తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Nasa Dart Mission : 'కొత్త శకం ఆరంభం'- నాసా డార్ట్​ మిషన్​ సక్సెస్​!

NASA Dart mission : 'కొత్త శకం ఆరంభం'- నాసా డార్ట్​ మిషన్​ సక్సెస్​!

Sharath Chitturi HT Telugu

27 September 2022, 7:30 IST

    • NASA Dart mission live :  భూమిని ఏదైనా భారీ గ్రహశకలం ఢీకొంటే భారీ వినాశనం తప్పదు! దానిని ముందే పసిగట్టి.. అంతరిక్షంలోనే అడ్డుకొవచ్చా? అన్న ప్రశ్నకు సమాధానం కనిపెట్టింది నాసా. ఇందుకోసం ప్రయోగించిన డార్ట్​ మిషన్​.. విజయవంతమైంది.
'కొత్త శకం ఆరంభం'- నాసా డార్ట్​ మిషన్​ సక్సెస్​!
'కొత్త శకం ఆరంభం'- నాసా డార్ట్​ మిషన్​ సక్సెస్​! (AFP)

'కొత్త శకం ఆరంభం'- నాసా డార్ట్​ మిషన్​ సక్సెస్​!

NASA DART mission : గ్రహశకలాల నుంచి భూమిని, మానవాళిని రక్షించేందుకు నాసా చేపట్టిన డార్ట్​ మిషన్​ విజయవంతమైంది. ప్రయోగంలో భాగంగా నాసా పంపించిన ఓ స్పేస్​షిప్​.. లక్ష్యాన్ని ఢీకొట్టి, దాని దారిని మళ్లించింది! దీంతో ప్రపంచంలో కొత్త శకం మొదలైందని నాసా ప్రకటించింది. డార్ట్​ మిషన్​కు సంబంధించిన దృశ్యాలను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసింది.

ట్రెండింగ్ వార్తలు

‘‘వైవాహిక స్థితితో సంబంధం లేకుండా.. పరస్పర అనుమతితో లైంగిక సంబంధం తప్పు కాదు’’: ఢిల్లీ హైకోర్టు

CBSE Results 2024: సీబీఎస్ఈ రిజల్ట్స్ పై కీలక అప్ డేట్; 10వ తరగతి, 12 తరగతి పరీక్షల ఫలితాలు ఎప్పుడంటే?

CSIR UGC NET : సీఎస్​ఐఆర్​ యూజీసీ నెట్​ జూన్ 2024​ రిజిస్ట్రేషన్లు షురూ..

Politician affair : దత్త పుత్రుడితో బెడ్​ మీద ప్రముఖ రాజకీయ నేత- నగ్నంగా భర్తకు దొరికిపోయి..

ఏంటి ఈ డార్ట్​ మిషన్​..?

చిన్న చిన్న గ్రహశకలాలు భూమివైపు దూసుకొస్తే పెద్దగా ప్రమాదం ఉండదు. కానీ హాలీవుడ్​ సినిమాల్లో చూపించే విధంగా.. భారీ ఆకారంలోని గ్రహశకలాలు భూమిపై పడితే విధ్వంసం తప్పదు! వాటిని అంతరిక్షంలోనే అడ్డుకునేందుకు ఏదైనా మార్గం ఉందా? అన్న ప్రశ్నకు సమాధానమే ఈ డార్ట్​ మిషన్​. ఇది సక్సెస్​ అవ్వడంతో.. ఎలాంటి గ్రహశకలాలనైనా.. దారి మళ్లించడం కుదురుతుందని, తద్వారా భూమికి ప్రమాదం తప్పుతుందని రుజువైంది.

NASA DART mission live : ఈ ప్రయోగం కోసం వెండింగ్​ మెషిన్​ సైజులో ఉన్న ఓ స్పేస్​క్రాఫ్ట్​ను రూపొందించారు శాస్త్రవేత్తలు. తమ ప్రయోగం కోసం భూమికి 7మిలియన్​ మైళ్ల దూరంలో ఉన్న జంట గ్రహశకలాలు డిమోర్ఫస్​, డిడిమొస్​లను ఎంచుకున్నారు. ఈ రెండు గ్రహశకలాలు ఒకదాని చుట్టు మరొకటి తిరుగుతూ ఉంటాయి. వాస్తవానికి ఈ జంట గ్రహశకలాలతో మనకి ముప్పు లేదు. ప్రయోగం కోసం మాత్రమే వీటిని ఎంపిక చేసుకున్నారు. డిమోర్ఫస్​.. ఫుట్​బాల్​ స్టేడియం సైజులో ఉంది.

ఇక డార్ట్​ మిషన్​లో భాగంగా 10 నెలల క్రితం లాంచ్​ చేసిన స్పేస్​క్రాఫ్ట్​.. తాజాగా డిమోర్ఫస్​ గ్రహశకలాన్ని.. గంటకు 14,500మైళ్ల(23,500కి.మీల) వేగంతో ఢీకొట్టింది. ఫలితంగా దాని కక్షలో మార్పులు చోటుచేసుకుంటాయని నాసా భావిస్తోంది. ప్రస్తుతం డిడిమోస్​ చుట్టూ తిరిగేందుకు డిమోర్ఫస్​కు 11 గంటల 55 నిమిషాల సమయం పడుతోంది. తాజా ప్రయోగంతో అది ఇంకో 10నిమిషాలు పెరిగుతుంది!

NASA DART mission success : గ్రహశకలాన్ని ఢీకొట్టి స్పేస్​క్రాఫ్ట్​ ముందు భాగానికి ఓ కెమెరా ఉంది. అందులో ఆ దృశ్యాలు రికార్డు అయ్యాయి. వాటిని నాసా విడుదల చేసింది. అయితే.. డార్ట్​ మిషన్​లో భాగంగా కొన్ని వారాల ముందే ఎల్​ఐసీఐఏక్యూబ్​ అనే ఉపగ్రహం.. వ్యవస్థ నుంచి విడిపోయింది. స్పేస్​క్రాఫ్ట్​ వెనకాలే ఇది ప్రయాణిస్తోంది. గ్రహశకలాన్ని ఢీకొట్టిన తర్వాతి పరిస్థితులను తెలుసుకునేందుకు ఈ ఉపగ్రహం ఉపయోగపడుతుంది. ఇందులో ఉన్న కెమెరా.. ఫొటోలు, వీడియోలు తీస్తుంది. మరికొన్న వారాలు లేదా నెలల్లో ఇవి నాసాకు చేరుతాయి.

ఈ విషయంపై శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భూమి, ప్రజలు మరింత ప్రశాంతంగా పడుకోవచ్చని అంటున్నారు.