తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Spicejet Emergency Landing: హైదరాబాద్‌లో స్పైస్ జెట్ అత్యవసర ల్యాండింగ్

SpiceJet emergency landing: హైదరాబాద్‌లో స్పైస్ జెట్ అత్యవసర ల్యాండింగ్

HT Telugu Desk HT Telugu

13 October 2022, 11:39 IST

    • SpiceJet flight makes emergency landing: గోవా నుంచి హైదరాబాద్‌కు వచ్చిన స్పైస్ జెట్ విమానం క్యాబిన్‌లో పొగ రావడంతో అత్యవసరంగా లాండ్ అయ్యింది.
అత్యవసరంగా లాండ్ అయిన స్పైస్ జెట్ విమానం (ప్రతీకాత్మక చిత్రం)
అత్యవసరంగా లాండ్ అయిన స్పైస్ జెట్ విమానం (ప్రతీకాత్మక చిత్రం) (HT_PRINT)

అత్యవసరంగా లాండ్ అయిన స్పైస్ జెట్ విమానం (ప్రతీకాత్మక చిత్రం)

ఢిల్లీ: విమానం కాక్‌పిట్, క్యాబిన్‌లో పొగలు రావడంతో స్పైస్‌జెట్ ఫ్లైట్ ఒకటి బుధవారం అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చిందని, విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యిందని అధికారులు గురువారం తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు

Japan rice balls : చంకలో పెట్టి.. చెమటతో తయారు చేసిన ఈ ఫుడ్​ని ఎగబడి తింటున్నారు!

Heatwave alert : తెలుగు రాష్ట్రాల్లో ఇంకొన్ని రోజుల పాటు భానుడి భగభగలు- ఆ తర్వాత భారీ వర్షాలు!

JNU PG Admissions 2024 : జేఎన్​యూ పీజీ రిజిస్ట్రేషన్​ ప్రక్రియ షురూ- ఇలా అప్లై చేసుకోండి..

‘‘వైవాహిక స్థితితో సంబంధం లేకుండా.. పరస్పర అనుమతితో లైంగిక సంబంధం తప్పు కాదు’’: ఢిల్లీ హైకోర్టు

‘గోవా నుండి హైదరాబాద్‌కు నడుపుతున్న స్పైస్‌జెట్ క్యూ400 విమానం అక్టోబరు 12న క్యాబిన్‌లో పొగలు రావడంతో తన గమ్యస్థానంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. ప్రయాణికులను సురక్షితంగా దింపారు’ అని స్పైస్‌జెట్ ప్రతినిధి తెలిపారు.

పూర్తి ఎమర్జెన్సీని ప్రకటించామని, అందుకే అన్ని ప్రోటోకాల్‌లను పాటించామని ఎయిర్‌పోర్ట్ అధికారులు తెలిపారు. 

‘ఎయిర్‌లైన్ పైలట్ స్థానిక ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ)ని సంప్రదించారు. అత్యవసర ల్యాండింగ్ కోసం సిద్ధం చేయడానికి గ్రౌండ్ సిబ్బందిని సంప్రదించారు..’ అని అధికారులు తెలిపారు.

స్పైస్‌జెట్ ప్రయాణికులపై ప్రభావాన్ని నిర్ధారించనప్పటికీ, ఈ సంఘటన కారణంగా ప్రయాణీకులు భయాందోళనలకు గురయ్యారని, పొగ కారణంగా ఒక ప్రయాణికురాలు అస్వస్థతకు గురయ్యారని, చికిత్స కొనసాగుతుందని నివేదికలు పేర్కొన్నాయి.

ఈ ఘటన కారణంగా దాదాపు తొమ్మిది విమానాలను దారి మళ్లించాల్సి వచ్చిందని కూడా నివేదికలు పేర్కొంటున్నాయి.

స్పైస్‌జెట్ ఇటీవలి నెలల్లో అనేక భద్రతా సంఘటనలపై పరిశీలనను ఎదుర్కొంటోంది. ఈ కారణంగా ఎయిర్‌లైన్స్ విమానాల వేసవి షెడ్యూల్‌పై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) 50% పరిమితిని విధించడానికి ప్రేరేపించింది. ఈ ఎయిర్‌లైన్ తరచుగా ఎయిర్ సేఫ్టీ సంఘటనలను నివేదించిన తర్వాత ఎనిమిది వారాల పాటు స్పైస్‌జెట్ విమానాలపై ఏవియేషన్ రెగ్యులేటర్ జూలై 27న పరిమితిని విధించింది. గత నెల ఏవియేషన్ రెగ్యులేటర్ పరిమితిని ఒక నెల పాటు.. అంటే అక్టోబర్ 29 వరకు పొడిగించింది.

టాపిక్