తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Cm Nitish Kumar | 8 వ సారి.. `నితీశ్ అనే నేను..`!

CM Nitish Kumar | 8 వ సారి.. `నితీశ్ అనే నేను..`!

HT Telugu Desk HT Telugu

10 August 2022, 16:26 IST

  • CM Nitish Kumar | బిహార్ ముఖ్య‌మంత్రిగా జేడీయూ నేత నితీశ్ కుమార్ బుధ‌వారం ప్ర‌మాణ స్వీకారం చేశారు. ఒక రాష్ట్ర సీఎంగా 8వ సారి ప్ర‌మాణం చేసి రికార్డు సృష్టించారు. కొద్ది కాలం మిన‌హా 2005 నుంచి బిహార్ ముఖ్య‌మంత్రిగా నితీశ్ కుమారే ఉన్నారు.

ప్ర‌మాణ స్వీకారం అనంత‌రం నితీశ్ కుమార్‌, తేజ‌స్వీ యాద‌వ్‌
ప్ర‌మాణ స్వీకారం అనంత‌రం నితీశ్ కుమార్‌, తేజ‌స్వీ యాద‌వ్‌ (PTI)

ప్ర‌మాణ స్వీకారం అనంత‌రం నితీశ్ కుమార్‌, తేజ‌స్వీ యాద‌వ్‌

CM Nitish Kumar | బిహార్‌లో కొత్త ప్ర‌భుత్వం కొలువు తీరింది. మ‌హా కూట‌మి 2.0 అధికారంలోకి వ‌చ్చింది. ముఖ్య‌మంత్రిగా జేడీయూ నేత నితీశ్ కుమార్‌తో పాటు ఆర్జేడీ నేత తేజ‌స్వీ యాద‌వ్ మాత్ర‌మే ప్ర‌మాణ స్వీకారం చేశారు. నితీశ్ త్వ‌ర‌లో కొత్త‌ కేబినెట్ ను ఏర్పాటు చేయ‌నున్నారు. బుధ‌వారం ప్ర‌మాణ స్వీకారం చేశారు. వారితో గ‌వ‌ర్న‌ర్ ఫాగు చౌహాన్ ప్ర‌మాణ స్వీకారం చేయించారు. ప్ర‌మాణ స్వీకార కార్య‌క్ర‌మానికి బీజేపీ స‌భ్యులెవ‌రూ హాజ‌రు కాలేదు. త‌మ‌కు ఆహ్వానం లేనందువ‌ల్ల‌నే హాజ‌రుకాలేద‌ని బీజేపీ నేత‌లు తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు

Bengaluru: బెంగళూరులో రాత్రంతా భారీ వర్షం; విమానాశ్రయంలో లీకేజీ; పలు ఫ్లైట్స్ రద్దు

Kejriwal gets interim bail: కేజ్రీవాల్ కు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు; ఢిల్లీ ఎన్నికల్లో ప్రచారానికి వీలు

Man chops off girl's head: పెళ్లి క్యాన్సిల్ అయిందని మైనర్ తల నరికి, తీసుకువెళ్లిన యువకుడు

స్టూడెంట్​తో సెక్స్​ చేసిన టీచర్​ అరెస్ట్​.. బెయిల్​పై బయటకు వచ్చి మరో విద్యార్థి వల్ల గర్భం!

CM Nitish Kumar | నాట‌కీయ ప‌రిణామాలు..

బిహార్లో మంగ‌ళ‌వారం అనూహ్య నాట‌కీయ ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. రాష్ట్రంలో ఎన్డీయే ప్ర‌భుత్వం కుప్ప‌కూలింది. సాయంత్రం 4 గంట‌ల స‌మ‌యంలో గ‌వ‌ర్న‌ర్‌ను క‌లిసిన నితీశ్ కుమార్‌.. సీఎం ప‌ద‌వికి రాజీనామా చేస్తున్న‌ట్లు తెలిపారు. బీజేపీ తో తెగ‌తెంపులు చేసుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించారు. గంట‌లోనే మ‌ళ్లీ రాజ్‌భ‌వ‌న్‌కు ఆర్జేడీ నేత తేజ‌స్వీ యాద‌వ్‌తో క‌లిసి వెళ్లి, కొత్త ప్ర‌భుత్వం ఏర్పాటుకు అవ‌స‌ర‌మైన మెజారిటీ ఉంద‌ని, త‌మ‌ను ప్ర‌భుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల‌ని కోరారు. దాంతో నితీశ్ నేతృత్వంలోనే నూత‌న ప్ర‌భుత్వం ఏర్ప‌డ‌డానికి రంగం సిద్ధ‌మైంది.

CM Nitish Kumar | పీఎం మోదీకి గుబులు

ప్ర‌ధాని మోదీకి 2024 ఎన్నిక‌ల భ‌యం ప్రారంభ‌మైందని ప్ర‌మాణ స్వీకారం అనంత‌రం నితీశ్ కుమార్ వ్యాఖ్యానించారు. ఈ ప్ర‌భుత్వం పూర్తి కాలం మ‌న‌లేద‌న్న బీజేపీ వ్యాఖ్య‌ల‌ను నితీశ్ తోసిపుచ్చారు. 2015 ఎన్నిక‌ల అనంత‌రం బీజేపీ ఏ ప‌రిస్థితిలో ఉందో 2024లో అదే స్థితికి మ‌ళ్లీ వ‌స్తుంద‌ని వ్యాఖ్యానించారు. 2014లో మోదీ గెలిచాడు.. కానీ 2024 లో గెలుస్తారా? అని ప్ర‌శ్నించారు.