తెలుగు న్యూస్  /  National International  /  Nia Raids At Least 60 Locations Across Kerala Linked To Banned Pfi Leaders

NIA raids at least 60 locations across Kerala: కేరళలో ఎన్ఐఏ ఆకస్మిక దాడులు

HT Telugu Desk HT Telugu

29 December 2022, 16:33 IST

    • NIA raids on PFI outfit: నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(National Investigation Agency NIA) గురువారం కేరళ రాష్ట్రవ్యాప్తంగా ఆకస్మిక దాడులు చేపట్టింది.
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (HT Photo)

ప్రతీకాత్మక చిత్రం

NIA raids on PFI outfit: కేరళలో ప్రారంభమై, దేశవ్యాప్తంగా విస్తరించిన నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(Popular Front of India PFI) సంస్థ సభ్యులు, నాయకుల ఇళ్లు, కార్యాలయాలపై ఎన్ఐఏ (NIA) దాడులు చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా 60 ప్రాంతాల్లో గురువారం ఉదయం ఒకేసారి దాడులు నిర్వహించింది.

ట్రెండింగ్ వార్తలు

Politician affair : దత్త పుత్రుడితో బెడ్​ మీద ప్రముఖ రాజకీయ నేత- నగ్నంగా భర్తకు దొరికిపోయి..

Brij Bhushan : బ్రిజ్​ భూషణ్​ కుమారుడికి బీజేపీ టికెట్​- రెజ్లర్ల స్పందన ఇది..

US Presidential Election 2024: ‘‘మళ్లీ జో బైడెన్ గెలుస్తారు’’- అమెరికా అధ్యక్ష ఎన్నికలపై 'నోస్ట్రాడమస్' జోస్యం

Parents sue Serum Institute: కోవి షీల్డ్ తో కూతురి మృతి!; సీరమ్ ఇన్స్టిట్యూట్ పై కేసు వేసిన పేరెంట్స్

NIA raids on PFI outfit: సెప్టెంబర్ లో నిషేధం

దేశ వ్యతిరేక కార్యకలాపాలకు, విద్వేషాలను రెచ్చగొట్టే కార్యక్రమాలకు, ఉగ్రవాద చర్యలకు, ఉగ్రవాద చర్యలకు, దేశద్రోహానికి పాల్పడుతోందని ఆరోపిస్తూ Popular Front of India (PFI) పై కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరం జనవరిలో నిషేధం విధించింది. దాంతో, ఆ సంస్థ పేరును మార్చి, మళ్లీ కార్యకలాపాలను ప్రారంభించే ప్రయత్నాల్లో ఉందన్న సమాచారం నేపథ్యంలో ఎన్ఐఏ (NIA) ఈ దాడులు చేపట్టింది. నిషేధిత పీఎఫ్ఐ(PFI) సంస్థ నాయకులుగా భావిస్తున్న వారికి చెందిన ఎర్నాకులంలోని 8 ప్రదేశాలు, తిరువనంతపురంలోని 6 ప్రదేశాల్లో ఎన్ఐఏ దాడులు చేసింది. గురువారం ఉదయం నాలుగు గంటల ప్రాంతంలో ప్రారంభమైన ఈ దాడులు మధ్నాహ్నం వరకు కూడా కొనసాగుతూనే ఉన్నాయి. నిషేధిత పీఎఫ్ఐ (PFI) కి చెందిన విలువైన సమాచారాన్ని ఎన్ఐఏ (NIA) స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.

NIA raids on PFI outfit: విశ్వసనీయ సమాచారం మేరకు

ఇప్పటికే ఉగ్రవాదం, హత్యల వంటి వివిధ నేరాల కింద అరస్టైన పీఎఫ్ఐ (PFI) కార్యకర్తలు ఇచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు ఎన్ఐఏ ఈ దాడులు చేపట్టింది. 2006లో కేరళలో ఈ PFI ప్రారంభమైంది. ఆ తరువాత 2009లో సోషల్ డెమొక్రాటిక్ పార్టీ ఆఫ్ ఇండియా(Social Democratic Party of India) అనే రాజకీయ పార్టీని కూడా ప్రారంభించారు. ఆ తరువాత ఈ సంస్థ కర్నాటక నుంచి పశ్చిమ బెంగాల్ వరకు దేశవ్యాప్తంగా విస్తరించింది.

టాపిక్