏకంగా 11వేల మంది ఉద్యోగులను తొలగించేందుకు రెడీ అయింది. ఖర్చులు తగ్గించుకునేందుకే ఎంప్లాయిస్‍ను తీసేశామని ఆ సంస్థలు చెప్పాయి. అయితే తొలగింపునకు గురైన ఉద్యోగుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఒక్కరోజులోనే అంతా మారిపోయిందంటూ కొందరు సోషల్ మీడియా వేదికగా ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు.

Whats_app_banner