Nitin Gadkari falls ill: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి స్వల్ప అస్వస్థత-in siliguri nitin gadkari falls ill after programme attended by doctors ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  In Siliguri, Nitin Gadkari Falls Ill After Programme; Attended By Doctors

Nitin Gadkari falls ill: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి స్వల్ప అస్వస్థత

HT Telugu Desk HT Telugu
Nov 17, 2022 10:02 PM IST

Nitin Gadkari falls ill: కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత నితిన్ గడ్కరీ గురువారం స్వల్ప అస్వస్థతకు లోనయ్యారు. పశ్చిమ బెంగాల్ లో ని సిలిగురిలో ఆయన స్వల్పంగా అనారోగ్యానికి గురయ్యారు.

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ (PTI)

Nitin Gadkari falls ill: కేంద్ర రహదారులు, ఉపరితల రవాణా శాఖ మంత్రి ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ లో పర్యటిస్తున్నారు. ఉత్తర బెంగాల్ లో రూ. 1206 కోట్ల విలువైన నేషనల్ హైవే ప్రాజెక్టులకు గురువారం ఆయన శంకుస్థాపన చేశారు.

ట్రెండింగ్ వార్తలు

Nitin Gadkari falls ill: సిలిగురిలో..

ఈ సందర్భంగా సిలిగురిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న నితిన్ గడ్కరీ వేదిక పైననే స్వల్పంగా అస్వస్థతకు లోనయ్యారు. వెంటనే వైద్యులు ఆయనను పరీక్షించి చికిత్స అందించారు. అనంతరం, ఆయన తేరుకున్నారని స్థానిక బీజేపీ ఎమ్మెల్యే నీరజ్ జింబా వెల్లడించారు. ‘కార్యక్రమం పూర్తి కాగానే, వేదికపై ఉన్న గడ్కరీజీ తనకు కొద్దిగా ఇబ్బందిగా ఉందని చెప్పారు. వెంటనే ఆయనను వేదిక వెనుకకు తీసుకువెళ్లి, వైద్యులు చికిత్స అందించారు. కాసేపటికి తేరుకున్న కేంద్ర మంత్రి తన కాన్వాయ్ తో పాటు వెళ్లిపోయారు’ అని నీరజ్ జింబా వివరించారు.

Nitin Gadkari falls ill: డార్జిలింగ్ ఎంపీ ఇంటికి..

సిలిగురిలో జరిగిన కార్యక్రమంలో అస్వస్థతకు లోనైన గడ్కరీ.. అక్కడ కాస్త తేరుకున్న అనంతరం, డార్జిలింగ్ ఎంపీ రాజు బిస్తా ఇంటికి వెళ్లారని బీజేపీ వర్గాలు తెలిపాయి. బెంగాల్ లో జరిగిన కార్యక్రమాల్లో రాజు బిస్తా కూడా నితిన్ గడ్కరీతో పాటే ఉన్నారు. అయితే, కేంద్ర మంత్రి గడ్కరీ ఏ విధమైన అనారోగ్యానికి గురయ్యారనే విషయంపై ఎలాంటి సమాచారం లేదు.

WhatsApp channel