తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Rbi Recruitment 2023: ఆర్బీఐ లో జూనియర్ ఇంజినీర్ వేకెన్సీలు..

RBI Recruitment 2023: ఆర్బీఐ లో జూనియర్ ఇంజినీర్ వేకెన్సీలు..

HT Telugu Desk HT Telugu

09 June 2023, 14:08 IST

    • రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) లో జూనియర్ ఇంజినీర్ పోస్ట్ ల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు opportunities.rbi.org.in వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ జూన్ 30.
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) లో జూనియర్ ఇంజినీర్ పోస్ట్ ల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు opportunities.rbi.org.in వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ జూన్ 30.

జూన్ 30 ఆఖరు తేదీ..

ఆర్బీఐలో జూనియర్ ఇంజినీర్ పోస్ట్ లకు జూన్ 9 నుంచి అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకోవడానికి ఆఖరు తేదీ జూన్ 30. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ విభాగాల్లో మొత్తం 35 జూనియర్ ఇంజినీర్ పోస్ట్ లను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు opportunities.rbi.org.in వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో అప్లై చేసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించిన ఆన్ లైన్ పరీక్ష జులై 15న జరిగే అవకాశముంది. అయితే, దీనిపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు.

వేకెన్సీ వివరాలు..

ఈ రిక్రూట్మెంట్ తో మొత్తం 36 జూనియర్ ఇంజినీర్ పోస్ట్ లను భర్తీ చేస్తారు. వాటిలో..

  • జూనియర్ ఇంజినీర్ (సివిల్) - 29 పోస్ట్ లు
  • జూనియర్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్) - 6 పోస్ట్ లు

ఈ పరీక్షకు అభ్యర్థుల వయోపరిమితి 20 సంవత్సరాల నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సున్న వారు మాత్రమే అప్లై చేసుకోవడానికి అర్హులు. వయో పరిమితికి సంబంధించి రిజర్వేషన్లు వర్తిస్తాయి. జూనియర్ ఇంజినీర్ పోస్ట్ కు అప్లై చేసేవారు గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ నుంచి కనీసం సంబంధిత ఇంజినీరింగ్ సబ్జెక్టులో మూడేళ్ల డిప్లోమా పూర్తి చేసి ఉండాలి. అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది. పూర్తి వివరాలకు అభ్యర్థులు opportunities.rbi.org.in. వెబ్ సైట్ లో ఉన్న నోటఫికేషన్ ను పరిశీలించాలి.