తెలుగు న్యూస్  /  National International  /  Tiss Net Pg Admissiotiss Net Pg Admission 2023: Registration Ends Jan 28, Apply At Appln.tiss.edu

TISS NET PG Admission 2023: టిస్ నెట్ పీజీ కి అప్లై చేసుకోండిలా..

HT Telugu Desk HT Telugu

26 January 2023, 19:00 IST

  • సోషల్ సైన్సెస్ కు సంబంధించి భారత్ లోని ప్రఖ్యాత విద్యా సంస్థల్లో ఒకటైన టాటా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (Tata Institute of Social Sciences TISS) లో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకునే ఆఖరు తేదీ దగ్గర పడింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

టాటా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (Tata Institute of Social Sciences TISS) లో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పరీక్ష National Entrance Test (NET) కు దరఖాస్తు చేసుకునే ఆఖరు తేదీ జనవరి 28. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని విద్యార్థులు జనవరి 28 లోగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.

ట్రెండింగ్ వార్తలు

Kota suicide: ‘‘సారీ నాన్నా.. ఈ సారి కూడా సాధించలేకపోయా’’ - కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య

Stabbings in London: లండన్ లో కత్తితో దుండగురి వీరంగం; పలువురికి గాయాలు

Chhattisgarh encounter: మావోలకు మరో ఎదురు దెబ్బ; ఎన్ కౌంటర్ లో ఏడుగురు నక్సల్స్ మృతి

Covishield vaccine : కోవిషీల్డ్​ టీకాతో ప్రమాదకరమైన సైడ్​ ఎఫెక్ట్​.. ఒప్పుకున్న ఆస్ట్రాజెనెకా!

TISS NET PG Admission 2023: ఫిబ్రవరి 25 న పరీక్ష

Tata Institute of Social Sciences(TISS) అధికారిక వెబ్ సైట్ appln.tiss.edu ద్వారా టిస్ నెట్ పీజీ (TISS NET PG) కి అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఫిబ్రవరి 16 నుంచి వెబ్ సైట్ లో హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయి. ఫిబ్రవరి 25 న ఈ నెట్ (National Entrance Test NET) పరీక్ష ను నిర్వహిస్తారు. ఫిబ్రవరి 25న మధ్యాహ్నం 2 గంటల నుంచి మధ్యాహ్నం 3.40 గంటల వరకు ఈ పరీక్ష ఉంటుంది.

ఈ టిస్ నెట్ (TISS-NET) కంప్యూటర్ బేస్డ్ పరీక్ష. అన్ని టిస్ TISS క్యాంపస్ లలో పీజీ కోర్సుల్లో ప్రవేశానికి ఈ పరీక్ష కామన్ గా ఉంటుంది. ఈ పరీక్ష మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లతో 100 మార్కులకు ఉంటుంది. 100 నిమిషాల సమయం ఇస్తారు. ఇందులో ఉత్తీర్ణత సాధించిన వారు స్టేజ్ 2 కి వెళ్తారు. పూర్తి వివరాలకు టిస్ (TISS) వెబ్ సైట్ ను సందర్శించాలి.