తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  News Transport Services : ఇక ఆన్‌లైన్‌లో ట్రాన్స్‌పోర్ట్‌ సేవలు

News Transport Services : ఇక ఆన్‌లైన్‌లో ట్రాన్స్‌పోర్ట్‌ సేవలు

B.S.Chandra HT Telugu

18 September 2022, 7:01 IST

    • News Transport Services ట్రాన్స్‌పోర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ సర్వీసులంటే మధ్యవర్తులు, దళారులు లేకుంటే ఒక్క పని కూడా పూర్తికాదు. దేశంలో ఏ రాష్ట్రమైనా ఇదే పరిస్థితి. చేతులు తడపనిదే రవాణా శాఖలో పనులు పూర్తి కావని జనం కూడా ఫిక్సైపోయారు. ఈ నేపథ్యంలో  దేశవ్యాప్తంగా రవాణా రంగ సంస్కరణల్లో భాగంగా ట్రాన్స్‌పోర్ట్‌ సర్వీసుల్ని ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకువస్తోంది. 
ఇక ఆన్‌లైన్‌లోనే 58రకాల రవాణా సేవలు
ఇక ఆన్‌లైన్‌లోనే 58రకాల రవాణా సేవలు (HT_PRINT)

ఇక ఆన్‌లైన్‌లోనే 58రకాల రవాణా సేవలు

News Transport Services దేశ వ్యాప్తంగా 58 ట్రాన్స్‌పోర్ట్‌ సేవలు పౌరులకు అందుబాటులోకి రానున్నాయి. కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ 58రకాల సేవల్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ సేవల కోసం రవాణాశాఖ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఆన్‌లైన్‌లోనే పొందే అవకాశం కల్పించింది. ఇంటి నుంచి ప్రజలు తమ పనుల్ని పూర్తి చేసుకునేందుకు వీలవుతుంది. ట్రాన్స్‌పోర్ట్‌ సేవల్ని ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకురావడానికి సంబంధించిన నోటిఫికేషన్‌ శనివారం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. లెర్నర్‌ లైసెన్స్‌ దరఖాస్తు, ఎల్‌ఎల్‌ఆర్‌లో మార్పులు, చేర్పులు, డ్రైవింగ్ లైసెన్స్‌ రెన్యూవల్‌‌తో పాటు మార్పులు చేర్పులు కూడా ఇకపై ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ట్రెండింగ్ వార్తలు

Japan rice balls : చంకలో పెట్టి.. చెమటతో తయారు చేసిన ఈ ఫుడ్​ని ఎగబడి తింటున్నారు!

Heatwave alert : తెలుగు రాష్ట్రాల్లో ఇంకొన్ని రోజుల పాటు భానుడి భగభగలు- ఆ తర్వాత భారీ వర్షాలు!

JNU PG Admissions 2024 : జేఎన్​యూ పీజీ రిజిస్ట్రేషన్​ ప్రక్రియ షురూ- ఇలా అప్లై చేసుకోండి..

‘‘వైవాహిక స్థితితో సంబంధం లేకుండా.. పరస్పర అనుమతితో లైంగిక సంబంధం తప్పు కాదు’’: ఢిల్లీ హైకోర్టు

వాహనాల రిజిస్ట్రేషన్‌, యాజమాన్య బదిలీ సేవలు కూడా News Transport Servicesలో భాగంగా ఆన్‌లైన్‌లో లభిస్తాయి. ఆధార్‌ కార్డు అందుబాటులో లేని వారు ప్రత్యామ్నయ పత్రాలను ఉపయోగించి ట్రాన్స్‌పోర్ట్‌ కార్యాలయాల్లో నేరుగా సేవల్ని అందుకోవచ్చు. ఆన్‌లైన్ సేవలకు ఆధార్‌ కార్డుత అనుసంధానించారు.

కొత్త ట్రాన్స్‌పోర్ట్‌ నిబంధనల్లో భాగంగా వాహనాలకు ఎలాంటి రిజిస్ట్రేషన్‌ లేనప్పుడు వాటికి ట్రేడ్‌ సర్టిఫికెట్లను News Transport Services మంజూరు చేస్తారు. అలాంటి వాహనాలను డీలర్లు, మాన్యుఫ్యాక్చర్లు, దిగుమతిదారులు, టెస్టింగ్ ఏజెన్సీలల వద్ద మాత్రమే ఉంచాలి. రిజిస్ట్రేసన్‌ కాని వాహనాలతో ప్రయాణించడం, వినియోగించడం చట్టవిరుద్ధమైన పనులుగా పరిగణిస్తారు.

ట్రాన్స్‌పోర్ట్‌ కార్యాలయాల్లో జారీ చేసే ధృవీకరణ పత్రాల కోసం ఆర్టీవోలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా వాహనాల పోర్టల్‌లోనే News Transport Services కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఎన్నిరకాల వాహనాలకైనా ఒకే దరఖాస్తులో అప్లై చేసుకోవచ్చు. నవంబర్ 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. లైసెన్స్‌ల జారీ, కండక్టర్‌ లైసెన్స్‌, వాహనాల రిజిస్ట్రేషన్‌, పర్మిట్ల జారీ, ఓనర్‌షిప్‌ బదిలీ వంటి సేవలు పూర్తిగా ఆన్‌లైన్‌లో లభించనున్నాయి. ప్రాంతీయ రవాణా శాఖ కార్యాలయాలతో సంబంధం లేకుండా నేరుగా ప్రజలు ఆన్‌లైన్‌లో వీటి కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

ఆధార్‌ ధృవీకరణతో అనుసంధానించి News Transport Services ఆన్‌లైన్ సేవల్ని అందుబాటులోకి తీసుకువచ్చినట్లు కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ సేవల కోసం రవాణా కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరంఉండదు. రవాణా కార్యాలయలకు వెళ్లకుండానే పౌరసేవల్ని పారదర్శకంగా అందించడానికే కొత్త సంస్కరణలు అమల్లోకి తీసుకువచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.