తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  లైంగిక దాడితో పసిపాప మృతి.. తల్లిదండ్రుల అరెస్ట్

లైంగిక దాడితో పసిపాప మృతి.. తల్లిదండ్రుల అరెస్ట్

HT Telugu Desk HT Telugu

05 October 2022, 14:34 IST

    • చిన్నారిపై లైంగిక దాడి కేసులో ఆ పాప తల్లిదండ్రులనే అనుమానిస్తూ పోలీసులు అరెస్టు చేశారు.
లైంగిక దాడి కేసులో చిన్నారి తల్లిదండ్రులను అరెస్టు చేసిన పోలీసులు
లైంగిక దాడి కేసులో చిన్నారి తల్లిదండ్రులను అరెస్టు చేసిన పోలీసులు

లైంగిక దాడి కేసులో చిన్నారి తల్లిదండ్రులను అరెస్టు చేసిన పోలీసులు

రెండేళ్ల కుమార్తె లైంగిక వేధింపులకు గురై మృతి చెందిన ఘటనలో పాప తల్లిదండ్రులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితులుగా అనుమానిస్తూ బాలిక తండ్రిని అక్టోబర్ 1న, తల్లిని రెండు రోజుల తర్వాత అరెస్టు చేసినట్లు పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు

Japan rice balls : చంకలో పెట్టి.. చెమటతో తయారు చేసిన ఈ ఫుడ్​ని ఎగబడి తింటున్నారు!

Heatwave alert : తెలుగు రాష్ట్రాల్లో ఇంకొన్ని రోజుల పాటు భానుడి భగభగలు- ఆ తర్వాత భారీ వర్షాలు!

JNU PG Admissions 2024 : జేఎన్​యూ పీజీ రిజిస్ట్రేషన్​ ప్రక్రియ షురూ- ఇలా అప్లై చేసుకోండి..

‘‘వైవాహిక స్థితితో సంబంధం లేకుండా.. పరస్పర అనుమతితో లైంగిక సంబంధం తప్పు కాదు’’: ఢిల్లీ హైకోర్టు

సెప్టెంబరు 16న ఐజ్వాల్‌లో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చిన్నారి మృతిచెందింది. ఆసుపత్రి నిర్వహించిన పరీక్షల్లో లైంగిక వేధింపులుగా తేలడంతో లైంగిక నేరాల నుండి పిల్లల నిరోధక చట్టం కింద సెప్టెంబర్ 20న కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

తీవ్రమైన శ్వాసకోశ బాధతో చిన్నారి చనిపోయిందని, అయితే పాప మర్మాంగాలపై ‘అసహజ సంకేతాలు’ కనిపించాయని, ఆమె మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించిన సమయంలో ఆ సంకేతాలు కనిపించాయని ప్రకటన పేర్కొంది.

ఐజ్వాల్‌లోని ప్రభుత్వ వైద్యులు పాప శరీరాన్ని పరిశీలించారు. మర్మాంగాల నుంచి వీర్యం ఆనవాళ్లు లభించనప్పటికీ, అక్కడ మానిన గాయాలను కనుగొన్నారు.

ఈ ఘటనపై అనుమానం ఉందని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. చిన్నారి తల్లిదండ్రులు, తాతలు, ఇతర బంధువులను పోలీసులు ప్రశ్నించారు.

చిన్నారి ఎల్లప్పుడూ వారి వద్దే ఉంటున్నందున తల్లిదండ్రులు ప్రధాన అనుమానితులని ఆ ప్రకటన పేర్కొంది. సందర్భానుసార సాక్ష్యాధారాల ఆధారంగా తండ్రిని, విచారణ నిమిత్తం తల్లిని అరెస్టు చేసినట్లు పేర్కొంది.