తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Vande Bharat Train: వందే భారత్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ పై మళ్లీ రాళ్ల దాడి

Vande Bharat train: వందే భారత్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ పై మళ్లీ రాళ్ల దాడి

HT Telugu Desk HT Telugu

25 February 2023, 22:06 IST

  • Vande Bharat train: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించి వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్ల (ande Bharat Express train) పై రాళ్ల దాడులు కొనసాగుతున్నాయి. 

వందే భారత్ ఎక్స్ ప్రెస్ ట్రైన్
వందే భారత్ ఎక్స్ ప్రెస్ ట్రైన్

వందే భారత్ ఎక్స్ ప్రెస్ ట్రైన్

Vande Bharat train: కేంద్ర రైల్వే శాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ప్రారంభిస్తున్న వందే భారత్ రైళ్లపై దేశవ్యాప్తంగా రాళ్ల దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా బెంగళూరు డివిజన్ పరిధిలో మైసూరు - చెన్నై వందే భారత్ ఎక్స్ ప్రెస్ (Vande Bharat express) ట్రైన్ పై గుర్తు తెలియని దుండగులు రాళ్లతో దాడి చేశారు. కేఆర్ పురం, బెంగళూరు కంటోన్మెంట్ స్టేషన్ల మధ్య ఈ ఘటన జరిగింది.

ట్రెండింగ్ వార్తలు

Covid vaccine: సేఫ్టీ ఇష్యూస్ కారణంగా కోవిషీల్డ్ వ్యాక్సిన్ ను ఉపసంహరించుకోనున్న ఆస్ట్రాజెనెకా

Haryana: హరియాణాలో సంక్షోభంలో బీజేపీ సర్కారు; అసెంబ్లీలో మారిన సంఖ్యాబలం

US crime news: ‘‘డాడీకి గుడ్ బై చెప్పు’’ - మూడేళ్ల కొడుకును షూట్ చేసి చంపేసిన కర్కశ తల్లి

Dhruv Rathee: ధృవ్​ రాఠీ: సోషల్ మీడియా సంచలనం.. మోదీనే ఎందుకు టార్గెట్ చేశారు?

Vande Bharat train: సీరియస్ యాక్షన్

వందేభారత్ ఎక్స్ ప్రెస్ (Vande Bharat express) ట్రైన్సపై రాళ్ల దాడులు చేయడాన్ని సీరియస్ గా తీసుకుంటున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. రాళ్ల దాడులు చేసిన వారికి నాన్ బెయిలబుల్ కేసులను నమోదు చేస్తామని హెచ్చరించింది. శనివారం మైసూరు - చెన్నై వందే భారత్ ఎక్స్ ప్రెస్ (Vande Bharat express) ట్రైన్ పై గుర్తు తెలియని దుండగులు చేసిన రాళ్ల దాడి వలన రెండు కిటీకీల అద్దాలు ధ్వంసమయ్యాయని సౌత్ వెస్ట్ రైల్వేస్ (Southwest Railways) ప్రకటించింది. ప్రయాణీకులెవరూ గాయపడలేదని, ఈ దాడికి పాల్పడిన వారికి గుర్తించేందుకు రైల్వే పోలీసులు ప్రయత్నిస్తున్నారని వెల్లడించింది. జనవరి నెలలో సౌత్ వెస్ట్ రైల్వేస్ (Southwest Railways) పరిధిలో 21 రాళ్ల దాడుల ఘటనలు జరిగాయి. ఫిబ్రవరిలో బెంగళూరు డివిజన్లో 13 ఘటనలు చోటు చేసుకున్నాయి.

Vande Bharat train: తెలంగాణలో కూడా..

రెండు వారాల క్రితం తెలంగాణలోని మహాబూబాబాద్ జిల్లాలో కూడా వందే భారత్ ఎక్స్ ప్రెస్ (Vande Bharat express) ట్రైన్ పై దుండగులు రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో ప్రయాణీకులెవరూ గాయపడలేదు. రైలు కిటికీ అద్దం ఒకటి ధ్వంసమైంది. ఆంధ్ర ప్రదేశ్ లోని వైజాగ్ లో కూడా వందే భారత్ ట్రైన్ పై రాళ్లు విసిరిన ఘటన చోటు చేసుకుంది. చెన్నై - మైసూర్ వందేభారత్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ దక్షిణ భారతదేశంలో తొలి వందేభారత్ ఎక్స్ ప్రెస్ (Vande Bharat express). తమిళనాడు రాజధాని చెన్నై, కర్నాటక లోని మైసూరుల మధ్య ఈ ట్రైన్ నడుస్తోంది.

టాపిక్