తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Presidential Election: రాష్ట్రపతి ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభం

Presidential Election: రాష్ట్రపతి ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభం

HT Telugu Desk HT Telugu

21 July 2022, 13:39 IST

    • Presidential Election: రాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియలో భాగంగా ఓట్ల లెక్కింపు ఈ ఉదయం ప్రారంభమైంది.
కౌంటింగ్ కోసం బ్యాలెట్ పేపర్లను బయటకు తీస్తున్న అధికారులు
కౌంటింగ్ కోసం బ్యాలెట్ పేపర్లను బయటకు తీస్తున్న అధికారులు (AP)

కౌంటింగ్ కోసం బ్యాలెట్ పేపర్లను బయటకు తీస్తున్న అధికారులు

న్యూఢిల్లీ, జూలై 21: దేశ 15వ రాష్ట్రపతి పేరును ప్రకటించేందుకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ గురువారం ఉదయం ప్రారంభమైందని, పోలింగ్ అధికారులు వివిధ రాష్ట్రాలకు చెందిన బ్యాలెట్ పేపర్లను సార్టింగ్ చేశారని అధికారులు తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు

Chardham Yatra 2024: చార్ ధామ్ యాత్రకు ఆఫ్ లైన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యే తేదీ ఇదే; ఆన్ లైన్ లో కూడా చేసుకోవచ్చు

Sexual assault in Delhi Metro: ఢిల్లీ మెట్రోలో 16 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడి యత్నం; వణికిపోయిన మైనర్

Jammu and Kashmir news: భద్రతా బలగాలపై ఉగ్రవాదుల కాల్పులు; ఐదుగురు జవాన్లకు గాయాలు

IGNOU July 2024 session: ఇగ్నో లో జులై సెషన్ కు రీ రిజిస్ట్రేషన్ విండో ఓపెన్; విద్యార్థులు ఇలా రిజిస్టర్ చేసుకోండి..

ఎన్‌డీఏ తరఫున ద్రౌపది ముర్ము, ప్రతిపక్షాల నుంచి యశ్వంత్ సిన్హా పోటీలో ఉన్నారు.

కౌంటింగ్ ప్రారంభమయ్యే ముందు వివిధ రాష్ట్రాల ఎంపీల ఆకుపచ్చ రంగు బ్యాలెట్ పేపర్లు సార్టింగ్ చేశారు.

కేరళ, మేఘాలయ సహా వివిధ రాష్ట్రాలకు చెందిన బ్యాలెట్ బాక్సులను అక్షర క్రమం ప్రకారం క్రమబద్ధీకరించారు.

ఎమ్మెల్యేలు పింక్ కలర్ బ్యాలెట్ పేపర్లపై తమ ఓట్లను నమోదు చేశారు. రాష్ట్రపతి ఎన్నికలకు జూలై 18న పార్లమెంట్ హౌస్, వివిధ శాసనసభలలో ఓటింగ్ జరిగింది.

ఎన్నికల ప్రధాన రిటర్నింగ్ అధికారి, సహాయ రిటర్నింగ్ అధికారులు, ఎన్నికల సంఘం నియమించిన పరిశీలకుల పర్యవేక్షణలో పార్లమెంట్ భవనంలో ఓట్ల లెక్కింపు జరుగుతోంది.