తెలుగు న్యూస్  /  National International  /  Tvs Motor Records 15 Percent Rise In Sales In August 2022

TVS Motor sales rise: ఆగస్టులో 15 శాతం పెరిగిన టీవీఎస్ మోటార్స్ విక్రయాలు

HT Telugu Desk HT Telugu

01 September 2022, 18:09 IST

  • TVS Motor records 15% rise in sales in Aug'22: టీవీఎస్ మోటార్ సేల్స్ 15 శాతం పెరిగాయి.

ఆగస్టులో పెరిగిన టీవీఎస్ మోటార్ విక్రయాలు
ఆగస్టులో పెరిగిన టీవీఎస్ మోటార్ విక్రయాలు (MINT_PRINT)

ఆగస్టులో పెరిగిన టీవీఎస్ మోటార్ విక్రయాలు

చెన్నై, సెప్టెంబరు 1: ఆగస్టులో 3,33,787 యూనిట్లను విక్రయించడం ద్వారా తన అమ్మకాల్లో 15 శాతం వృద్ధిని నమోదు చేసినట్టు టూవీలర్, త్రీ వీలర్‌ల తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ గురువారం తెలిపింది. గత ఏడాది ఇదే నెలలో టీవీఎస్ మోటార్స్ కంపెనీ 2,90,694 యూనిట్ల విక్రయాలను నమోదు చేసినట్లు తెలిపింది.

ట్రెండింగ్ వార్తలు

Kota suicide: ‘‘సారీ నాన్నా.. ఈ సారి కూడా సాధించలేకపోయా’’ - కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య

Stabbings in London: లండన్ లో కత్తితో దుండగుడి వీరంగం; పలువురికి గాయాలు

Chhattisgarh encounter: మావోలకు మరో ఎదురు దెబ్బ; ఎన్ కౌంటర్ లో ఏడుగురు నక్సల్స్ మృతి

Covishield vaccine : కోవిషీల్డ్​ టీకాతో ప్రమాదకరమైన సైడ్​ ఎఫెక్ట్​.. ఒప్పుకున్న ఆస్ట్రాజెనెకా!

గత ఏడాది ఇదే నెలలో విక్రయించిన 2,74,313 యూనిట్ల నుండి 3,15,539 యూనిట్లకు అమ్మకాలు పెరగడంతో ఆగస్టులో కంపెనీ చేసిన మొత్తం ద్విచక్ర వాహనాల అమ్మకాలు కూడా 15 శాతం వృద్ధిని సాధించాయి.

దేశీయ ద్విచక్ర వాహనాల అమ్మకాలు ఆగస్ట్ 2021లో 1,79,999 యూనిట్ల నుండి 2022 ఆగస్టులో 33 శాతం పెరిగి 2,39,325 యూనిట్లకు చేరుకున్నాయి.

మోటార్ సైకిళ్ల అమ్మకాలు 2022 ఆగస్టులో 1,33,789 యూనిట్లకు పెరిగాయి. స్కూటర్ అమ్మకాలు 1,21,866 యూనిట్లతో లక్ష యూనిట్ల మార్కును అధిగమించాయి. ఆగస్టు 2021లో 87,059 యూనిట్లు అమ్ముడయ్యాయి.

సానుకూల మార్కెట్ సెంటిమెంట్‌, రాబోయే పండుగల సీజన్‌తో దేశీయ ద్విచక్ర వాహన మార్కెట్‌లో డిమాండ్ ఆశాజనకంగా ఉందని కంపెనీ తెలిపింది.

‘సెమీకండక్టర్ల లభ్యత మెరుగవడంతో సప్లై చైన్ వ్యవస్థ పునరుద్ధరణకు నోచుకుంది. పండుగ డిమాండ్‌ను తీర్చడానికి కంపెనీ ఇప్పుడు వేగంగా సిద్ధమవుతోంది..’ అని టీవీఎస్ మోటార్ తెలిపింది.

ఎగుమతుల విభాగానికి సంబంధించి మొత్తం షిప్‌మెంట్ ఆగస్టు 2021లో 1,09,927 యూనిట్లు ఉండగా 2022 ఆగస్టులో అవి 93,111 యూనిట్లకు తగ్గాయి. టూ వీలర్ ఎగుమతులు ఆగస్టు 2022లో 76,214 యూనిట్ల అమ్మకాలను నమోదు చేశాయి.

ఆగస్ట్ 2022లో త్రీవీలర్ల వ్యాపారం 11 శాతం వృద్ధి చెంది 18,248 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఆగస్టు 2021లో 16,381 యూనిట్లు అమ్ముడయ్యాయి.

2021 ఆగస్ట్‌లో 649 యూనిట్లతో పోల్చితే 2022 ఆగస్టులో టీవీఎస్ ఐక్యూబ్ 4,418 యూనిట్ల అమ్ముడుపోయాయి. దేశంలోని ప్రీ-ఓన్డ్ మల్టీ-బ్రాండ్ టూ-వీలర్ స్పేస్‌లో వినూత్న పరిష్కారాలను ప్రారంభించే లక్ష్యంతో ఫార్ములా-1 కార్ రేసర్ నారాయణ్ కార్తికేయన్ స్టార్టప్ అయిన డ్రైవ్‌ఎక్స్‌లో పెట్టుబడి పెడుతున్నట్టు టీవీఎస్ మోటార్స్ ప్రకటించింది.