తెలుగు న్యూస్  /  National International  /  Pilots Fall Asleep While Flying At 37,000 Feet, Plane Miss Landing

Pilots fall asleep : అటు పైలట్ల 'నిద్ర'- ఇటు 37వేల అడుగుల ఎత్తులో విమానం.. చివరికి!

Sharath Chitturi HT Telugu

19 August 2022, 14:42 IST

    • Pilots fall asleep : ఆ విమానం 37వేల ఎత్తులో ప్రయాణిస్తోంది. సమీపంలోనే ఎయిర్​పోర్టు ఉంది. రన్​వేపై విమానం దిగాల్సి ఉంది. కానీ.. అలా జరగలేదు. రన్​వే దాటుకుని వెళ్లిపోయింది. ఏటీసీ సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. పైలట్లను అప్రమత్తం చేసేందుకు ప్రయత్నించారు. కానీ పైలట్లు స్పందించలేదు. ఆ విమానంలో అసలేం జరిగింది? చివరికి విమానం పరిస్థితేంటి?
అటు పైలట్ల నిద్ర.. ఇటు 37వేల అడుగుల ఎత్తులో విమానం.. చివరికి!
అటు పైలట్ల నిద్ర.. ఇటు 37వేల అడుగుల ఎత్తులో విమానం.. చివరికి! (AP)

అటు పైలట్ల నిద్ర.. ఇటు 37వేల అడుగుల ఎత్తులో విమానం.. చివరికి!

Pilots fall asleep : విమానాల్లో ఏ చిన్న తప్పు జరిగినా.. ప్రాణనష్టం అత్యంత తీవ్రంగా ఉంటుంది. ముఖ్యంగా విమాన ప్రయాణం సాఫీగా జరగాలంటే పైలట్లు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. అలాంటిది.. ఓ విమానం.. 37వేల అడుగుల ఎత్తులో ఉన్నప్పుడు.. అందులోని ఇద్దరు పైలట్లు నిద్రపోయారు!

ట్రెండింగ్ వార్తలు

CSIR UGC NET : సీఎస్​ఐఆర్​ యూజీసీ నెట్​ జూన్ 2024​ రిజిస్ట్రేషన్లు షురూ..

Politician affair : దత్త పుత్రుడితో బెడ్​ మీద ప్రముఖ రాజకీయ నేత- నగ్నంగా భర్తకు దొరికిపోయి..

Brij Bhushan : బ్రిజ్​ భూషణ్​ కుమారుడికి బీజేపీ టికెట్​- రెజ్లర్ల స్పందన ఇది..

US Presidential Election 2024: ‘‘మళ్లీ జో బైడెన్ గెలుస్తారు’’- అమెరికా అధ్యక్ష ఎన్నికలపై 'నోస్ట్రాడమస్' జోస్యం

సోమవారం.. సుడాన్​లోని ఖార్టూమ్​ నుంచి ఇథియోపియా రాజధాని ఆడిస్​ అబాబాకు బయలుదేరింది ఇథయోపియన్​ ఎయిర్​లైన్స్ ఈటీ343​. కాగా.. అందులో ఇద్దరు పైలట్లు నిద్రపోయారు. ఆడిస్​ అబాబా విమనాశ్రయంలో ఆ విమానం దిగాల్సి ఉంది. రన్​వే సమీపిస్తున్నా, విమానం కిందకి దిగలేదు. దీంతో ఎయిర్​ ట్రఫిక్​ కంట్రోల్​(ఈఏసీ) సిబ్బంది ఆందోళన చెందారు. వెంటనే అలర్ట్​ చేసేందుకు ప్రయత్నించారు. పైలట్లను సంప్రదించేందుకు తీవ్రంగా కృషి చేశారు. కానీ పైలట్ల నుంచి ఎలాంటి స్పందన లభించలేదు.

అయితే.. పైలట్లు పడుకునే సమయంలో ఆటోపైలట్​ మోడ్​ను ఆన్​ చేసినట్టు తెలుస్తోంది. రన్​వేదాటిన తర్వాత.. అది ఆఫ్​ అయినట్టు, వెంటనే ఆలరం మోగినట్టు సమాచారం.

ఆ శబ్దానికి పైలట్లు నిద్ర నుంచి హఠాత్తుగా లేచి, ఏం జరిగిందో అర్థం చేసుకున్నారు. చివరికి.. 25నిమిషాల గందరగోళం తర్వాత.. విమానం.. రన్​వైపై ల్యాండ్​ అయ్యింది. అప్పడు అసలు విషయం బయటపడింది.

ఆ విమానం.. మరో ట్రిప్​ వేసేందుకు 2.5గంటలు ఆలస్యమైంది.

ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి నష్టం జరగలేదు.

ఏడీఎస్​-బీ(ఏవియేషన్​ సర్వీలియన్స్​ సిస్టం) కూడా ఈ ఘటనను ధ్రువీకరించింది. విమానం.. రన్​వే దాటి వెళ్లిపోయిందని పేర్కొంది. ఇది చాలా ఆందోళనకర విషయం ఏవిషేయన్​ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

<p>విమానం రూట్​ ఇలా..</p>

ఇలా.. విమానంలో పైలట్లు నిద్రపోతున్న ఘటనలు కొత్తేమీ కాదు. మే నెలలో.. న్యూయార్క్​ నుంచి రోమ్​కు బయలుదేరిన ఓ విమానంలోనూ పైలట్లు పడుకుండిపోయారు. అప్పుడు ఆ విమానం 38వేల అడుగుల ఎత్తులో ఉంది.

టాపిక్