తెలుగు న్యూస్  /  National International  /  Neet Counselling 2022: Mcc To Release Schedule Soon, Check Details

NEET Counselling 2022 : ఈ నెల చివర్లో నీట్​ కౌన్సిలింగ్​ ప్రారంభం..!

Sharath Chitturi HT Telugu

13 September 2022, 11:02 IST

    • NEET Counselling 2022 dates : నీట్​ కౌన్సిలింగ్​ కోసం అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. కాగా.. ఈ నెల చివర్లో నీట్​ కౌన్సిలింగ్​ మొదలయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
నీట్​ కౌన్సిలింగ్​
నీట్​ కౌన్సిలింగ్​ (HT_PRINT)

నీట్​ కౌన్సిలింగ్​

NEET Counselling 2022 dates : నీట్​ 2022 ఫలితాలను వెల్లడించింది ఎన్​టీఐ(నేషనల్​ టెస్టింగ్​ ఏజెన్సీ). మంచి ర్యాంకులు సాధించిన అభ్యర్థులు ఇప్పుడు నీట్​ యూజీ కౌన్సిలింగ్​ కోసం ఎదురుచూస్తున్నారు. నీట్​ 2022 కౌన్సిలింగ్​ను మెడికల్​ కౌన్సిలింగ్​ కమిటీ నిర్వహించనుంది.

ట్రెండింగ్ వార్తలు

US Presidential Election 2024: ‘‘మళ్లీ జో బైడెన్ గెలుస్తారు’’- అమెరికా అధ్యక్ష ఎన్నికలపై 'నోస్ట్రాడమస్' జోస్యం

Parents sue Serum Institute: కోవి షీల్డ్ తో కూతురి మృతి!; సీరమ్ ఇన్స్టిట్యూట్ పై కేసు వేసిన పేరెంట్స్

IMD predictions: మే 4 నుంచి తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు: ఐఎండీ హెచ్చరిక

Salman Khan: సల్మాన్ ఖాన్ ఇంట్లో కాల్పుల ఘటనలో నిందితుడు అనూజ్ థాపన్ అనుమానాస్పద మృతి

కాగా.. ఈ నెల చివరి నుంచి నీట్​ యూజీ కౌన్సిలింగ్​ మొదలయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. నీట్​ యూజీ కౌన్సిలింగ్​ డేట్స్​పై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

నీట్​ యూజీ కౌన్సిలింగ్​ 2022కి ఎలా అప్లై చేయాలంటే..

ముందుగా mcc.nic.in వెబ్​సైట్​కి వెళ్లాలి.

హోం పేజ్​లో 'UG Medical Counselling' సెక్షన్​ మీద క్లిక్​ చేయాలి.

ఒక్కసారి కౌన్సిలింగ్​ మొదలైతే.. రిజిస్ట్రేషన్​ లింక్​ అక్కడ కనిపిస్తుంది. దాని మీద క్లిక్​ చేయాలి.

NEET counselling 2022 registration : సంబంధిత వివరాలను టైప్​ చేసి రిజిస్టర్​ చేసుకోవాల్సి ఉంటుంది.

లాగిన్​ అయ్యి.. అప్లికేషన్​ ఫామ్​ని ఫిల్​ చేయాలి.

సంబంధిత పత్రాలను అప్లోడ్​ చేసి.. రిజిస్ట్రేషన్​ ఫీ కట్టాలి. ఫామ్​ని సబ్మిట్​ చేయాలి. అప్లికేషన్​ ఫామ్​ని ప్రింటవుట్​ తీసుకోవాలి.

ఆ తర్వాత.. నీట్​ యూజీ కౌన్సిలింగ్​కు వెళ్లి సీట్​ అలాట్మెంట్​ చేసుకోవాలి. కొన్ని రోజులకు అలాట్మెంట్​ ఫలితాలను వెల్లడిస్తారు. ఆ తర్వాత అలాట్​ అయిన కాలేజీకి వెళ్లి రిపోర్టు చేయాలి.

నీట్​ యూజీ కౌన్సిలింగ్​కి ముందు.. వివిధ కాలేజీల్లో అందుబాటులో ఉన్న సీట్లకు సంబంధించిన వివరాలను ఎంసీసీ ప్రకటిస్తుంది. కౌన్సిలింగ్​లో పాల్గొనాలంటే నీట్​ ర్యాంకు కార్డును డౌన్​లోడ్​ చేసుకుని పెట్టుకోవాలి.

నీట్​ యూజీ కౌన్సిలింగ్​- ఎంసీసీ బాధ్యతలు..

  • NEET UG counselling 2022 : జమ్ముకశ్మీర్​ను మినహాయించి.. ఇతర రాష్ట్రాల్లో 15శాతం ఆల్​ ఇండియా ఇండియా కోటా ఎంబీబీఎస్​/డీబీఎస్​ సీట్లు
  • బీహెచ్​యూలో 100శాతం ఎంబీబీఎస్​/బీడీఎస్​ సీట్లు
  • జిప్​మేర్​ (పుదుచ్చేరి, కరైకల్​) సీట్లు
  • ఏఎంయూ సీట్లు
  • డీయూ/ఐపీ వర్సిటీల్లో 15శాతం ఏఐక్యూ సీట్లు
  • 100శాతం డెంటిస్ట్రీ, జామియా మిలియా ఇస్లామియా ఫ్యాకల్టీ సీట్లు
  • ఈఎస్​ఐసీలో 15శాతం ఏఐక్యూ సీట్లు

పైన చెప్పిన సీట్లకు కౌన్సిలింగ్​ నిర్వహించే బాధ్యత మెడికల్​ కౌన్సిలింగ్​ కమిటీదే

ఏఐక్యూ సీట్లకు రిజర్వేషన్​

  • ఎస్​సీ- 15శాతం
  • ఎస్​టీ- 7.5శాతం
  • ఓబీసీ- 27శాతం
  • ఈడబ్ల్యూఎస్​- 10శాతం
  • పీడబ్ల్యూడీ- 5శాతం