తెలుగు న్యూస్  /  National International  /  Musk Warns Twitter Bankruptcy Possible If Cash Burn Lingers

Musk Warns Twitter staff: ‘‘వారానికి 80 గంటల వర్క్; నో వర్క్ ఫ్రం హోం’’

HT Telugu Desk HT Telugu

11 November 2022, 18:13 IST

  • Musk Warns Twitter staff:  ట్విటర్ ఉద్యోగులకు కొత్త యజమాని ఇలాన్ మస్క్ వరుస షాక్ లను ఇస్తున్నారు. ఇప్పటికే సడెన్ లే ఆఫ్స్ తో షాక్ ఇచ్చిన మస్క్.. మరిన్ని షరతులను ఉద్యోగుల ముందుంచారు. 

     

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (REUTERS)

ప్రతీకాత్మక చిత్రం

Musk Warns Twitter staff: 44 బిలియన్ డాలర్ల డీల్ తో ట్విటర్ ను కొనుగోలు చేసిన మస్క్.. బాధ్యతలు తీసుకున్న తొలి రోజు నుంచే సంచలనాలకు తెర తీశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉద్యోగుల్లో దాదాపు సగం మందికి ఉద్వాసన పలికారు. వారిలో అత్యంత సీనియర్ ఉద్యోగులు కూడా ఉన్నారు.

ట్రెండింగ్ వార్తలు

Lok Sabha election : మొబైల్​ నెంబర్​తో మీ పోలింగ్​ స్టేషన్​ లొకేషన్​ని ఇలా తెలుసుకోండి..

Prachi Nigam : 'చాణక్యుడిని కూడా..'- ట్రోల్స్​పై స్పందించిన యూపీ క్లాస్​ 10 టాపర్​

ICSE exam results 2024 : త్వరలో ఐసీఎస్​ఈ ఫలితాలు- ఇలా చెక్​ చేసుకోండి..

Miss Universe: మిస్ యూనివర్స్ బ్యూనోస్ ఎయిర్స్ పోటీలో విజేతగా నిలిచింది ఒక 60 ఏళ్ల మోడల్..

Musk Warns Twitter staff: నో వర్క్ ఫ్రం హోం..

ట్విటర్ యాజమాన్య బాధ్యతలు తీసుకున్న తరువాత ఇలాన్ మస్క్ తొలిసారి ఉద్యోగులకు ఇచ్చిన సందేశంలో మరిన్ని ఘాటు షరతులు విధించారు. అందులో ముఖ్యమైనది ఇంటి నుంచి పని చేసే అవకాశాన్ని తొలగించడం. వర్క్ ఫ్రమ్ హోం ఆప్షన్ తొలగిస్తున్నామని, ఉద్యోగులు వెంటనే తమతమ ఆఫీసుల్లో రిపోర్ట్ చేయాలని ఆయన ఆదేశించారు. అలా కుదరదు అనుకున్నవారు రిజైన్ చేయొచ్చని స్పష్టం చేశారు.

Musk Warns Twitter staff: 80 గంటల పని..

అంతేకాదు, ఉద్యోగులు మరిన్ని త్యాగాలకు సిద్ధం కావాలని మస్క్ పిలుపునిచ్చారు. మరింత ఆదాయాన్ని పొందే విధంగా విధానాలను రూపొందించుకోవాలని, లేదంటే దివాళా తీయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరించారు. ఉద్యోగులు వారానికి 80 గంటలు పని చేయాల్సి ఉంటుందని, అందుకు సిద్ధం కావాలని స్పష్టం చేశారు. అలాగే, ఫ్రీ ఫుడ్ లాంటి సదుపాయాలపై ఆశలు వదులుకోవాలన్నారు.

Musk Warns Twitter staff: సంస్థను వదిలేస్తున్న ఉద్యోగులు

ఇప్పటికే దాదాపు 50% ఉద్యోగులకు మ్క్ తొలగించగా, మిగిలిన వారిలో కూడా కొందరు సీనియర్లు తమ ఉద్యోగాలకు రిజైన్ చేశారు. ట్విటర్ చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్, చీఫ్ ప్రైవసీ ఆఫీసర్, చీఫ్ కంప్లయన్స్ ఆఫీసర్ లు గురువారం సంస్థకు రాజీనామా చేశారు. మస్క్ ప్రారంభించిన కొత్త విధానాలతో యూజర్ల డేటా సురక్షితంగా ఉండదన్న అనుమానాలు ప్రారంభమయ్యాయి.