తెలుగు న్యూస్  /  National International  /  Vikram Gokhale Dies At 77: Co-stars Remember Him

Vikram Gokhale dies at 77: సీనియర్ నటుడి కన్నుమూత; విషాదంలో బాలీవుడ్

HT Telugu Desk HT Telugu

26 November 2022, 23:54 IST

  • Vikram Gokhale dies: బాలీవుడ్ సీనియర్ నటుడు విక్రమ్ గోఖలే కన్నుమూశారు. విలక్షణ నటుడిగా పేరుగాంచిన గోఖలే పలు మరాఠా, బాలీవుడ్ హిట్ సినిమాల్లో నటించారు.

బాలీవుడ్ నటుడు విక్రమ్ గోఖలే
బాలీవుడ్ నటుడు విక్రమ్ గోఖలే

బాలీవుడ్ నటుడు విక్రమ్ గోఖలే

Vikram Gokhale dies:విక్రమ్ గోఖలే.. భారతీయ సినీ రంగంలో సీనియర్ నటుల్లో ఒకరు. మరాఠా, హిందీ సహా పలు భాషల సినిమాల్లో నటించారు. 77 ఏళ్ల గోఖలే మరణం పట్ల బాలీవుడ్ తారలు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు

Crime news: బ్లాక్ మెయిల్ చేసి క్లాస్ మేట్ నుంచి రూ.35 లక్షలు లాక్కున్న టెంత్ క్లాస్ విద్యార్థులు

Bengaluru news: ‘‘1983 తర్వాత బెంగళూరుకు ఈ దుస్థితి రావడం ఈ సంవత్సరమే..’’; ఐఎండీ శాస్త్రవేత్త వెల్లడి

Delhi school: ఢిల్లీ స్కూల్స్ కు బాంబు బెదిరింపులు : 'ఫేక్' గా భావిస్తున్న పోలీసులు

Canada working hours: విదేశీ విద్యార్థులకు కెనడా షాక్; ఇక వారానికి 24 గంటలే వర్క్ పర్మిట్

Vikram Gokhale dies: కొన్నాళ్లుగా అనారోగ్యం..

గోఖలే కొన్నాళ్లుగా వృద్ధాప్య సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. మూడు రోజుల క్రితం ఆసుపత్రిలో చేర్చారు. ఆరోగ్యం మెరుగుపడుతోందని భావిస్తున్న తరుణంలో, గురువారం మధ్యాహ్నం ఆయన కన్నుమూశారు. విక్రమ్ గోఖలే సినీ నటుడే కాదు, పేరున్న నాటక రంగ కళాకారుడు కూడా. 2016వ సంవత్సరం వరకు ఆయన నాటకాల్లో నటించారు. సినిమాలు, నాటకాల్లో.. నాటకాలకే తన ప్రాధాన్యత అని చెప్పేవారు.

Vikram Gokhale dies: 1947లో జననం

విక్రమ్ గోఖలే 1947లో జన్మించారు. ఆయన తండ్రి చంద్రకాంత్ గోఖలే కూడా రంగస్థల నటుడే. ఆయన కూడా పలు సినిమాల్లో నటించారు. విక్రమ్ గోఖలే నానమ్మ దుర్గాబాయి కామత్ భారతీయ సినీ రంగంలోనే తొలి నటి(first female actor)గా పేరుగాంచారు. సినిమా తొలి రోజుల్లో స్త్రీ పాత్రలను కూడా పురుషులే వేసేవారన్న విషయం తెలిసిందే.

Vikram Gokhale dies: సహ నటుల సంతాపం

విక్రమ్ గోఖలే మొదట మరాఠీ నాటక రంగంలో ఉన్నారు. 1971లో అమితాబ్ బచ్చన్ నటించిన పర్వానాతో బాలీవుడ్ లో ప్రవేశించారు. ఆ తరువాత వరుసగా చాలా సినిమాల్లో నటించారు. ఆయన నటించిన సినిమాల్లో హమ్ దిల్ దే చుకే సనమ్, భూల్ భులయ్యా, దే దనా దన్, మిషన్ మంగళ్, నికమ్మా మొదలైనవి ఉన్నాయి. మరాఠీలో పలు సినిమాలకు దర్శకత్వం కూడా వహించారు. విక్రమ్ గోఖలే మరణం పట్ల బాలీవుడ్ ప్రముఖులు, సహ నటులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

టాపిక్