తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  'Bomb Cyclone' In The Us: అమెరికాలో ‘బాంబ్ సైక్లోన్’ విధ్వంసం

'bomb cyclone' in the US: అమెరికాలో ‘బాంబ్ సైక్లోన్’ విధ్వంసం

23 December 2022, 15:28 IST

  • 'bomb cyclone' in the US: క్రిస్టమస్ సెలవులకు సిద్ధమవుతున్న అమెరికన్లకు వాతావరణ శాఖ పిడుగువంటి వార్త తెలిపింది. వారి వెకేషన్ ఆశలను చిదిమేస్తూ.. అరుదుగా వచ్చి, విధ్వంసం సృష్టించే బాంబ్ సైక్లోన్ తరుముకు వస్తోందని హెచ్చరించింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

'bomb cyclone': ఈ తుపానును తక్కువగా అంచనా వేయవద్దని, అన్ని సహాయ ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని అమెరికా(America) అధ్యక్షుడు జో బైడెన్(Joe Biden) సైతం అధికారులను హెచ్చరించారు. చిన్నప్పుడు మనం చూసిన ‘స్నో డే’ వంటిది 'bomb cyclone' కాదని వారితో వ్యాఖ్యానించారు.

ట్రెండింగ్ వార్తలు

Chardham Yatra 2024: చార్ ధామ్ యాత్రకు ఆఫ్ లైన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యే తేదీ ఇదే; ఆన్ లైన్ లో కూడా చేసుకోవచ్చు

Sexual assault in Delhi Metro: ఢిల్లీ మెట్రోలో 16 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడి యత్నం; వణికిపోయిన మైనర్

Jammu and Kashmir news: భద్రతా బలగాలపై ఉగ్రవాదుల కాల్పులు; ఐదుగురు జవాన్లకు గాయాలు

IGNOU July 2024 session: ఇగ్నో లో జులై సెషన్ కు రీ రిజిస్ట్రేషన్ విండో ఓపెన్; విద్యార్థులు ఇలా రిజిస్టర్ చేసుకోండి..

'bomb cyclone' threatens the US: తీవ్ర మంచు తుపాను

వాతావరణ శాఖ అధికారులు ‘బాంబ్ సైక్లోన్(bomb cyclone)’గా పేర్కొంటున్న ఈ తీవ్రమైన తుపాను కారణంగా పెద్ద ఎత్తున చలి గాలులు వీస్తాయి. భారీగా మంచు పడుతుంది. ఉష్ణోగ్రతలు మైనస్ 50 డిగ్రీల వరకు వెళ్తాయి. క్రిస్టమస్ పండుగ లోపు ఇది అమెరికా(America)లోని మధ్య, తూర్పు రాష్ట్రాలపై పెను ప్రభావం చూపనుంది. ఈ బాంబ్ సైక్లోన్(bomb cyclone) వల్ల వాతావరణ పీడనం ఒక్కసారిగా తగ్గిపోతుంది. ఉష్ణోగ్రతలు క్షణాల్లో తగ్గిపోతాయి. దాంతో, అత్యల్ప ఉష్ణోగ్రతల వల్ల ఎదురయ్యే frostbite వంటి సమస్యలు ఎదురవుతాయి. ఈ బాంబ్ సైక్లోన్ అరుదుగా సంభవిస్తుందని, కొన్ని దశాబ్దాలకు ఒకసారి వచ్చి, విధ్వంసం సృష్టిస్తుందని వాతావరణ శాఖ అధికారి ఆస్టన్ రాబిన్సన్ కుక్ వివరించారు. ఈ బాంబ్ సైక్లోన్(bomb cyclone) తో నిమిషాల్లో 10ఫీట్ల ఎత్తున మంచు పేరుకుపోతుందని రాబిన్ కుక్ వివరించారు.

'bomb cyclone' threatens the US: 13 కోట్ల మందిపై ప్రభావం..

ఈ బాంబ్ సైక్లోన్(bomb cyclone) అమెరికాలోని(America) మధ్య, తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లోని సుమారు 13.5 కోట్ల మంది అమెరికన్లపై పెను ప్రభావం చూపనుంది. ఇప్పటికే ముందు జాగ్రత్త చర్యగా ఈ ప్రాంతాల్లో సర్వీసులను అందించే వేలాది విమాన సర్వీసులను నిలిపేశారు. చాలా హైవేలపై ప్రయాణాలను ఆపేశారు. ప్రభావిత ప్రాంతాల్లోని హోం లెస్ షెల్టర్లు ఇప్పటికే నిండిపోయాయి. మిషిగన్, సౌత్ డకోటా, డెస్ మోయిన్స్, అయోవా వంటి ప్రాంతాల్లో గురువారం ఉష్ణోగ్రతలు మైనస్ 37 డిగ్రీలకు పడిపోయాయి. అధికారులు యుద్ధ ప్రాతిపదికన మంచుతో నిండిపోయిన రోడ్లను క్లియర్ చేస్తున్నారు. bomb cyclone ప్రభావిత ప్రాంతాల్లని, ముఖ్యంగా ట్రైబల్ ప్రాంతాల్లోని ప్రజలకు ప్రొపేన్, వంటచెరకు పంపిణీ చేస్తున్నారు. ప్రతికూల వాతావరణం కారణంగా సహాయ చర్యలకు ఇబ్బంది కలుగుతోంది. ఈ తుపాను కారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగితే, పరిస్థితి మరింత దారుణమవుతుందని అధికారులు ఆందోళన చెందుతున్నారు. మెక్సికో సరిహద్దుల్లో టెంట్లు వేసుకుని అమెరికలో ప్రవేశించడం కోసం ఎదురు చూస్తున్న వేలాది మంది శరణార్ధులపై ఈ బాంబ్ సైక్లోన్(bomb cyclone) విరుచుకుపడనుంది.

'bomb cyclone' threatens the US: పౌరులకు సూచనలు

ఈ బాంబ్ సైక్లోన్(bomb cyclone) శాంతించేవరకు ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని ప్రజలకు అధికారులు సూచిస్తున్నారు. విద్యుత్ సరఫరా నిలిచిపోయినా, సమస్యలు ఎదురుకాకుండా, ముందు జాగ్రతగా అవసరమైన సరంజామా సిద్ధం చేసుకోవాలని, ఇంట్లో వృద్ధులు, పిల్లలు ఉంటే, వారి సంరక్షణ కు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, అనవసర విద్యుత్ వినియోగాన్ని తగ్గించుకోవాలని సూచిస్తున్నారు. రహదారులపై మంచు పేరుకుపోతుండడంతో వాహనాలు స్కిడ్ అవుతున్నాయి. ఇప్పటికే కన్సాస్ సిటీలో మంచు కారణంగా కారు బోల్తా కొట్టి ఒక వ్యక్తి చనిపోయాడు. అందువల్ల అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని సూచిస్తున్నారు.

flight services cancelled in the US: విమాన సర్వీసుల రద్దు

bomb cyclone కారణంగా ఇప్పటివరకు 2,157 విమాన సర్వీసులను ర్దు చేశారు. శుక్రవారం నాటి విమాన సర్వీసుల్లో 1576 సర్వీసులను కూడా రద్దు చేశారు. చికాగో, డెన్వర్ విమానాశ్రయాల్లో ఎక్కువ సంఖ్యలో విమాన సర్వీసులు రద్దు అయ్యాయి.

టాపిక్