Tata Housing Opportunities NFO | ఈ రోజే టాటా హౌసింగ్ ఆపర్చునిటీస్ ఫండ్ ప్రారంభం
16 August 2022, 18:27 IST
Tata Mutual Fund నుంచి కొత్తగా Tata Housing Opportunities Fund ఈ రోజే ఓపెన్ అయింది. ఈ ఫండ్ నిర్మాణ రంగానికి అవసరమైన వాటిని సరఫరా చేసే సంస్థలు ఉన్న పోర్ట్‌ఫోలియోలో పెట్టుబడులు పెడ్తుంది.
ప్రతీకాత్మక చిత్రం
Tata Housing Opportunities NFO | కనీసం రూ. 5 వేలు..
ఈ ఫండ్‌లో కనీస పెట్టుబడి రూ. 5 వేలు. ఆ పై రూ. 5 వేల చొప్పున పెంచుకుంటూ వెళ్లవచ్చు. ఇది హౌజింగ్ ఓపెన్ ఎండెడ్ ఈక్విటీ స్కీమ్. ఈ ఫండ్‌ను ఆగస్ట్ 16న ప్రారంభిస్తున్నట్లు టాటా మ్యూచువల్ ఫండ్ ప్రకటించింది. ``సాధారణంగా ప్రజల పెట్టుబడుల్లో అధిక శాతం ఇంటి నిర్మాణానికి సంబంధించినవే ఉంటాయి. సిమెంట్, స్టీల్, పెయింట్స్, టైల్స్, ఎలక్ట్రికల్స్, హార్డ్ వేర్.. మొదలైనవి ఇంటి నిర్మాణంలో అత్యవసరం. ఈ రంగాల్లో వ్యాపారం ఒడిదుడుకులకు లోనవడం చాలా తక్కువ. భారతీయ ఈక్విటీ మార్కెట్లో ఈ రంగాల్లోని సంస్థలు అనేకం భాగస్వామ్యులై ఉన్నాయి. అందువల్ల ఈ ఫండ్‌లో పెట్టబడుల వల్ల దీర్ఘకాలంలో మంచి లాభాలకు అవకాశం ఉంది`` అని టాటా మ్యూచువల్ ఫండ్ ఒక ప్రకటనలో తెలిపింది.
Tata Housing Opportunities NFO | నిఫ్టీ హౌజింగ్ ఇండెక్స్
``Tata Housing Opportunities Fund తో పోలిస్తే.. నిఫ్టీ హౌజింగ్ ఇండెక్స్(NIFTY Housing Index - TRI) కొంత విస్తృతమైనది. అందులో నేరుగా రియల్ ఎస్టేట్‌కు సంబంధించిన బిజినెస్‌లతో పాటు పరోక్షంగా ఆ రంగంతో సంబంధం ఉన్న సంస్థలు, నిర్మాణ రంగం ద్వారా పరోక్షంగా ప్రయోజనం పొందే సంస్థలు కూడా ఉంటాయి. Tata Housing Opportunities Fund పూర్తిగా రియల్ ఎస్టేట్ రంగంతో నేరుగా సంబంధం ఉన్న కంపెనీల పోర్ట్‌ఫోలియో. Growth-At-A-Reasonable-Price (GARP) ఆధారంగా ఈ పోర్ట్‌ఫోలియోను నిర్వహిస్తాం`` అని ఫండ్ మేనేజర్ తేజస్ గుట్కా వెల్లడించారు.