తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Sail Management Trainee Recruitment 2022: సెయిల్‌లో 245 పోస్టులు.. అప్లై ఇలా

SAIL Management Trainee Recruitment 2022: సెయిల్‌లో 245 పోస్టులు.. అప్లై ఇలా

HT Telugu Desk HT Telugu

08 November 2022, 15:36 IST

    • SAIL Management Trainee Recruitment 2022: సెయిల్ మేనేజ్మెంట్ ట్రైనీ రిక్రూట్మెంట్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది.
సెయిల్ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం
సెయిల్ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

సెయిల్ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

SAIL Management Trainee Recruitment 2022: స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్) మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హులైన అభ్యర్థులు సెయిల్ అధికారిక వెబ్‌సైట్ సెయిల్‌కెరీర్స్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ట్రెండింగ్ వార్తలు

Chardham Yatra 2024: చార్ ధామ్ యాత్రకు ఆఫ్ లైన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యే తేదీ ఇదే; ఆన్ లైన్ లో కూడా చేసుకోవచ్చు

Sexual assault in Delhi Metro: ఢిల్లీ మెట్రోలో 16 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడి యత్నం; వణికిపోయిన మైనర్

Jammu and Kashmir news: భద్రతా బలగాలపై ఉగ్రవాదుల కాల్పులు; ఐదుగురు జవాన్లకు గాయాలు

IGNOU July 2024 session: ఇగ్నో లో జులై సెషన్ కు రీ రిజిస్ట్రేషన్ విండో ఓపెన్; విద్యార్థులు ఇలా రిజిస్టర్ చేసుకోండి..

సెయిల్ మేనేజ్మెంట్ ట్రైనీ రిక్రూట్మెంట్ 2022 కోసం దరఖాస్తుల ప్రక్రియ నవంబరు 3న ప్రారంభమైంది. నవంబరు 23న ముగియనుంది. ఈ నియామక ప్రక్రియలో భాగంగా మొత్తం 245 ఉద్యోగాలను భర్తీ చేస్తారు. అర్హతలు, ఎంపిక ప్రక్రియ ఇక్కడ చూడొచ్చు.

Eligibility Criteria: అర్హతలు ఇవే

అభ్యర్థులు 65 శాతం మార్కులతో ఇంజినీరింగ్ డిగ్రీ కలిగి ఉండాలి. మెకానికల్, మెటలర్జీ, ఎలక్ట్రికల్, కెమికల్, సివిల్ ఇన్‌స్ట్రుమెంటేషన్, మైనింగ్ తదితర ఏడు డిసిప్లిన్లలో ఒక దానిలో ఇంజినీరింగ్ డిగ్రీ కలిగి ఉండాలి. గరిష్ట వయోపరిమితి నవంబరు 23, 2022 నాటికి 28 ఏళ్లుగా నిర్దేశించారు.

Selection Process: ఎంపిక ప్రక్రియ ఇదే

అభ్యర్థులు గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ గేట్ 2022 పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. షార్ట్ లిస్టయిన అభ్యర్థులకు సెయిల్ కెరీర్ వెబ్‌సైట్ ద్వారా తెలియపరుస్తారు. గ్రూప్ డిస్కషన్‌కు, ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు.

Application Fees: దరఖాస్తు రుసుము

దరఖాస్తు రుసుముగా జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులు రూ. 700 ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఈఎస్ఎం, అభ్యర్థులైతే రూ. 200 చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తు రుసుము నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు ద్వారా చెల్లించవచ్చు.

సమగ్ర ప్రకటన ఈ కింది పీడీఎఫ్‌లో చూడొచ్చు.

టాపిక్