తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Ukraine Chopper Crash: చాపర్ కూలిన ఘటనలో హోం మంత్రి సహా 18 మంది దుర్మరణం

Ukraine chopper crash: చాపర్ కూలిన ఘటనలో హోం మంత్రి సహా 18 మంది దుర్మరణం

HT Telugu Desk HT Telugu

18 January 2023, 16:45 IST

  • Ukraine chopper crash: ఉక్రెయిన్ లో హెలీకాప్టర్ కూలిన ప్రమాదంలో ఆ దేశ హోం మంత్రి దుర్మరణం పాలయ్యారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్ సమీపంలోని బ్రొవెరీ పట్టణంలో ఈ ప్రమాదం జరిగింది.

ఉక్రెయిన్ లో చాపర్ కూలిన దృశ్యం
ఉక్రెయిన్ లో చాపర్ కూలిన దృశ్యం

ఉక్రెయిన్ లో చాపర్ కూలిన దృశ్యం

Ukraine chopper crash: ఉక్రెయిన్ రాజధాని కీవ్ కు ఈశాన్యంగా ఉన్న బ్రొవెరీ పట్టణంలో బుధవారం ఈ ప్రమాదం జరిగింది. పట్టణంలోని ఒక పాఠశాల సమీపంలో హెలీకాప్టర్ కూలిపోయింది. ఆ వెంటనే చాపర్ కు మంటలంటుకున్నాయి.

ట్రెండింగ్ వార్తలు

Chardham Yatra 2024: చార్ ధామ్ యాత్రకు ఆఫ్ లైన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యే తేదీ ఇదే; ఆన్ లైన్ లో కూడా చేసుకోవచ్చు

Sexual assault in Delhi Metro: ఢిల్లీ మెట్రోలో 16 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడి యత్నం; వణికిపోయిన మైనర్

Jammu and Kashmir news: భద్రతా బలగాలపై ఉగ్రవాదుల కాల్పులు; ఐదుగురు జవాన్లకు గాయాలు

IGNOU July 2024 session: ఇగ్నో లో జులై సెషన్ కు రీ రిజిస్ట్రేషన్ విండో ఓపెన్; విద్యార్థులు ఇలా రిజిస్టర్ చేసుకోండి..

Ukraine chopper crash: 18 మంది మృతి

ఎమర్జెన్సీ సర్వీసెస్ కు చెందిన ఈ హెలీకాప్టర్ కూలిన ఘటనలో అందులో ప్రయాణిస్తున్న ఉక్రెయిన్ దేశ హోం మంత్రి డెనిస్ మోనాటిర్క్సీ మృతి చెందారు. ఆయన సహా మొత్తం 18 మంది ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. వారిలో ముగ్గురు చిన్న పిల్లలు కూడా ఉన్నారు. చాపర్ కూలిన ప్రదేశం కిండర్ గార్టెన్ కు సమీపంలో ఉండడంతో ఆ పాఠశాలలోని ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. మరో 15 మంది పిల్లలకు గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో మొత్తం 30 మంది వరకు గాయపడ్డారు.

Ukraine chopper crash: రష్యాతో యుద్ధం

చాపర్ కూలిన ఘటన ప్రమాదవశాత్తూ జరిగిందని ప్రాథమికంగా నిర్దారించారు. అయితే, రష్యాతో యుద్ధం బీకరంగా సాగుతున్న నేపథ్యంలో, చాపర్ కూలిన ఘటనలో రష్యా హస్తం ఉందన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. గత సంవత్సరం ఫిబ్రవరిలో యుద్ధం ప్రారంభమైన సమయంలో బ్రొవెరీ పట్టణంపై పట్టు కోసం రష్యా విశ్వ ప్రయత్నం చేసింది. కానీ, ఉక్రెెయిన్ దళాల చేతిలో ఓడిపోయి, వెనుదిరిగింది.

టాపిక్