Vande Bharat Stone Pelting: వందే భారత్ రైలుపై రాళ్లు విసిరిన నిందితులు అరెస్ట్
వందేభారత్ రైలుపై రాళ్ల దాడి చేసిన నిందితులను పోలీసులు గుర్తించారు. గోశాల శంకర్ మరియు సిర్ల శివను రైల్వే కోర్టులో హాజరుపర్చారు.
Vande Bharat Stone pelting at Visakhapatnam:విశాఖ కంచరపాలెం వద్ద వందేభారత్ రైలుపై రాళ్ల దాడి చేసిన ముగ్గురు నిందితులను పోలీసులు గుర్తించారు. సీసీ కెమెరాల్లో రికార్డయిన వీడియో ద్వారా ఇద్దరు నిందితులకు పట్టుకున్నారు. గోశాల శంకర్ మరియు సిర్ల శివను రైల్వే కోర్టులో హాజరుపర్చారు.
రైల్వే గేట్ సమీపంలోని అండర్ బ్రిడ్జి వద్దకు చందు, రాజులను శంకర్ పిలిపించినట్లు విచారమలో తేలింది. సాయంత్రం 05:30 గంటల సమయంలో రైలుపై దాడి చేశారని... ఆర్‌పీఎఫ్ పోలీస్ వారిని వెంబడించడంతో వారు నిందితులు పారిపోయారు. ఈ క్రమంలో శంకర్ తన చెప్పును అక్కడే వదిలేశాడు. ఇదే సమయంలో వందే భారత్ రైలుకు ఉన్న సీసీ కెమెరాల ద్వారా నిందితులను పోలీసులు గుర్తించారు.
గోశాల శంకర్, s/o సుబ్రమణ్యం మురుగన్, వయస్సు-22. ఇతనిపై 04 ఆస్తి నేరాల కేసులు ఉన్నాయి. మద్యం మత్తులో ఆకతాయిగా రాళ్లు విసిరినట్టు దర్యాప్తులో ఒప్పుకున్నాడు.
మదీనాబాగ్‌కు చెందిన టేకేటి చందు ఓ హత్య కేసుతో ప్రమేయం ఉంది.
గాజువాకకు చెందిన పెద్దాడ రాజ్ కుమార్ (వయసు-19). వివరాలు తెలియాల్సి ఉంది.
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మంజూరైన తొలి వందే భారత్ రైలు... సికింద్రాబాద్ - విశాఖపట్నం మధ్య పరుగులు పెట్టేందుకు రెడీ అయింది. జనవరి 19న ప్రారంభం కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో.. ట్రయల్ రన్ కోసం వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు బుధవారం చెన్నై నుంచి విశాఖపట్నం చేరింది. రైలు వేగం, ట్రాక్ తదితర అంశాలపై రైల్వే అధికార పరిశీలన పూర్తయన తర్వాత... రైలు విశాఖ నుంచి మర్రిపాలెంలో కోచ్ నిర్వహణ కేంద్రానికి బయలు దేరింది. కంచరపాలెం రామ్మూర్తి పంతులు పేట వద్దకు రాగానే కొందరు ఆకతాయిలు రైలుపై రాళ్లు విసిరారు. దీంతో... 2 కోచ్ అద్దాలు ధ్వంసమయ్యాయి. దీనిపై విచారణ జరిపిన పోలీసులు... ముగ్గురిని నిందితులుగా గుర్తించారు. ఇద్దర్ని కోర్టులో హాజరుపరిచారు.