తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  'వయాగ్రా' ఎఫెక్ట్​.. 20రోజుల పాటు అంగస్తంభన- వదిలి వెళ్లిపోయిన భార్య!

'వయాగ్రా' ఎఫెక్ట్​.. 20రోజుల పాటు అంగస్తంభన- వదిలి వెళ్లిపోయిన భార్య!

Sharath Chitturi HT Telugu

07 June 2022, 7:14 IST

    • అతనికి కొన్ని నెలల ముందే పెళ్లి జరిగింది. అంగస్తంభన కోసం వయాగ్రా వాడాలని స్నేహితులు సలహా ఇచ్చారు. అంతే.. అదే పనిగా రోజూ వయాగ్రా మందులు వాడేశాడు. చివరికి అతని భార్య వదిలేసి వెళ్లిపోయింది. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో వెలుగులోకి వచ్చింది.
వయాగ్రా డోసు ఎక్కువైంది.. 20రోజుల పాటు అంగస్తంభనతో విలవిల!
వయాగ్రా డోసు ఎక్కువైంది.. 20రోజుల పాటు అంగస్తంభనతో విలవిల! (AFP)

వయాగ్రా డోసు ఎక్కువైంది.. 20రోజుల పాటు అంగస్తంభనతో విలవిల!

ఉత్తర్​ప్రదేశ్​ ప్రయాగ్​రాజ్​లో విచిత్ర ఘటన వెలుగులోకి వచ్చింది. అంగస్తంభన కోసం ఓ వ్యక్తి వయాగ్రా మందులను విపరీతంగా వాడేశాడు. ఫలితంగా అతని అంగస్తంభన దాదాపు 20రోజుల పాటు అలాగే ఉండిపోయింది! భార్యకు చిరాకు వచ్చి, అతడిని వదిలి వెళ్లిపోయింది.

ట్రెండింగ్ వార్తలు

IGNOU July 2024 session: ఇగ్నో లో జులై సెషన్ కు రీ రిజిస్ట్రేషన్ విండో ఓపెన్; విద్యార్థులు ఇలా రిజిస్టర్ చేసుకోండి..

Unnatural intercourse: ‘‘భార్యతో అసహజ పద్దతుల్లో శృంగారం చేయడం రేప్ కిందకు రాదు’’ - ఎంపీ హైకోర్టు

NEET UG 2024: రేపే నీట్ యూజీ 2024 పరీక్ష; డ్రెస్ కోడ్ ఉంది, షూస్ వేసుకోవద్దు; గమనించండి..

Japan rice balls : చంకలో పెట్టి.. చెమటతో తయారు చేసిన ఈ ఫుడ్​ని ఎగబడి తింటున్నారు!

రోజూ అదే పని..!

సంబంధిత వ్యక్తికి కొన్ని నెలల క్రితమే పెళ్లి జరిగింది. అంగస్తంభనలో సమస్యలు ఉన్నట్టు గుర్తించాడు. ఈ విషయం తన స్నేహితులకు చెప్పాడు. వయాగ్రా మందులు వాడాలను వారు సూచించారు. ఇక రంగంలోకి దిగిన అతను.. విపరీతంగా మందులు ఉపయోగించడం మొదలు పెట్టాడు. రోజూ 200ఎంజీల వయాగ్రా మందులు తీసుకున్నారు. ఇది సాధారణం కన్నా నాలుగు రెట్లు ఎక్కువ!

ఇక అతడికి తీవ్ర సమస్యలు ఎదురయ్యాయి. అతని అంగస్తంభన 20రోజుల పాటు అలాగే ఉండిపోయింది! ఇది చూసిన అతని భార్య.. పుట్టింటికి వెళ్లిపోయింది. భర్త తరఫు బంధువుల విజ్ఞప్తితో మళ్లీ అతని దగ్గరికి వెళ్లింది. కొన్ని రోజుల తర్వాత.. అతడిని ఆసుపత్రిలో చేర్చి, అక్కడి నుంచి ఆ వ్యక్తిని వదిలేసి వెళ్లిపోయింది.

ఆ వ్యక్తికి వైద్యులు పీనీల్​ ప్రోస్తెసిస్​ సర్జిరీ చేశారు. అది విజయవంతమైంది. కానీ వయాగ్రా డోసులు ఎక్కువ అవ్వడం వల్ల అతను జీవితకాలం సమస్యలు ఎదుర్కోక తప్పదని వైద్యులు చెబుతున్నారు. 'అతనికి పిల్లలు పుడతారు. కానీ అతని మర్మాంగాల్లో సమస్యలు జీవితకాలం ఉంటాయి. అంగస్తంభన బయటకు కనిపించకుండా చూసుకునేందుకు.. అతను నిత్యం చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది,' అని వివరించారు.

టాపిక్