తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Nitin Gadkari Gets Death Threat: గడ్కరీని చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్

Nitin Gadkari gets death threat: గడ్కరీని చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్

HT Telugu Desk HT Telugu

14 January 2023, 16:29 IST

  • Nitin Gadkari gets death threat: బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని చంపేస్తామని బెదిరింపు కాల్స్ వచ్చాయి. నాగపూర్ లోని ఆయన ఆఫీస్ కు ఈ ఫోన్ కాల్స్ వచ్చాయి.

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ

Nitin Gadkari gets death threat: కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) కి బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయి. ఆయనను కాల్చి చంపేస్తామని ఆ ఫోన్ కాల్స్ లో ఆగంతకుడు బెదిరించాడు.

ట్రెండింగ్ వార్తలు

Chardham Yatra 2024: చార్ ధామ్ యాత్రకు ఆఫ్ లైన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యే తేదీ ఇదే; ఆన్ లైన్ లో కూడా చేసుకోవచ్చు

Jammu and Kashmir news: భద్రతా బలగాలపై ఉగ్రవాదుల కాల్పులు; ఐదుగురు జవాన్లకు గాయాలు

IGNOU July 2024 session: ఇగ్నో లో జులై సెషన్ కు రీ రిజిస్ట్రేషన్ విండో ఓపెన్; విద్యార్థులు ఇలా రిజిస్టర్ చేసుకోండి..

Unnatural intercourse: ‘‘భార్యతో అసహజ పద్దతుల్లో శృంగారం చేయడం రేప్ కిందకు రాదు’’ - ఎంపీ హైకోర్టు

Nitin Gadkari gets death threat: ఆఫీస్ ను కూడా పేల్చేస్తాం..

నాగపూర్ లోని నితిన్ గడ్కరీ (Nitin Gadkari) కార్యాలయానికి శనివారం ఉదయం ఈ బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయి. నితిన్ గడ్కరీని చంపేస్తామని, ఆయన ఆఫీస్ ను పేల్చేస్తున్నామని అందులో బెదిరించారు. శనివారం ఉదయం 11.25 గంటలకు, 11.32 గంటలకు, మధ్యాహ్నం 12.32 గంటలకు ఆఫీస్ ల్యాండ్ లైన్ ఫోన్ కు ఈ బెదిరింపు కాల్స్ వచ్చాయి. వెంటనే గడ్కరీ (Nitin Gadkari) ఆఫీస్ సిబ్బంది ఈ విషయాన్ని పోలీసులకు తెలిపారు. ఆఫీస్ సిబ్బంది ఇచ్చిన సమాచారం మేరకు ఫిర్యాదు తీసుకున్న పోలీసులు.. ఆ బెదిరింపు కాల్స్ చేసిన వారి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు. గడ్కరీ (Nitin Gadkari) నాగపూర్ ఆఫీస్ కు చెందిన బీఎస్ఎన్ ఎల్ ల్యాండ్ లైన్ కు వచ్చిన కాల్ డేటా ను పరిశీలిస్తున్నారు. ఒక్కరే ఆ కాల్స్ చేశారా? లేక ఎక్కువ మంది ఉన్నారా? అనే విషయంపై కూడా ఆరా తీస్తున్నారు. ఈ బెదిరింపు కాల్స్ నేపథ్యంలో నాగపూర్ లోని గడ్కరీ ఆఫీస్ వద్ద భద్రతను మరింత పెంచారు. దేశ రాజకీయాల్లో నితిన్ గడ్కరీ (Nitin Gadkari) కి సమర్ధుడైన నాయకుడిగా, అజాత శత్రువుగా పేరుంది.