తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Man Chops Off Girl's Head: పెళ్లి క్యాన్సిల్ అయిందని మైనర్ తల నరికి, తీసుకువెళ్లిన యువకుడు

Man chops off girl's head: పెళ్లి క్యాన్సిల్ అయిందని మైనర్ తల నరికి, తీసుకువెళ్లిన యువకుడు

HT Telugu Desk HT Telugu

10 May 2024, 14:33 IST

  • Man chops off girl's head: కర్నాటకలో దారుణం చోటు చేసుకుంది. పెళ్లి వాయిదా పడిందన్న కోపంతో ఒక యువకుడు 16 ఏళ్ల బాలిక తల నరికి, ఆ తలను తనతో తీసుకువెళ్లాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.

బాలిక తల నరికిన యువకుడు
బాలిక తల నరికిన యువకుడు

బాలిక తల నరికిన యువకుడు

Man chops off girl's head: కర్నాటకలోని కొడగు జిల్లా, మదికెరి లో అత్యంత దారుణ నేరం జరిగింది. తమ కూతురు మైనర్ కావడంతో అధికారుల సూచనల మేరకు తల్లిదండ్రులు పెళ్లిని వాయిదా వేసుకున్నారు. దాంతో, పట్టలేని ఆగ్రహంతో ఆ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇంట్లో పెద్ద గొడవ చేసి, ఆ బాలిక తల నరికాడు. అనంతరం, ఆ తల తీసుకుని పరారయ్యాడు.

పెళ్లి వాయిదా పడడంతో..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్నాటకలోని మదికెరిలో ఈ ఘటన జరిగింది. 22 ఏళ్ల ప్రకాశ్ పెళ్లి 16 ఏళ్ల మీనా తో సెటిల్ అయింది. మే 9వ తేదీన వారి ఎంగేజ్ మెంట్ జరగాల్సి ఉంది. అయితే, ఈ సమాచారం తెలుసుకున్న శిశు సంక్షేమ అధికారులు పెళ్లికూతురైన మీనా ఇంటికి వెళ్లి వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. మైనర్ కు పెళ్లి చేయడం నేరమని సర్దిచెప్పారు. అటు, పెళ్లికొడుకు ప్రకాశ్ కుటుంబ సభ్యులను కూడా వారు సముదాయించారు. దాంతో,ఇరు కుటుంబాల వారు పెళ్లిని మరో రెండేళ్లు వాయిదా వేసుకోవాలని నిర్ణయించుకున్నారు.

తల నరికి, వెంట తీసుకువెళ్లి

అయితే, ఆ సాయంత్రం మరోసారి పెళ్లి కూతురు మీనా ఇంటికి ప్రకాశ్ వెళ్లాడు. మద్యం మత్తులో ఉన్న ప్రకాశ్, పెళ్లి వాయిదా పడడంతో అక్కడ పెద్ద గొడవ చేశాడు. అక్కడున్న వారిపై దాడికి దిగాడు. గదిలో ఉన్న మీనాను బయటకు లాక్కువచ్చి ఆమెపై తనతో తెచ్చుకున్న గొడ్డలితో దాడి చేశాడు. ఆమె మెడపై వేటు వేసి, వేరుపడిన తలను తనతో తీసుకువెళ్లాడు. దీంతో అక్కడి వారంతా తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. సమాచారం తెలియడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ప్రకాశ్ దాడిలో గాయపడిన మీనా తల్లిదండ్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నిందితుడు కోసం తీవ్రంగా గాలిస్తున్నామని కొడగు ఎస్పీ తెలిపారు. అతడిపై ఐపీసీ 307, 302 సెక్షన్లు , పొక్సొ చట్టం కింద కేసు నమోదు చేశామన్నారు.

తదుపరి వ్యాసం