తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Rajnath Singh's ‘Shastra Puja’: దసరా సందర్భంగా శస్త్ర పూజ చేసిన రక్షణ మంత్రి

Rajnath Singh's ‘Shastra Puja’: దసరా సందర్భంగా శస్త్ర పూజ చేసిన రక్షణ మంత్రి

HT Telugu Desk HT Telugu

05 October 2022, 22:20 IST

  • Rajnath Singh's ‘Shastra Puja’: దసరా సందర్భంగా రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ బుధవారం ఉత్తరాఖండ్ లోని మిలటరీ బేస్ లో సాంప్రదాయ బద్ధంగా ఆయుధ పూజ నిర్వహించారు. 

ఆయుధ పూజ చేస్తున్న రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్
ఆయుధ పూజ చేస్తున్న రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ (Rajnath Singh Twitter)

ఆయుధ పూజ చేస్తున్న రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్

Rajnath Singh's ‘Shastra Puja’: ప్రతీ దసరాకు రక్షణ మంత్రి ఏదో ఒక సైనిక కేంద్రంలో ఆయుధ పూజ నిర్వహించడం ఆనవాయితీ. ఆ ఆనవాయితీని కొనసాగిస్తూ బుధవారం విజయ దశమి సందర్భంగా దేశ రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఉత్తరాఖండ్ లోని ఔలి మిలటరీ బేస్ లోని ఆయుధ శ్రేణికి శస్త్ర పూజ నిర్వహించారు.

ట్రెండింగ్ వార్తలు

Chardham Yatra 2024: చార్ ధామ్ యాత్రకు ఆఫ్ లైన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యే తేదీ ఇదే; ఆన్ లైన్ లో కూడా చేసుకోవచ్చు

Sexual assault in Delhi Metro: ఢిల్లీ మెట్రోలో 16 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడి యత్నం; వణికిపోయిన మైనర్

Jammu and Kashmir news: భద్రతా బలగాలపై ఉగ్రవాదుల కాల్పులు; ఐదుగురు జవాన్లకు గాయాలు

IGNOU July 2024 session: ఇగ్నో లో జులై సెషన్ కు రీ రిజిస్ట్రేషన్ విండో ఓపెన్; విద్యార్థులు ఇలా రిజిస్టర్ చేసుకోండి..

Rajnath Singh's ‘Shastra Puja’: సైనికులకు ప్రశంసలు..

ఈ సందర్భంగా అక్కడి సైనికులతో రాజనాథ్ సింగ్ కాసేపు మాట్లాడారు. భారతీయ సైనికుల ధైర్య సాహసాలను కొనియాడారు. ముఖ్యంగా 2020లో తూర్పు లద్దాఖ్ లోని గల్వాన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ముఖాముఖి పోరాటంలో భారతీయ సైనికులు గొప్ప ధైర్య సాహసాలను ప్రదర్శించారని గుర్తు చేశారు.

Rajnath Singh's ‘Shastra Puja’: వసుధైక కుటుంబం..

వసుధైక కుటుంబం భావనను భారత్ విశ్వసిస్తుందని, అదే సమయంలో భారత్ పై దాడి చేయాలని ప్రయత్నిస్తే సరైన బుద్ధి చెప్తామని రాజ్ నాథ్ వివరించారు. ఈ కార్యక్రమంలో సైనిక దళాల ప్రధానాధికారి జనరల్ మనోజ్ పాండే, సూర్య కమాండ్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ యోగేంద్ర దిమిరి కూడా పాల్గొన్నారు.